ఇప్పుడు బిఎస్ 6 బజాజ్ పల్సర్ NS 200 బైక్ రేటెంతో తెలుసా !

ఇండియన్ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన వాహన తయారీదారు బజాజ్ ఆటో తన ప్రసిద్ధ పల్సర్ ఎన్ఎస్ 200 బైక్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో బిఎస్-6 వెర్షన్‌లో విడుదల చేసింది. బజాజ్ కంపెనీ ఇప్పుడు ఈ ప్రసిద్ధ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 బైక్ ధరను మరింత పెంచినట్లు ప్రకటించింది. పెరిగిన బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 బైక్ ధర గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఇప్పుడు బిఎస్ 6 బజాజ్ పల్సర్ NS 200 బైక్ రేటెంతో తెలుసా !

బిఎస్-6 బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 బైక్ ధరను ఇప్పుడు రూ. 999 పెంచింది. బిఎస్-6 బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 ధర ఇప్పుడు పూణే షోరూమ్ ప్రకారం 1,28,506 రూపాయలు. ఈ కొత్త బిఎస్ 6 బైక్ మునుపటి బిఎస్-4 తో పోల్చితే ఎటువంటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లను పొందలేదు.

ఇప్పుడు బిఎస్ 6 బజాజ్ పల్సర్ NS 200 బైక్ రేటెంతో తెలుసా !

ఈ కొత్త బిఎస్ 6 పల్సర్ ఎన్ఎస్ 200 బ్లాక్, వైట్, రెడ్ మరియు ఎల్లో అనే నాలుగు కలర్ ఎంపికలతో వస్తుంది. బిఎస్-6 పల్సర్ ఎన్ఎస్ 200 బైక్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ మాత్రం నవీనీకరించబడింది.

MOST READ:ఇక్కడ రోజుకి 300 కార్లు దొంగలించబడుతున్నాయి, అదెక్కడో తెలుసా ?

ఇప్పుడు బిఎస్ 6 బజాజ్ పల్సర్ NS 200 బైక్ రేటెంతో తెలుసా !

భారతదేశంలో విడుదలైన బిఎస్-6 పల్సర్ ఎన్ఎస్ 200 లో 99.5 సిసి, ఫోర్-వాల్వ్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 24.2 బిహెచ్‌పి శక్తిని మరియు 18.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మునుపటి బిఎస్ -4 బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 బైక్ 23.5 బిహెచ్‌పి శక్తి మరియు 18.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇప్పుడు బిఎస్ 6 బజాజ్ పల్సర్ NS 200 బైక్ రేటెంతో తెలుసా !

బిఎస్ -6 పల్సర్ ఎన్ఎస్ బైక్ సస్పెన్షన్ కోసం ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో గ్యాస్-ఛార్జ్డ్ మోనోషాక్‌ కలిగి ఉంది.

MOST READ:భారతీయ రోడ్లపై ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ; ఈ వీడియో చూడండి

ఇప్పుడు బిఎస్ 6 బజాజ్ పల్సర్ NS 200 బైక్ రేటెంతో తెలుసా !

ఈ బిఎస్-6 పల్సర్ ఎన్ఎస్ బైక్‌ యొక్క బ్రేకింగ్ సిస్టం గమనించినట్లయితే ఇందులో మునుపటి మోడల్‌లో మాదిరిగా బ్రేకింగ్, డిస్క్ బ్రేక్‌లు కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో స్టాండర్డ్ సింగిల్ ఛానల్ ఎబిఎస్ కూడా అమలు చేయబడి ఉంటాయి.

ఇప్పుడు బిఎస్ 6 బజాజ్ పల్సర్ NS 200 బైక్ రేటెంతో తెలుసా !

బిఎస్-6 పల్సర్ ఎన్ఎస్ 200 బైక్ భారత మార్కెట్లో అపాచీ ఆర్టిఆర్ 200 4 వి, యమహా ఎఫ్జడ్ 25 మరియు సుజుకి జిక్సర్ 250 వంటి బైక్‌లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:భారతదేశంలో అతి తక్కువ ధర కల్గిన టాప్ 5 సిఎన్‌జి కార్లు

ఇప్పుడు బిఎస్ 6 బజాజ్ పల్సర్ NS 200 బైక్ రేటెంతో తెలుసా !

దేశీయ మార్కెట్లో బజాజ్ పల్సర్ సిరీస్ బైక్‌లకు ఆదరణ ఇప్పటికి తగ్గలేదు. మనదేశంలో చాలా మంది యువకులకు ఇప్పటికీ బజాజ్ పల్సర్ బైకులపై ఎక్కువ వ్యామోహం ఉంది. కానీ బిఎస్-6 పల్సర్ ఎన్‌ఎస్ 200 బైక్ డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేయకపోవడం పల్సర్ అభిమానులను కొంత వరకు నిరాశపరిచిందనే చెప్పాలి.

Most Read Articles

English summary
Bajaj Pulsar NS200 BS6 Becomes Slightly More Expensive. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X