బౌన్స్ ఎలక్ట్రిక్ సేవలకు గ్రీన్ సిగ్నల్, టెస్ట్ రైడ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం

బెంగళూరుకు చెందిన రైడ్-షేరింగ్ ప్లాట్‌ఫామ్ బౌన్స్ దేశంలో తమ ఈవీ కార్యకలాపాలను కిక్‌స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. బౌన్స్ త్వరలోనే దేశంలో తమ రైడ్ షేరింగ్ విభాగంలో స్వీయ-నిర్మిత ఈవీ స్కూటర్లను పరిచయం చేయనున్నట్లు తెలిపింది.

బౌన్స్ ఎలక్ట్రిక్ సేవలకు గ్రీన్ సిగ్నల్, టెస్ట్ రైడ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం

బౌన్స్ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ వివేకానంద హెచ్ఆర్ ఇటీవల చేసిన ట్వీట్ ప్రకారం, తమ రెట్రోఫిట్ ఈవీ సిద్ధంగా ఉందని, అందుకు సంబంధించిన అన్ని ఆమోదాలు తమకు లభించాయని తెలిపారు. ఈ శనివారం సిసిడి అశోక పిల్లర్ వద్ద పరిమిత సంఖ్యలో టెస్ట్ రైడ్‌లు నిర్వహించనున్నామని, ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు.

బౌన్స్ ఎలక్ట్రిక్ సేవలకు గ్రీన్ సిగ్నల్, టెస్ట్ రైడ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం

బౌన్స్ దేశంలో తమ స్వీయ-నిర్మిత (సెల్ఫ్-మేడ్) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టడానికి అవసరమైన అనుమతులను ప్రభుత్వం నుండి పొందింది. ఈ నేపథ్యంలో రెట్రో-ఫిట్ స్కూటర్లను పరీక్షించడానికి కంపెనీ తమ వినియోగదారులను మరియు అభిమానులను ఆహ్వానిస్తోంది. ఇవి త్వరలోనే బౌన్స్ యొక్క ప్రస్తుత ద్విచక్ర వాహనాలకు జోడించబడుతాయి.

MOST READ:పట్టాలెక్కనున్న కొత్త డబుల్ డెక్కర్ ట్రైన్స్ ; ఎప్పుడో తెలుసా ?

బౌన్స్ ఎలక్ట్రిక్ సేవలకు గ్రీన్ సిగ్నల్, టెస్ట్ రైడ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం

బౌన్స్ సీఈఓ చేసిన ట్వీట్ ప్రకారం, స్వీయ-నిర్మిత బౌన్స్ స్కూటర్ కోసం టెస్ట్ రైడ్ నవంబర్ 28, 2020 నుండి ప్రారంభమవుతుంది. టెస్ట్ రైడ్ యొక్క మొదటి దశ బెంగళూరులోని జైనగర్‌లో ఉన్న అశోక పిల్లర్ పక్కన ఉన్న కేఫ్ కాఫీ డేలో జరుగుతుంది.

బౌన్స్ ఎలక్ట్రిక్ సేవలకు గ్రీన్ సిగ్నల్, టెస్ట్ రైడ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం

బౌన్స్ సెల్ఫ్ రైడ్ స్కూటర్లు మొదట్లో పెట్రోల్‌తో నడిచే స్కూటర్లతో ప్రారంభమయ్యాయి. ఈ సేవల కోసం కంపెనీ టీవీఎస్ స్కూటీ జెస్ట్ స్కూటర్లను వినియోగించింది. అయితే, దేశవ్యాప్తంగా ఈవీల వాడకాన్ని ప్రోత్సహించడానికి, ఈ పెట్రోల్‌తో నడిచే స్కూటర్లను ఎలక్ట్రిక్ స్కూటర్లుగా మార్చాలని బౌన్స్ నిర్ణయించుకుంది.

