ఇండియన్ మార్కెట్లో 73,336 రూపాయలకే హోండా గ్రాజియా

హోండా మోటార్‌సైకిల్స్ & స్కూటర్స్ ఇండియా భారత దేశంలో గ్రాజియా 125 బిఎస్ 6 స్కూటర్‌ను విడుదల చేసింది. కొత్త హోండా గ్రాజియా 125 బిఎస్ 6 స్కూటర్ ప్రారంభ ధర రూ. 73,336 (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ). ఈ స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్ మరియు డీలక్స్ వేరియంట్లు.

ఇండియన్ మార్కెట్లో 73,336 రూపాయలకే హోండా గ్రాజియా

కొత్త హోండా గ్రాజియా 125 బిఎస్ 6 స్కూటర్ కోసం బుకింగ్‌లు ఇప్పుడు దేశంలోని అన్ని కంపెనీ డీలర్‌షిప్‌లలో ఓపెన్ చేయబడ్డాయి. కొత్త హోండా గ్రాజియా 125 బిఎస్ 6 మోడల్ కొత్త నవీకరణలను అందుకుంటుంది. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎసిజి స్టార్టర్ మోటర్, ఫ్యూయల్-ఇంజెక్షన్ సిస్టమ్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, స్ప్లిట్ గ్రాబ్ రైల్, సైడ్ ప్యానెల్స్‌పై 3 డి లోగో మరియు బ్లాక్ అల్లాయ్ వీల్స్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.

ఇండియన్ మార్కెట్లో 73,336 రూపాయలకే హోండా గ్రాజియా

కొత్త హోండా గ్రాజియా 125 బిఎస్ 6 స్కూటర్‌లో ఇతర ఫీచర్స్ గమనించినట్లైతే ఇందులో పాస్-స్విచ్, ఇంజిన్ స్టార్ట్ / స్టాప్ స్విచ్, సీటు కోసం మల్టీ-ఫంక్షనల్ స్విచ్ మరియు ఫ్యూయెల్ లిడ్ వంటివి ఇందులో ఉంటాయి.

MOST READ:కొత్త బిఎస్ 6 హ్యుందాయ్ ఎలంట్రా డీజిల్ : ధర & ఇతర వివరాలు

ఇండియన్ మార్కెట్లో 73,336 రూపాయలకే హోండా గ్రాజియా

కొత్త హోండా గ్రాజియా స్కూటర్ ఇప్పుడు బిఎస్-6 కంప్లైంట్ 124 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 6000 ఆర్పిఎమ్ వద్ద 8 బిహెచ్‌పి మరియు 5000 ఆర్పిఎమ్ వద్ద 10.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది V- టైప్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

ఇండియన్ మార్కెట్లో 73,336 రూపాయలకే హోండా గ్రాజియా

గ్రాజియా 125 ముందు మరియు వెనుక వైపున వరుసగా 12 మరియు 10-అంగుళాల చక్రాలపై నడుస్తుంది. సస్పెన్షన్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుకవైపు త్రీ వే అడ్జస్టబుల్ స్ప్రింగ్-లోడెడ్ సస్పెన్షన్ సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో బ్రేకింగ్ వ్యవస్థను గమనించినట్లయితే ముందు భాగంలో 190 మిమీ డ్రమ్ బ్రేక్‌లు, వెనుక వైపు 130 మిమీ డ్రమ్‌ బ్రేకులు ఉంటాయి.

MOST READ:కొత్త హోండా సిటీ ఉత్పత్తి ప్రారంభం, త్వరలో విడుదల - వివరాలు

ఇండియన్ మార్కెట్లో 73,336 రూపాయలకే హోండా గ్రాజియా

హోండా గ్రాజియా 125 బిఎస్ 6 స్కూటర్‌ మాట్టే సైబర్ ఎల్లో, పెర్ల్ సైరన్ బ్లూ, మాట్టే యాక్సిస్ గ్రే మరియు పెర్ల్ స్పార్టన్ రెడ్ వంటి రంగులలో లభిస్తుంది.

ఇండియన్ మార్కెట్లో 73,336 రూపాయలకే హోండా గ్రాజియా

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ యాద్వీందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ, ఫామ్, స్టైలింగ్ & టెక్నాలజీలో గణనీయమైన మార్పుతో, కొత్త బిఎస్ 6 గ్రాజియా 125 యువ రైడర్లను అబ్బురపరిచేందుకు బాగా ఉపయోగపడుతుంది. కొత్త గ్రాజియా కస్టమర్లను ఆకర్షించేందుకు స్టైలిష్ పద్ధతిలో ట్రెండ్ సెట్టింగ్ కోసం పూర్తిగా కొత్త మొబిలిటీ అనుభవాన్ని తెస్తుంది అని అన్నారు.

హోండా గ్రాజియా 125 బిఎస్ 6 స్కూటర్‌ భారత మార్కెట్లో యమహా ఫాసినో 125, టివిఎస్ ఎన్ టార్క్ 125 మరియు సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ 125 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:భారత్‌లో డీజిల్ కార్లు కొనసాగిస్తాం: మెర్సిడెస్ బెంజ్

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda Grazia 125 BS6 Scooter Launched In India: Prices Start At Rs 73,336. Read in Telugu.
Story first published: Wednesday, June 24, 2020, 18:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X