జులైలో హోండా సిబి హార్నెట్ 160ఆర్ బిఎస్6 విడుదల - పూర్తి వివరాలు

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా ప్రస్తుతం దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న మొత్తం లైనప్‌ను బిఎస్6 వెర్షన్లుగా అప్‌డేట్ చేసే పనిలో ఉంది. ఇటీవలే కొత్త గ్రాజియా బిఎస్6 స్కూటర్‌ విడుదలతో 125 సిసి కేటగిరీలో స్కూటర్లు, మోటారుసైకిల్‌ల మొత్తం లైనప్‌ను అప్‌డేట్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

జులైలో హోండా సిబి హార్నెట్ 160ఆర్ బిఎస్6 విడుదల - పూర్తి వివరాలు

తాజాగా బైక్‌దేఖో నుండి వచ్చిన సమాచారం ప్రకారం, వచ్చే నెలలో హోండా తమ హార్నెట్ 160ఆర్ బైక్‌లో బిఎస్6 వెర్షన్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్‌లో చేయనున్న అప్‌డేట్స్ కారణంగా ఇది బిఎస్4 మోడల్ కంటే సుమారు 13,000 రూపాయల అధిక ధర కలిగి ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

జులైలో హోండా సిబి హార్నెట్ 160ఆర్ బిఎస్6 విడుదల - పూర్తి వివరాలు

హోండా హార్నెట్ 160ఆర్ బిఎస్6 మోటారుసైకిల్‌లో ఇదివరకటి బిఎస్4 162.7 సిసి ఇంజన్‌నే కొత్తగా బిఎస్6 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసి ఉపయోగించనున్నారు. బిఎస్6 యునికార్న్ మోటార్‌సైకిల్‌లో ఉపయోగిస్తున్న ఇంజన్ లాంటి దానినే హార్నెట్ 160ఆర్‌లో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. అయితే, దాని ట్యూనింగ్ వేరేలా ఉంటుందని మా అభిప్రాయం.

MOST READ: కొత్త హోండా లివో బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

జులైలో హోండా సిబి హార్నెట్ 160ఆర్ బిఎస్6 విడుదల - పూర్తి వివరాలు

హోండా యునికార్న్ మోటార్‌సైకిల్‌లో ఉపయోగించిన ఇంజన్ 7500rpm వద్ద గరిష్టంగా 12.5bhp శక్తిని మరియు 5500rpm వద్ద 14Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌కు అనుసంధానించబడి ఉంటుంది. సిబి హార్నెట్ మోటార్‌సైకిల్ యొక్క స్పోర్టీ స్వభావానికి అనుగుణంగా ఇందులో ఉపయోగించబోయే బిఎస్6 ఇంజన్ కాస్తంత ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయవచ్చని తెలుస్తోంది.

జులైలో హోండా సిబి హార్నెట్ 160ఆర్ బిఎస్6 విడుదల - పూర్తి వివరాలు

కొత్త హోండా సిబి హార్నెట్ 160ఆర్ మోటార్‌సైకిల్‌లో అప్‌డేట్ చేయబడిన ఇంజన్ మాత్రమే కాకుండా, మరికొన్ని సూక్ష్మమైన మార్పులు ఉండొచ్చని అంచనా. ఇందులో అప్‌డేటెడ్ గ్రాఫిక్స్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజిన్, ఎసిజి సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ, ఇంజన్ స్టార్ట్/స్టాప్ కాంబి స్విచ్ ఉండవచ్చని తెలుస్తోంది.

MOST READ: విధి నిర్వహణలో ఉన్న పోలీసును తన్నిన మాజీ MP, ఎవరో తెలుసా ?

జులైలో హోండా సిబి హార్నెట్ 160ఆర్ బిఎస్6 విడుదల - పూర్తి వివరాలు

ఏదేమైనప్పటిరీ, మోటార్‌సైకిల్ యొక్క మొత్తం డిజైన్ మరియు కొలతలలో మాత్రం ఇది దాని మునుపటి మోడల్‌లానే ఉండనుంది. ఎల్‌ఈడి హెడ్‌లైట్, టెయిల్ లైట్స్, టర్న్ ఇండికేటర్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు వైపులా ఎక్స్‌టెన్షన్స్‌తో కూడిన మజిక్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్, సింగిల్-పీస్ సీట్ మరియు మొండిగా కనిపించే సైలెన్సర్ వంటి ఫీచర్లు ఉంటాయి.

జులైలో హోండా సిబి హార్నెట్ 160ఆర్ బిఎస్6 విడుదల - పూర్తి వివరాలు

హోండా నుంచి రానున్న కొత్త సిబి హార్నెట్ 160ఆర్ పాత మోడల్ మాదిరిగానే ఇతర మెకానికల్స్‌తో పాటు అదే డైమండ్ ఛాస్సిస్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో సర్దుబాటు చేయగల మోనో-షాక్ సస్పెన్ష్స్ ఉంటాయని తెలుస్తోంది.

MOST READ: కెజిఎఫ్ స్టార్ యష్ లగ్జరీ కార్లు, ఎలా ఉన్నాయో చూసారా ?

జులైలో హోండా సిబి హార్నెట్ 160ఆర్ బిఎస్6 విడుదల - పూర్తి వివరాలు

దీని బ్రేకింగ్ విషయానికి వస్తే ముందు వైపున 276 మిమీ పెటల్ డిస్క్ మరియు వెనుకవైపున 220 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇందులో ఆప్షనల్ డ్రమ్ బ్రేక్‌ వెర్షన్‌ను తక్కువ ధర కలిగిన వేరియంట్‌గా ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇందులో సింగిల్-ఛానల్ ఎబిఎస్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేసే అవకాశం ఉంది.

జులైలో హోండా సిబి హార్నెట్ 160ఆర్ బిఎస్6 విడుదల - పూర్తి వివరాలు

హోండా సిబి హార్నెట్ 160ఆర్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హోండా సిబి హార్నెట్ 160ఆర్ మోటారుసైకిల్ పవర్‌ఫుల్ ఇంజన్, స్టైలిష్ లుక్‌తో యువతను చక్కగా ఆకట్టుకుంది. కొత్తగా రానున్న బిఎస్6 వెర్షన్ మోటారుసైకిల్ కూడా ఇదివరకటి మాదిరిగానే మరింత అగ్రెసివ్, స్టైలిష్ లుక్‌తో పాటుగా మెరుగైన పెర్ఫార్మెన్స్‌తో రావాలని మేము కోరుకుంటున్నాం.

Most Read Articles

English summary
Honda Motorcycles And Scooters India is currently in the process of updating its entire line-up to BS6 compliance. The company has recently concluded updating its entire line-up of scooters and motorcycle in the 125cc category with the launch of new Grazia BS6 scooter. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more