MOST READ:అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్, అతడు నడిపే కార్లు

బౌన్స్ ఎలక్ట్రిక్ సేవలకు గ్రీన్ సిగ్నల్, టెస్ట్ రైడ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం

పెట్రోల్ ఇంజన్ మరియు ట్రాన్స్మిషన్ స్థానంలో రెట్రో-ఫిట్ ఈ-పవర్ట్రెయిన్ కిట్‌ను ఉపయోగించి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో మార్పులు చేసింది. కాగా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించిన ఛార్జ్ సమయం మరియు ఒకే బ్యాటరీ ఛార్జ్‌పై లభించే డ్రైవింగ్ రేంజ్ మొదలైన వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

బౌన్స్ ఎలక్ట్రిక్ సేవలకు గ్రీన్ సిగ్నల్, టెస్ట్ రైడ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం

ఈ సెల్ఫ్ రైడ్ బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్ని రకాల ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో సుదీర్ఘమైన రైడింగ్ రేంజ్‌ను కలిగి ఉంటాయని మేము ఆశిస్తున్నాము. ఈ సేవలను ఉపయోగిస్తున్నప్పుడు రేంజ్ గురించి ఆందోళన లేకుండా, ఎక్కువ మంది వినియోగదారులను ఈవీ స్కూటర్ల వైపుకు ఆకర్షించడానికి ఇది సహాయపడుతుందని అంచనా.

MOST READ:కుండపోత వర్షంలో నిలబడి 4 గంటలు డ్యూటీ చేసిన పోలీస్.. ఎక్కడో తెలుసా ?

బౌన్స్ ఎలక్ట్రిక్ సేవలకు గ్రీన్ సిగ్నల్, టెస్ట్ రైడ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం

బౌన్స్ ఇప్పటికే రెండు నెలల క్రితం ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసిఎటి) నుండి స్వీయ-నిర్మిత ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం హోమోలోగేషన్ ధృవీకరణను కూడా పొందింది. హోమోలోగేషన్ ధృవీకరణ ఈ-స్కూటర్‌లోని ల్యాంప్స్, మిర్రర్స్, టైర్స్ వంటి మరెన్నో భాగాలకు వర్తిస్తుంది.

బౌన్స్ ఎలక్ట్రిక్ సేవలకు గ్రీన్ సిగ్నల్, టెస్ట్ రైడ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం

ఈ ధృవీకరణ ప్రక్రియలో బ్రేకింగ్ మెకానిజం మరియు ఇతర ఎలక్ట్రానిక్ ఫిట్టింగుల కోసం కఠినమైన తనిఖీలు కూడా ఉంటాయి. స్వీయ-నిర్మిత ఎలక్ట్రిక్-స్కూటర్ పైన పేర్కొన్న ప్రతి పరీక్షలో మెరుగైన ఫలితాలను సాధించగలిగింది మరియు ఇప్పుడు ఇది కస్టమర్ల ద్వారా ఫైనల్ టెస్టింగ్ నిర్వహిస్తోంది.

MOST READ:వరల్డ్ రికార్డ్ సృష్టించడానికి సిద్దమవుతున్న శ్రీ సిద్ధరూధ స్వామీజీ రైల్వే స్టేషన్ ; వివరాలు

బౌన్స్ ఎలక్ట్రిక్ సేవలకు గ్రీన్ సిగ్నల్, టెస్ట్ రైడ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం

బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ సేవలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను పూర్తిగా అసెంబుల్ చేయటం లేదా బౌన్స్ ద్వారా రెట్రో-ఫిట్ చేయటం జరుగుతుంది. ఈవీలను తయారు చేయడానికి కంపెనీ ప్రస్తుతం ఉన్న పెట్రోల్ పవర్డ్ స్కూటర్లను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిని సాధారణ కస్టమర్ బేస్డ్ రెంటల్‌తో పాటుగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం, డెలివరీ మరియు ఇ-కామర్స్ కంపెనీల అవసరాల కోసం వీటిని వినియోగించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
The Bengaluru-based ride-sharing platform, Bounce, has announced that it is ready to kickstart its EV operations in the country. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X