Just In
- 2 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 5 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 7 hrs ago కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 10 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
Don't Miss
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్‌కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఇప్పుడు బిఎస్-6 హార్లే డేవిడ్సన్ 1200 కస్టమ్ బైక్ మరింత కాస్ట్లీ గురూ ..!
హార్లే డేవిడ్సన్ ఇటీవల తన బిఎస్-6 1200 కస్టమ్ బైక్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు హార్లే డేవిడ్సన్ ఈ కొత్త 1200 కస్టమ్ బైక్ ధరను మరింత పెంచింది. ఇండియన్ ఎక్స్-షోరూమ్ ప్రకారం హార్లే డేవిడ్సన్ 1200 కస్టమ్ బైక్‌ను రూ. 10.77 లక్షలకు లాంచ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ బైక్ ధర దాదాపు రూ. 12 వేలు పెరిగింది.
ఈ కొత్త బిఎస్ -6 హార్లే డేవిడ్సన్ 1200 లో కస్టమ్ రెట్రో లుకింగ్ హెడ్‌ల్యాంప్ మరియు టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ బైక్ యొక్క ఇంజిన్ డయాగ్నస్టిక్స్ మరియు పార్ట్ డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంది. అంతే కాకుండా ఇందులో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఓడోమీటర్, డే టైమ్ క్లాక్, డ్యూయల్ ట్రిప్ మీటర్, ఎల్ఇడి లైట్వంటివి కూడా ఇందులో ఉంటాయి.
కొత్త బిఎస్ -6 హార్లే-డేవిడ్సన్ 1200 లో కస్టమ్ బైక్‌పై 1200 సిసి, ఎయిర్-కూల్డ్ ఎవాల్యూషన్ ఇంజన్ అమర్చారు. 3500 ఆర్‌పిఎమ్ వద్ద 97 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. బిఎస్-6 హార్లే డేవిడ్సన్ 1200 కస్టమ్ బైక్ బిహెచ్పి శక్తిని ఎంత ఉత్పత్తి చేస్తుందో వెల్లడించలేదు.
MOST READ:ఖాళీ రోడ్డుపై బైక్ స్టంట్స్ : ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు యువకులు [వీడియో]
ఈ ఇంజిన్ ఆల్-బ్లాక్ రాకర్స్ మరియు ఎయిర్ క్లీనర్ కవర్లను కలిగి ఉంది. ఇది ఆల్-క్రోమ్ డ్యూయల్-టేపర్డ్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. 1200 కస్టమ్ బిఎస్ 6 క్లోజ్డ్-లూప్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
హార్లే-డేవిడ్సన్ 1200 కస్టమ్ బైక్‌ను బిఎస్-6 ఉద్గార నియమాలకు అనుకూలంగా తయారుచేయబడి ఉంటుంది. ఈ బైక్ ప్రత్యేకంగా రైడర్ యొక్క భద్రతకు ప్రాధాన్యత ఇవ్వబడి ఉంటుంది.
ఈ బైకులో భద్రత కోసం ముందు మరియు వెనుక భాగంలో డిస్క్ బ్రేక్ అమర్చబడి ఉంటుంది. దీనితో డ్యూయల్ ఛానల్ ఎబిఎస్ ప్రామాణికంగా అమర్చబడుతుంది. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో డ్యూయల్ సెన్సేషన్ యూనిట్ కలిగి ఉంది.
MOST READ:వరుసగా 16 వ రోజు చుక్కలు చూపిస్తున్న డీజిల్ & పెట్రోల్ ధరలు
బిఎస్ -6 హార్లే డేవిడ్సన్ 1200 కస్టమ్ బైక్ రివర్ రాక్ గ్రే రంగులలో మిడ్నైట్ బ్లూ, రివర్ రాక్ గ్రే, బిల్లార్డ్ రెడ్ వివిడ్ బ్లాక్ మరియు వివిడ్ బ్లాక్ తో లభిస్తుంది.
బిఎస్ -6 హార్లే డేవిడ్సన్ 1200 కస్టమ్ బైక్ ఆకర్షణీయమైన కలర్ ఎంపికను కలిగి ఉంది. ఈ బైక్ ఎక్కువగా యువ కస్టమర్లను ఆకర్షించదానికి అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రస్తుత కరోనా వైరస్ కారణంగా ఈ బైక్ అమ్మకాలపై కొంతవరకు ప్రభావాన్ని చూపుతుంది.
MOST READ:కరోనా భయం లేదు; భారత్‌లో పెరగనున్న సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్