కొత్త బిఎస్-6 యమహా ఎమ్‌టి 15 మోటర్ సైకిల్ ని చూసారా!

ద్విచక్ర వాహన విభాగంలో అత్యంత ప్రసిద్ధి చెందిన సంస్థ యమహా. యమహా నుంచి విడుదలైన చాల వాహనాలు మంచి డిజైన్లతో అధునాతన ఫీచర్స్ తో ఉండటం వల్ల కుర్రకారుని ఉర్రూతలూగించింది. ఇప్పుడు యమహా కొత్త రంగులతో బిఎస్-6 వెర్షన్ లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

కొత్త బిఎస్-6 యమహా ఎమ్‌టి 15 మోటర్ సైకిల్ ని చూసారా!

సాధారణంగా వాహనాలన్నీ బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారవుతున్నాయి. ఇదే రీతిలో యమహా కూడా 2020 ఏప్రిల్ 1 కి ముందే బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా మోటార్ సైకిల్ తయారుచేయబడింది.

కొత్త బిఎస్-6 యమహా ఎమ్‌టి 15 మోటర్ సైకిల్ ని చూసారా!

యమహా బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉండటమే కాకుండా కొత్త కలర్ వేరియంట్లో కూడా ప్రారంభించింది. ఇది కొత్త ఐస్-ఫ్లూ వెర్మిలియన్ రంగులో వస్తుంది. ఈ కలర్ వెహికల్ ధర రూ. 1,39,400 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇతర వేరియంట్ ధరలు దీనికంటే 500 రూపాయలు తక్కువగా ఉంటాయి. ఇతర వేరియంట్ల ధర 1,38,900 రూపాయలు.

కొత్త బిఎస్-6 యమహా ఎమ్‌టి 15 మోటర్ సైకిల్ ని చూసారా!

సాధారణంగా బిఎస్-4 వేరియంట్ కంటే బిఎస్-6 యమహా ఎమ్‌టి 15 ధర దాదాపు 4,000 రూపాయలు అధికంగా ఉంటుంది. ప్రస్తుతానికి యమహా కంపెనీ బిఎస్-4 మరియు బిఎస్-6 రెండు వేరియన్లను విక్రయిస్తోంది. ఇండియన్ మార్కెట్లో ఇప్పుడు బిఎస్-4 వెర్షన్ ఉత్పత్తిని యమహా నిలిపివేసింది. ఉన్న స్టాక్ మాత్రం 2020 మార్చ్ 31 వరకు మాత్రమే విక్రయించే అవకాశం ఉంది.

కొత్త బిఎస్-6 యమహా ఎమ్‌టి 15 మోటర్ సైకిల్ ని చూసారా!

బిఎస్-6 వెర్షన్ యమహా ఎమ్‌టి 15 మోటార్ సైకిల్ 155 సిసి లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ని కలిగి ఉంటుంది. ఇది 10,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 18.5 పిఎస్ శక్తిని మరియు 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 13.9 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ కి జతచేయబడుతుంది.

యమహా ఎమ్‌టి 15 కొత్త రంగు ఎంపికలను కలిగి ఉన్నప్పటికీ ఇంజిన్లో ఎక్కువ మార్పులు జరగలేదు. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, యుఎస్‌బి ఛార్జర్, సైడ్-స్టాండ్ ఎంగేజ్‌మెంట్‌లో ఆటోమేటిక్ ఇంజిన్ కట్-ఆఫ్, ఎల్‌ఇడి టైల్లైట్, గేర్‌షిఫ్ట్ ఇండికేటర్‌తో ఎల్‌సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సింగిల్-ఛానల్ ఎబిఎస్ వంటి వాటిని నవీనీకరించడం జరిగింది.

కొత్త బిఎస్-6 యమహా ఎమ్‌టి 15 మోటర్ సైకిల్ ని చూసారా!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కొత్త బిఎస్-6 యమహా ఎమ్‌టి 15 మోటర్ సైకిల్ మునుపటి మోడల్ కంటే కొంత అప్డేటెడ్ గా ఉంటుంది. నవీనీకరించిన యమహా ఎమ్‌టి 15 చూడటానికి ఆకర్షణీయంగా మాత్రమే కాకుంగా రైడింగ్ చేయడానికి వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles
https://www.youtube.com/embed/6CP5IUd-uqI?rel=0

Read more on: #యమహా #yamaha
English summary
BSVI Yamaha MT15 Comes With A New Colour Option, TVC Released. Read in Telugu.
Story first published: Wednesday, February 12, 2020, 12:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X