Just In
- 1 hr ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 2 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- 3 hrs ago
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- 1 day ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
Don't Miss
- News
ఏపీలో టెన్షన్, టెన్షన్- మొదలుకాని నామినేషన్లు- ఎస్ఈసీ ఆఫీసులోనే నిమ్మగడ్డ
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Finance
భారీ లాభాల నుండి, భారీ నష్టాల్లోకి: రిలయన్స్ మహా పతనం
- Lifestyle
జనన నియంత్రణ ఉన్నప్పటికీ గర్భం వచ్చే ప్రమాదం
- Movies
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిఎస్-6 హోండా ఎక్స్-బ్లేడ్ 160 బైక్ : ధర & ఇతర వివరాలు
దేశీయ మార్కెట్లో హోండా ఇండియా తన బిఎస్-6 ఎక్స్-బ్లేడ్ 160 బైక్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కొత్త హోండా ఎక్స్-బ్లేడ్ 160 బైక్ రాబోయే రోజుల్లో భారత మార్కెట్లో విడుదల కానుంది. త్వరలో విడుదల కానున్న ఈ కొత్త హోండా బైక్ గురించి పూర్తి సమాచారం మనం ఇక్కడ చూద్దాం.. రండి.

బిఎస్ -6 హోండా ఎక్స్-బ్లేడ్ 160 బైక్ కొన్ని అప్‌డేట్స్‌తో కొత్త స్టైలింగ్ కలిగి ఉంటుందని ఆశించవచ్చు. బిఎస్-6 హోండా ఎక్స్-బ్లేడ్ బైక్ కొత్త రంగులు మరియు కొత్త గ్రాఫిక్స్ ఎంపికను కలిగి ఉంది.

బిఎస్ -6 హోండా ఎక్స్-బ్లేడ్ 160 బైక్‌లో 162.7 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 12.7 బిహెచ్‌పి పవర్ మరియు 14 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌కు జతచేయబడి ఉంటుంది.
MOST READ:బుడతడు ఉపయోగించడానికి బుల్లి కారు తయారుచేసిన తండ్రి

బిఎస్-6 హోండా ఎక్స్-బ్లేడ్ 160 బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనో షాక్ ఉంది. ఈ బైక్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఉంది. అంతే కాకుండా ఇందులో స్టాండర్డ్ ఎబిఎస్ కూడా అందించబడుతుంది.

ప్రస్తుత తరం హోండా ఎక్స్-బ్లేడ్ 160 మోడల్ ధర 90,797 రూపాయలు, మరియు అప్‌గ్రేడ్ చేసిన మోడల్స్ సుమారు 8,000 నుండి 10,000 రూపాయల అధిక ధరను కలిగి ఉంఫ్డ్ అవకాశం ఉంటుంది.
MOST READ:కరోనా ఎఫెక్ట్ : పండ్లు అమ్ముకుంటున్న టాక్సీ & క్యాబ్ డ్రైవర్లు

జపాన్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా తన బిఎస్-6 సిబి హార్నెట్ 160 ఆర్ బైక్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కొత్త హోండా సిబి హార్నెట్ 160 ఆర్ బైక్ వచ్చే నెలలో భారత మార్కెట్లో విడుదల కానుంది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో బిఎస్-4 హోండా సిబి హార్నెట్ 160 ఆర్ బైక్ పేరును వెబ్‌సైట్ నుంచి తొలగించారు. ఈ హోండా సిబి హార్నెట్ 160 ఆర్ నిలిపివేసిన తరువాత, ఇప్పుడు ఇది మరోసారి బిఎస్ 6 వెర్షన్‌లో విడుదల కానుంది.
MOST READ:చార్జింగ్ అయిపోందా? నో టెన్షన్! - ఐఓసీలో బ్యాటరీ స్వాపింగ్ ఆప్షన్!

కరోనా ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కావడం వల్ల బిఎస్ 6 హోండా సిబి హార్నెట్ 160 ఆర్ బైక్ ఆలస్యం అయింది. కొత్త హోండా సిబి హార్నెట్ 160 ఆర్ బైక్‌లో ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్, హజార్డ్ లాంప్ ఫంక్షన్, బ్లూన్ బ్యాక్‌లైట్, రిఫ్రెష్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కొత్త గ్రాఫిక్స్ మరియు కలర్స్ మరియు అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి.

ప్రస్తుతం హోండా యొక్క పోర్ట్‌ఫోలియోలోని అన్ని బైక్‌లు బిఎస్-6 కాలుష్య నియమానికి అనుగుణంగా నవీకరించబడుతున్నాయి. ఇప్పటికే సంస్థ యొక్క 125 సిసి సిరీస్‌లో ఉన్న అన్ని బైక్‌లు బిఎస్ -6 కాలుష్య నియమానికి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయబడ్డాయి.
MOST READ:చూడటానికి కార్ లాగా కనిపించే కొత్త ఎలక్ట్రిక్ బైక్