డీలర్‌షిప్‌ వద్దకు చేరిన బిఎస్-6 బజాజ్ డామినార్ 400 బైక్, డెలివరీ ఎప్పుడంటే..?

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహన తయారీదారు అయిన బజాజ్ ఇటీవల కాలంలోనే కొత్త బిఎస్-6 బజాజ్ డామినార్ 400 యొక్క ఫీచర్స్ మరియు ధరలను ప్రకటించింది. ఈ మధ్య కాలంలోనే బుకింగ్స్ కూడా ప్రారంభించిన ఈ బజాజ్ ఇక అతితక్కువ కాలంలోనే డెలివరీలను చేయనుంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

డీలర్‌షిప్‌ వద్దకు చేరిన బిఎస్-6 బజాజ్ డామినార్ 400 బైక్, డెలివరీ ఎప్పుడంటే..?

ఇటీవల కాలంలో బుకింగ్స్ ప్రారంభించిన బిఎస్-6 బజాజ్ 400 ఎట్టకేలకు డీలర్‌షిప్‌ల వద్దకు వచ్చింది. కొత్తగా నవీనీకరించిన ఈ బజాజ్ ధరలు డీలర్‌షిప్‌లను బట్టి దాదాపు 2000 రూపాయలు పెరిగాయి.

డీలర్‌షిప్‌ వద్దకు చేరిన బిఎస్-6 బజాజ్ డామినార్ 400 బైక్, డెలివరీ ఎప్పుడంటే..?

బజాజ్ డామినార్ యొక్క ప్రస్తుత ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ 2019 ఏప్రిల్‌లో రూ. 1.73 లక్షల ఎక్స్‌షోరూమ్‌ ధరకు ప్రారంభించబడింది. ఇందులో 5 బిహెచ్‌పిల విద్యుత్ పెంపుతో సహా పలు మెరుగుదలలు ఉన్నాయి.

డీలర్‌షిప్‌ వద్దకు చేరిన బిఎస్-6 బజాజ్ డామినార్ 400 బైక్, డెలివరీ ఎప్పుడంటే..?

సాధారణంగా ఇప్పుడు అన్ని వాహనాలు బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తయారవుతున్నాయి. త్వరలో ప్రారంభించనున్న బజాజ్ డామినార్ బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుకూలంగా తయారవ్వడమే కాకుండా, ఇప్పటికే కొన్ని డీలర్షిప్ లను కూడా చేరాయి.

బిఎస్-6 నిబంధనలకు అనుకూలంగా తయారు చేయబడిన బజాజ్ డామినార్ యొక్క వీడియోని మనం ఇక్కడ చూడవచ్చు.

డీలర్‌షిప్‌ వద్దకు చేరిన బిఎస్-6 బజాజ్ డామినార్ 400 బైక్, డెలివరీ ఎప్పుడంటే..?

కొత్తగా నవీనీకరించిన బజాజ్ డామినార్ స్వల్ప మార్పులు చేయబడ్డాయి. ఫీచర్స్ విభాగంలో అయితే చెప్పగోదగ్గ మార్పులు జరగలేదు. కానీ ఇంజిన్ మరియు దాని విభాగాలు మాత్రం కొంత మార్పు చేయబడ్డాయి. 2020 బజాజ్ డామినార్ కొత్త క్యాటలిటిక్ కన్వర్టర్‌తో పాటు ట్వీక్డ్ ఇంజన్ మరియు ఇసియు ట్యూన్‌ను పొందుతుంది. చాల వరకు బిఎస్-6 మోడల్ మరియు బిఎస్-4 మోడల్ రెండూ కూడా చూడటానికి ఒకే విధంగా ఉంటాయి.

డీలర్‌షిప్‌ వద్దకు చేరిన బిఎస్-6 బజాజ్ డామినార్ 400 బైక్, డెలివరీ ఎప్పుడంటే..?

ప్రస్తుత 2019 బిఎస్ 4 ఫార్మాట్‌లో, బజాజ్ డొమినార్ దాని అప్‌గ్రేడ్ చేసిన 373 సిసి లిక్విడ్-కూల్డ్ డిఓహెచ్‌సి సింగిల్ సిలిండర్ ఇంజన్ నుండి దాదాపు 40 బిహెచ్‌పి మరియు 35 ఎన్ఎమ్ టార్క్ ను తయారు చేస్తుంది. పవర్ ప్లాంట్ స్లిప్పర్ క్లచ్ ద్వారా 6-స్పీడ్ ట్రాన్స్మిషన్ కి జతచేయబడుతుంది. బిఎస్ 6 మోడల్‌లో అవుట్పుట్ గణాంకాలు అలాగే ఉంటాయి.

డీలర్‌షిప్‌ వద్దకు చేరిన బిఎస్-6 బజాజ్ డామినార్ 400 బైక్, డెలివరీ ఎప్పుడంటే..?

2020 బజాజ్ డొమినార్ కొత్త రంగు ఎంపికలతో రావచ్చని కొన్ని వర్గాలు సూచిస్తున్నాయి. ఫ్లాగ్‌షిప్ బజాజ్ ఇప్పటికి రెండు షేడ్స్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నందున ఇది జరిగే అవకాశాలు ఉన్నాయి. అరోరా గ్రీన్ మరియు వైన్ బ్లాక్ కలర్స్ తో వచ్చే అవకాశం ఉంది.

డీలర్‌షిప్‌ వద్దకు చేరిన బిఎస్-6 బజాజ్ డామినార్ 400 బైక్, డెలివరీ ఎప్పుడంటే..?

చూడటానికి ఆకర్షణీయంగా ఉన్న ఈ బజాజ్ డామినార్ మంచి రైడింగ్ అనుభూతిని కూడా ఇస్తుంది. డామినార్ ఇండియన్ మార్కెట్లో జావా, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండబోతుంది. బిఎస్-4 వెర్షన్ కంటే బిఎస్-6 వెర్షన్ బైక్ కొంత ఎక్కువ ధరను కలిగి ఉంటుంది.

Image Courtesy: Rash Gear/YouTube

Most Read Articles

English summary
BS6 Bajaj Dominar 400 arrives at dealer – Walkaround video, exhaust sound. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X