లీక్ అయిన బిఎస్ 6 బజాజ్ పల్సర్ 125 స్పెసిఫికేషన్స్

పూణే ఆధారిత ద్విచక్ర వాహన తయారీదారు అయిన బజాజ్, బిఎస్-6 బజాజ్ పల్సర్ 125 స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ కొత్త బజాజ్ యొక్క లీక్ అయిన స్పెసిఫికేషన్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.. !

లీక్ అయిన బిఎస్ 6 బజాజ్ పల్సర్ 125 స్పెసిఫికేషన్స్

సాధారణంగా అన్ని సంస్థలు 2020 ఏప్రిల్ 1 నాటికి అన్ని వాహనాలను బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారుచేయాలి. ఈ నేపథ్యంలో బజాజ్ తన బ్రాండ్ మోటార్ సైకిల్ అయిన పల్సర్ 125 ని బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను అనుకూలంగా తయారు చేస్తుంది.

లీక్ అయిన బిఎస్ 6 బజాజ్ పల్సర్ 125 స్పెసిఫికేషన్స్

కొత్తగా వస్తున్న బిఎస్-6 బజాజ్ పల్సర్ 125 బిఎస్-4 మోడల్లో ఉపయోగించే అదే 124.4 సిసి సింగల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ద్వారా శక్తినివ్వనుంది. కానీ బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా ఉండేలా బజాజ్ ఆటో పల్సర్ 125 కి కొన్ని మార్పులు చేసింది.

లీక్ అయిన బిఎస్ 6 బజాజ్ పల్సర్ 125 స్పెసిఫికేషన్స్

బిఎస్-6 బజాజ్ పల్సర్ 125 కి చేసిన కొన్ని మార్పులను మనం గమనించినట్లైతే ఇందులో ఫ్యూయెల్ ఇంజక్షన్ సిస్టం అదనంగా ఉంటుంది. అంతే కాకుండా ఎక్స్ట్రా క్యాటలిటిక్ కన్వర్టర్ మరియు ఆక్సిజన్ సెన్సార్‌తో నవీకరించబడిన ఎగ్జాస్ట్ అసెంబ్లీ హానికరమైన ఉద్గారాలను తగ్గించడానికి సహాయపడుతుంది.

లీక్ అయిన బిఎస్ 6 బజాజ్ పల్సర్ 125 స్పెసిఫికేషన్స్

కొత్త బిఎస్-6 బజాజ్ పల్సర్ 124.4 సిసి ఇంజిన్ని కలిగి ఉంటుంది. ఇది 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 11.8 పిఎస్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కానీ శక్తి ఉత్పత్తి మాత్రం మునుపటి మోడల్ కంటే కొంత తక్కువగా ఉంటుందనే చెప్పవచ్చు. అయితే ఇది మంచి రైడింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది.

లీక్ అయిన బిఎస్ 6 బజాజ్ పల్సర్ 125 స్పెసిఫికేషన్స్

బిఎస్-6 పల్సర్ లో నవీనీకరించిన ఇంజిన్ యొక్క గరిష్ట టార్క్ అవుట్ పుట్ కచ్చితంగా తెలియదు, కానీ ఇది మునుపటిలాగా ఉంటుందని ఆశించవచ్చు. ట్రాన్స్మిషన్ విషయానికొస్తే ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

లీక్ అయిన బిఎస్ 6 బజాజ్ పల్సర్ 125 స్పెసిఫికేషన్స్

బజాజ్ యొక్క బిఎస్-6 పల్సర్ లో కొలతలలో ఎలాంటి మార్పు జరగలేదు. ఇది మునుపటి మోడల్ లాగానే 2,055 మిమీ పొడవు, 755 మిమీ వెడల్పు, 1,320 మిమీ వీల్‌బేస్ కలిగి ఉంటుంది.

లీక్ అయిన బిఎస్ 6 బజాజ్ పల్సర్ 125 స్పెసిఫికేషన్స్

బజాజ్ బిఎస్-6 పల్సర్ ఫీచర్స్ కూడా దాదాపు మునుపటిలాగే ఉంటాయి. ఇది సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కంపర్టబుల్ సింగిల్ పీస్ సీట్, అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక భాగంలో ట్విన్ గ్యాస్-ఛార్జ్డ్ షాక్ అబ్జార్బర్స్, వోల్ఫ్-ఐడ్ హాలోజన్ హెడ్లైట్స్ వంటివి ఉంటాయి.

Source: Indianautoblog

లీక్ అయిన బిఎస్ 6 బజాజ్ పల్సర్ 125 స్పెసిఫికేషన్స్

బజాజ్ ఆటో యొక్క మొదటి 250 సిసి మోటార్ సైకిల్ ఈ నెలలో విడుదల కానుంది. సంస్థ ఇటీవల బిఎస్-6 బైక్ యొక్క మొదటి వీడియో టీజర్‌ను కూడా విడుదల చేసింది.

Most Read Articles

English summary
Exclusive: BS-VI Bajaj Pulsar 125 specifications leaked. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X