Just In
- 1 hr ago
సూపర్‌బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- 2 hrs ago
ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి
- 2 hrs ago
కొత్త 2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ వస్తోందోచ్..
- 4 hrs ago
కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు రెనో ఇండియా 'మాస్టర్' ప్లాన్స్..
Don't Miss
- News
కడప జిల్లాలో దారుణం: ప్రేమ పేరుతో ఉన్మాదం: యువతిపై ఘాతుకం: ప్రాణాపాయ స్థితిలో
- Movies
అభిజీత్‌తో రిలేషన్‌పై దేత్తడి హారిక క్లారిటీ: అసలు నిజం అదేనంటూ రివీల్ చేసేసింది
- Sports
టైగర్ పటౌడీని గుర్తుచేశాడు.. రహానేకే టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వాలి!! కోహ్లీ ఇక వద్దు!
- Finance
ఈ ఉత్పత్తులపై దిగుమతి సంకాలు భారీగా పెరవగవచ్చు, ఎందుకంటే?
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత మార్కెట్లో విడుదల కానున్న బిఎస్ 6 సిఎఫ్‌మోటో బైక్‌లు
కరోనా వైరస్ మహమ్మారి అధికంగా విజృంభిస్తున్న కారణంగా చాలా బైక్ మరియు కార్ తయారీదారులు తమ బిఎస్ 6 వాహనాలను ఆలస్యంగా లాంచ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా బైక్ తయారీ సంస్థ సిఎఫ్ మోటో కూడా తన బైక్‌ల లాంచ్‌ను వాయిదా వేసింది.

ఈ కంపెనీ గత ఏడాది దేశీయ మార్కెట్లోకి ప్రవేశించింది. గత ఏడాది నవంబర్ నుంచి సిఎఫ్‌మోటో తన బైక్‌లను పంపిణీ చేయడం ప్రారంభించింది. కంపెనీ తన ప్రత్యర్థి కంపెనీ బైకుల కన్నా తక్కువ ధరకు తన బైక్‌లను విక్రయిస్తోంది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో కంపెనీ తన బైక్ బుకింగ్‌లను కూడా నిలిపివేసింది.

భారతదేశంలో అన్‌లాక్ ప్రక్రియ తరువాత, కంపెనీ తన బైక్ బుకింగ్‌లను తిరిగి ప్రారంభించింది. దీనికి సంబంధించిన నివేదికల ప్రకారం సిఎఫ్ మోటో తన బిఎస్ 6 సిరీస్‌ను రాబోయే వారాల్లో విడుదల చేయనుంది.
MOST READ:కొత్త అవతారం దాల్చిన మోడిఫైడ్ ప్రీమియర్ పద్మిని కార్

ఈ బైక్‌ల టెస్ట్ రైడ్ల కోసం కంపెనీ తన వెబ్సైట్లో రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. సిఎఫ్‌మోటో 300 ఎన్‌కె, 650 ఎన్‌కె, 650 ఎమ్‌టి, 650 జిటి బైక్‌లను దేశీయ మార్కెట్లో విడుదల చేయనుంది.

సిఎఫ్‌మోటో ఈ బైక్‌లన్నింటినీ బిఎస్ 6 ఇంజిన్‌తో బిఎస్ 6 కాలుష్య నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసిందని చెబుతున్నారు. సిఎఫ్‌మోటో 300 ఎన్‌కె బైక్‌లో 292.4 సిసి లిక్విడ్ కూల్డ్, డిఓహెచ్సి సింగిల్ సిలిండర్ ఇంజన్ అమర్చారు.
MOST READ:గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన డీజిల్ ధర, ఇప్పుడు లీటర్ డీజిల్ ధర ఎంతో తెలుసా ?

ఈ ఇంజన్ 33 బిహెచ్పి పవర్ మరియు 25 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. సిఎఫ్‌మోటో 650 ఎన్‌కె, 650 ఎమ్‌టి బైక్‌లలో 659.3 సిసి ఇంజన్ అమర్చారు.

ఈ ఇంజన్ 60 బిహెచ్పి పవర్ మరియు 56 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అందించబడుతుంది. ఇదే ఇంజిన్‌ను సిఎఫ్‌మోటో 650 జిటి బైక్‌లో కూడా చేర్చారు. నాలుగు బైక్‌లకు ప్రత్యేక డిజైన్ లాంగ్వేజ్ కలిగి ఉంటాయి. ఈ బైక్ లు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
MOST READ:వ్యవసాయ రంగంలో అడుగుపెట్టనున్న డ్రోన్లు ; ఎందుకో తెలుసా ?