భారత మార్కెట్లో విడుదల కానున్న బిఎస్ 6 సిఎఫ్‌మోటో బైక్‌లు

కరోనా వైరస్ మహమ్మారి అధికంగా విజృంభిస్తున్న కారణంగా చాలా బైక్‌ మరియు కార్ తయారీదారులు తమ బిఎస్ 6 వాహనాలను ఆలస్యంగా లాంచ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా బైక్ తయారీ సంస్థ సిఎఫ్ మోటో కూడా తన బైక్‌ల లాంచ్‌ను వాయిదా వేసింది.

భారత మార్కెట్లో విడుదల కానున్న బిఎస్ 6 సిఎఫ్‌మోటో బైక్‌లు

ఈ కంపెనీ గత ఏడాది దేశీయ మార్కెట్లోకి ప్రవేశించింది. గత ఏడాది నవంబర్ నుంచి సిఎఫ్‌మోటో తన బైక్‌లను పంపిణీ చేయడం ప్రారంభించింది. కంపెనీ తన ప్రత్యర్థి కంపెనీ బైకుల కన్నా తక్కువ ధరకు తన బైక్‌లను విక్రయిస్తోంది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో కంపెనీ తన బైక్ బుకింగ్లను కూడా నిలిపివేసింది.

భారత మార్కెట్లో విడుదల కానున్న బిఎస్ 6 సిఎఫ్‌మోటో బైక్‌లు

భారతదేశంలో అన్‌లాక్ ప్రక్రియ తరువాత, కంపెనీ తన బైక్ బుకింగ్‌లను తిరిగి ప్రారంభించింది. దీనికి సంబంధించిన నివేదికల ప్రకారం సిఎఫ్ మోటో తన బిఎస్ 6 సిరీస్‌ను రాబోయే వారాల్లో విడుదల చేయనుంది.

MOST READ:కొత్త అవతారం దాల్చిన మోడిఫైడ్ ప్రీమియర్ పద్మిని కార్

భారత మార్కెట్లో విడుదల కానున్న బిఎస్ 6 సిఎఫ్‌మోటో బైక్‌లు

ఈ బైక్‌ల టెస్ట్ రైడ్‌ల కోసం కంపెనీ తన వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. సిఎఫ్‌మోటో 300 ఎన్‌కె, 650 ఎన్‌కె, 650 ఎమ్‌టి, 650 జిటి బైక్‌లను దేశీయ మార్కెట్లో విడుదల చేయనుంది.

భారత మార్కెట్లో విడుదల కానున్న బిఎస్ 6 సిఎఫ్‌మోటో బైక్‌లు

సిఎఫ్‌మోటో ఈ బైక్‌లన్నింటినీ బిఎస్ 6 ఇంజిన్‌తో బిఎస్ 6 కాలుష్య నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసిందని చెబుతున్నారు. సిఎఫ్‌మోటో 300 ఎన్‌కె బైక్‌లో 292.4 సిసి లిక్విడ్ కూల్డ్, డిఓహెచ్‌సి సింగిల్ సిలిండర్ ఇంజన్ అమర్చారు.

MOST READ:గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన డీజిల్ ధర, ఇప్పుడు లీటర్ డీజిల్ ధర ఎంతో తెలుసా ?

భారత మార్కెట్లో విడుదల కానున్న బిఎస్ 6 సిఎఫ్‌మోటో బైక్‌లు

ఈ ఇంజన్ 33 బిహెచ్‌పి పవర్ మరియు 25 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. సిఎఫ్‌మోటో 650 ఎన్‌కె, 650 ఎమ్‌టి బైక్‌లలో 659.3 సిసి ఇంజన్ అమర్చారు.

భారత మార్కెట్లో విడుదల కానున్న బిఎస్ 6 సిఎఫ్‌మోటో బైక్‌లు

ఈ ఇంజన్ 60 బిహెచ్‌పి పవర్ మరియు 56 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అందించబడుతుంది. ఇదే ఇంజిన్‌ను సిఎఫ్‌మోటో 650 జిటి బైక్‌లో కూడా చేర్చారు. నాలుగు బైక్‌లకు ప్రత్యేక డిజైన్ లాంగ్వేజ్ కలిగి ఉంటాయి. ఈ బైక్ లు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

MOST READ:వ్యవసాయ రంగంలో అడుగుపెట్టనున్న డ్రోన్లు ; ఎందుకో తెలుసా ?

Most Read Articles

Read more on: #cfmoto
English summary
CF moto company to launch its BS6 bikes in India soon. Read in Telugu.
Story first published: Friday, July 31, 2020, 15:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X