భారత్‌లో అడుగుపెట్టనున్న బిఎస్-6 కవాసకి జెడ్ 900 బైక్ : వివరాలు

కవాసకి ఇండియా తన ప్రసిద్ధ ప్రీమియం జెడ్ 900 బైక్‌ను బిఎస్-6 కాలుష్య చట్టానికి అనుగుణంగా భారతదేశంలో విడుదల చేసి అప్‌డేట్ చేయడానికి సిద్దమైంది. కవాసకి తన కొత్త జెడ్ 900 ను ఈ నెలలో భారత్‌లో విడుదల చేయనుంది. భారత్‌లో విడుదల కానున్న కొత్త కవాసకి గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో అడుగుపెట్టనున్న బిఎస్-6 కవాసకి జెడ్ 900 బైక్ : వివరాలు

కొత్త కవాసకి జెడ్ 900 అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉంటుంది. హెడ్‌ల్యాంప్ మరియు టైల్లైట్స్, ఎల్‌ఈడీ లైట్లు మరియు రెండు-వైపుల అప్‌గ్రేడ్ సస్పెన్షన్ సెట్టింగులు మరియు రైడియాలజీ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కొత్త 4.3-అంగుళాల టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఇందులో ఉంటుంది. కొత్త కవాసకి జెడ్ 900 బైక్‌ను ఈ నెల మూడవ వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

భారత్‌లో అడుగుపెట్టనున్న బిఎస్-6 కవాసకి జెడ్ 900 బైక్ : వివరాలు

కొత్త కవాసకి జెడ్ 900 లో 948 సిసి ఇన్-లైన్ ఫోర్-లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలిగి ఉంది. ఈ ఇంజిన్ 9,500 ఆర్‌పిఎమ్ వద్ద 123 బిహెచ్‌పి శక్తిని, 7,700 ఆర్‌పిఎమ్ వద్ద 98.4 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:2 కి.మీ కార్ బోనెట్ మీద వేలాడుతూ వెళ్లిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ , ఎందుకో మీరే చూడండి

భారత్‌లో అడుగుపెట్టనున్న బిఎస్-6 కవాసకి జెడ్ 900 బైక్ : వివరాలు

ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. ఇండియన్ ఎక్స్ షోరూమ్ ప్రకారం ఈ బిఎస్-6 కవాసాకి జెడ్ 900 బైక్ ధర సుమారు రూ. 8.50 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు ఉండవచ్చు.

భారత్‌లో అడుగుపెట్టనున్న బిఎస్-6 కవాసకి జెడ్ 900 బైక్ : వివరాలు

కొత్త కవాసకి జెడ్ 900 కొత్త పవర్ మోడ్ మరియు ఇతర రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, స్ట్రాంగ్ ఫ్రేమ్ మరియు డన్‌లాప్ స్పోర్ట్స్ మాక్స్ రోడ్‌స్పోర్ట్ 2 టైర్లు ఉన్నాయి.

MOST READ:ఇది బుల్లెట్ బైక్ నుంచి తయారైన పాప్‌కార్న్ [వీడియో]

భారత్‌లో అడుగుపెట్టనున్న బిఎస్-6 కవాసకి జెడ్ 900 బైక్ : వివరాలు

కొత్త కవాసాకి జెడ్ 900 రెండు డ్యూయల్ టోన్ కలర్స్ తో బైక్‌ను అందిస్తుంది. ఇది మెటాలిక్ గ్రాఫైట్ గ్రే, మెటాలిక్ స్పార్క్ బ్లాక్ మరియు మెటాలిక్ స్పార్క్ బ్లాక్, మెటాలిక్ ఫ్లాట్ స్పార్క్ బ్లాక్ కలర్స్ తో అందించవబడుతుంది. కొత్త కవాసకి జెడ్ 900 బైక్‌లో ఇతర మార్పులు చేయలేదు. మిగిలిన సస్పెన్షన్ సెటప్ ముందు భాగంలో అదే 41 మిమీ యుఎస్డి ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో షాక్ కలిగి ఉంటుంది.

భారత్‌లో అడుగుపెట్టనున్న బిఎస్-6 కవాసకి జెడ్ 900 బైక్ : వివరాలు

బ్రేకింగ్ సిస్టమ్‌లో మార్పులు చేయలేదు. ఇది ముందు భాగంలో డ్యూయల్ 300 మిమీ పెటల్ డిస్క్ మరియు వెనుక భాగంలో 250 మిమీ పెటల్ డిస్క్ కలిగి ఉంది. అదనంగా డ్యుయెల్ ఛానల్ ఎబిఎస్ ప్రామాణికం. కవాసకి జెడ్ 900 ప్రీమియం సూపర్నాకిల్ బైక్. కవాసాకి కంపెనీ బిఎస్-6 కాలుష్య నిబంధనలకు అనుగుణంగా తన ప్రసిద్ధ మోడళ్లను అప్‌డేట్ చేసి విడుదల చేస్తోంది. అదేవిధంగా బిఎస్-6 కవాసకి జెడ్ 900 త్వరలో భారత్‌లో విడుదల కానుంది.

MOST READ:హైస్పీడ్ వాహనాలను గుర్తించే హై-స్పీడ్ కెమెరాలు.. వచ్చేస్తున్నాయ్

Most Read Articles

English summary
Kawasaki Z900 BS6 to launch in September third week. Read in Telugu.
Story first published: Tuesday, September 1, 2020, 16:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X