బిఎస్ 6 బజాజ్ సిటి 100 కొత్త ధరలు & ఇతర వివరాలు
భారతదేశంలో బజాజ్ ఆటో తన ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్ సైకిల్ మరియు సిటి 100 బిఎస్ 6 మోడల్ ధరలను పెంచింది. కంపెనీ సిటి 100 ను రెండు వేరియంట్లలో విక్రయిస్తుంది. అవి కిక్ స్టార్ట్ మరియు సెల్ఫ్ స్టార్ట్. ఇప్పుడు ఈ రెండు వేరియంట్ల ధర రూ. 1,996 వరకు పెరిగింది.

బజాజ్ కంపెనీ ధరలు పెంచిన తరువాత ఎంట్రీ లెవల్ కిక్ స్టార్ట్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 42,790 వద్ద రిటైల్ అవుతుంది. టాప్-ట్రిమ్ సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్ ధర రూ. 50,470 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంటుంది. బిఎస్ 6 అప్‌డేట్ తర్వాత ఈ మోటార్‌సైకిల్‌కు ధరల పెంపు లభించడం ఇది రెండవసారి.

బిఎస్ 6 బజాజ్ సిటి 100 ధరల పెరుగుదల ఉన్నప్పటికీ, బ్రాండ్ భారతదేశంలో విక్రయించబడుతున్న అత్యంత సరసమైన మోటార్‌సైకిళ్లలో ఒకటిగా కొనసాగుతోంది. బిఎస్ 6 మోటార్‌సైకిల్‌లో ఫ్యూయెల్ ఇంజెక్షన్‌తో నవీకరించబడిన ఇంజన్ ఉంది.

సిటి 100 బిఎస్ 6 ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్ట్ 102 సిసి ఇంజన్ ద్వారా పనిచేస్తుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 7.5 బిహెచ్‌పి మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద వద్ద 8.34 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ స్టాండర్డ్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
| Variant | Old BS6 Price | New BS6 Price | Price Hike |
| Kick Start | ₹40,794 | ₹42,790 | ₹1,996 |
| Electric Start | ₹48,474 | ₹50,470 | ₹1,996 |

బజాజ్ సిటి 100 బైకులో నవీకరించబడిన ఇంజిన్ కాకుండా మరి ఏ ఇతర మార్పు ఉండదు. ఇది అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.5-లీటర్ ఇంధన ట్యాంక్, హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్-లాంప్స్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా ఇందులో హ్యాండిల్ బార్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో సరసమైన ధర కలిగిన మోటార్ సైకిల్ లో ఒకటి ఈ బజాజ్ సిటీ 100 బైక్. ఇది చాలా తక్కువ నిర్వహణతో పనిచేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మోటారుసైకిల్ దాదాపు 90 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో 10.5 లీటర్ ఇంధన ట్యాంక్ ఉండటం వల్ల ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే దాదాపు 945 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

బజాజ్ సిటి 100 బైక్ ముందు భాగంలో హైడ్రాలిక్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు వెనుక భాగంలో బ్రాండ్ యొక్క ‘ఎస్ఎన్ఎస్' సస్పెన్షన్ ఉన్నాయి. అంతే కాకుండా ఈ బైక్ లో యాంకరింగ్ ముందు భాగంలో 130 మిమీ డ్రమ్ బ్రేక్‌లు మరియు వెనుక వైపు 110 మిమీ డ్రమ్ బ్రేక్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ మోటారుసైకిల్ బరువు 114 కిలోలు వరకు ఉంటుంది. ఈ బైక్ ముందు మరియు వెనుక భాగంలో 17 అంగుళాల చక్రాలను కలిగి ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం :
దేశ వ్యాప్తంగా బజాజ్ సిటి 100 గ్రామీణ ప్రాంతాల్లో ఒక ప్రసిద్ధ మోటారుసైకిల్, ఎందుకంటే దాని అసాధారణమైన మైలేజ్ఇస్తుంది. అంతే కాకుండా చూడటానికి చాలా సరళంగా ఉంటుంది మరియు నిర్వహణ కూడా చాలా సులభంగా ఉంటుంది. భారతదేశంలో బిఎస్ 6 బజాజ్ సిటి 100 బైక్, హీరో స్ప్లెండర్ ప్లస్ మరియు టివిఎస్ స్పోర్ట్‌లకు ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








