కొత్త అప్‌డేట్స్‌తో లాంచ్ అయిన బజాజ్ ప్లాటినా 100 బైక్
బజాజ్ ఆటో తన ప్రసిద్ధ ప్లాటినా 100 బైక్‌ను భారతీయ మార్కెట్లో బిఎస్ -6 వెర్షన్‌లో విడుదల చేసింది. ఈ ప్లాటినా 100 భారత మార్కెట్లో అత్యధిక మైలేజ్ ఇచ్చే బైకులలో ఒకటి. ఈ కొత్త బిఎస్ 6 బజాజ్ ప్లాటినా 100 గురించి పూర్తి సమాచారం ఇక్కడ మీకోసం,

కొత్త బజాజ్ ప్లాటినా 100 బైక్ కిక్ స్టార్ట్ మరియు ఎలక్ట్రిక్ స్టార్ట్ అనే రెండు వేరియంట్లలో విడుదలైంది. బజాజ్ ప్లాటినా 100 బైక్ యొక్క కిక్‌స్టార్ట్ వేరియంట్ ధర రూ. 47,763 కాగా, ఎలక్ట్రిక్ స్టార్టప్ వేరియంట్ ధర రూ. 55,546 (ఎక్స్-షోరూమ్, ఇండియా).

కొత్త బజాజ్ ప్లాటినా 100 బిఎస్ -6 కాలుష్య నియమానికి అనుగుణంగా నవీకరించబడింది. ఈ బైక్ అధిక మైలేజ్ మరియు పనితీరు కోసం ఎలక్ట్రానిక్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ వ్యవస్థను కలిగి ఉంది.

బజాజ్ ప్లాటినా 100 బైక్‌లో 102 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 7.7 బిహెచ్‌పి శక్తిని, 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.34 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో 4 స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. ఈ కొత్త బజాజ్ ప్లాటినా 100 బైక్ గంటకు 90 కి.మీ ప్రయాణించగల సామర్త్యాన్ని కలిగి ఉంటుంది.

కొత్త బజాజ్ ప్లాటినా 100 బైక్ బిఎస్ -6 కాలుష్య నియమానికి అప్‌గ్రేడ్ చేయడంతో పాటు ఈ బైక్ రూపకల్పనలో కొన్ని మార్పులు చేయబడ్డాయి. ఈ బైక్ కొత్త కలర్ విండ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది.

ఈ కొత్త బైక్‌లో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌తో ఆకర్షణీయమైన హెడ్‌ల్యాంప్ ఉంది. అదనంగా ఈ బైక్‌లో లాంగ్ డబుల్ స్ప్రింగ్ రియర్ సస్పెన్షన్, స్ప్రింగ్-సాఫ్ట్ సీట్, డైరెక్షనల్ టైర్ మరియు రబ్బరు సైడ్‌వాల్ ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత కోసం ఈ బైక్‌లో 130 మి.మీ ఫ్రంట్, 110 మి.మీ డ్రమ్స్ అమర్చారు.

2020 బజాజ్ ప్లాటినా 100 బైక్ పరిమాణంలో ఎటువంటి మార్పు లేదు. బజాజ్ ప్లాటినా 100 బైక్ 2003 మి.మీ పొడవు, 713 మి.మీ వెడల్పు మరియు 1100 మి.మీ ఎత్తు. ఈ కొత్త బైక్‌లో 1,255 మి.మీ పొడవు గల వీల్‌బేస్ ఉంది.

ఈ కొత్త బజాజ్ ప్లాటినా 100 బైక్ 200 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. ఈ కొత్త బజాజ్ ప్లాటినా 100 బైక్ యొక్క కిక్‌స్టార్ట్ వేరియంట్ 116 కిలోల బరువు మరియు ఎలక్ట్రిక్ స్టార్ట్ మోడల్ బరువు 117.5 కిలోలు. ఈ కొత్త బజాజ్ ప్లాటినా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వాహనదారునికి మంచి రైడింగ్ అనుభవాన్ని కూడా ఇస్తుంది.


Click it and Unblock the Notifications








