Just In
- 6 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 7 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 7 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 9 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి సలహా ఇచ్చిన ముఖ్యమంత్రి ; అదేంటో తెలుసా ?
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. వాయు కాలుష్యానికి అనేక కారణాలు దోహదం చేసినప్పటికీ, వాహనాల ఉద్గారాలు ప్రధాన కారణమని అనేక పరిశోధనలు నిర్ధారించాయి. ఇటీవల కాలంలో ప్రధాన వాహన తయారీదారులు ఇంధనంతో నడిచే వాహనాల ఉత్పత్తిని తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణ అనుకూలమైనవి.

ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప ఇంధన శక్తితో నడిచే వాహనాలకు ప్రత్యామ్నాయంగా సైకిళ్లను ఉపయోగించాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, ప్రజలు తమ సొంత వాహనాల వాడకాన్ని తగ్గించాలని మరియు సైకిళ్ల వాడకాన్ని లేదా ప్రజా రవాణాను పెంచాలని సూచించారు.

స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు ప్రతి పౌరుడి హక్కు అని ఆయన అన్నారు. నగరాన్ని శుభ్రంగా ఉంచడానికి బెంగళూరులోని చర్చి వీధిలో క్లీన్ ఎయిర్ టెస్ట్‌బెడ్ డ్రైవ్ ఏర్పాటు చేయబడింది. నగరాన్ని కాలుష్యం నుండి రక్షించడమే ఈ ప్రాజెక్టు, రహదారిపై పాదచారుల రద్దీని మాత్రమే అనుమతిస్తుంది.
MOST READ:జనవరి 1 నుంచి వాహనాలకు ఫాస్ట్‌టాగ్ తప్పనిసరి ; లేకుంటే ఏమౌంతుందో తెలుసా

ఈ రహదారిపై పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించారు. వచ్చే ఫిబ్రవరి వరకు ఈ చర్య కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ రహదారిపై ఎలక్ట్రిక్ వాహనాల రాకపోకలకు అనుమతిస్తామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప తెలిపారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కర్ణాటక ప్రభుత్వం అర్బన్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ డైరెక్టరేట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మరియు ఇంగ్లాండ్ లోని కాటాపుల్ట్ నెట్‌వర్క్‌తో కలిసి పనిచేస్తోంది.

ఇందులో భాగంగా చర్చి వీధిలో ట్రాఫిక్ నిషేధించబడింది. కర్ణాటకలో ప్రస్తుతం 85 లక్షలకు పైగా వాహనాలు వాడుకలో ఉన్నాయి. రాష్ట్రంలో 50% వాయు కాలుష్యం జరుగుతోంది ఈ కారణాల వల్ల ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది.
MOST READ:భారత్‌లో దూసుకెళ్తున్న చైనా కార్స్.. అక్టోబర్‌లో అమ్మకాలు అదుర్స్..

వాహనాల వినియోగం ప్రతి సంవత్సరం 10% పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ప్రజా రవాణాను ఉపయోగించమని చెప్పారు. సమీప ప్రదేశాలకు వెళ్లడానికి సైక్లింగ్ లేదా నడక మార్గాన్ని ఎంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

పర్యావరణాన్ని పరిరక్షించడం ఈ నిర్ణయం యొక్క ప్రాథమిక కర్తవ్యం. పర్యావరణ పరిరక్షణలో చురుకుగా పాల్గొంటామని ప్రతిజ్ఞ చేయాలని ఆయన అన్నారు. పర్యావరణం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే భావి తరాలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. భావితరాల కోసం మనం ఇప్పటి నుంచి పర్యావరణాన్ని కాపాడటంలో మనవంతు పాత్ర వహించాలని గౌరవ ముఖ్యంమత్రి బి.ఎస్.యడ్యూరప్ప పిలుపునిచ్చారు.
MOST READ:వాహనాల వేగపరిమితిని పెంచడానికి ఆసక్తి చూపుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఎందుకో తెలుసా?