కోవిడ్-19 భయం; చాలా చోట్ల రాయల్ ఎన్‌ఫీల్డ్ రీజనల్ ఆఫీసులు బంద్!

ప్రస్తుతం యావత్ ప్రపంచం ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య కోవిడ్-19. కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచంలోని చాలా వ్యాపారాలు శాస్వతంగా మూతపడ్డాయి. ఈ కరోనా వైరస్ సెగ మనదేశంలోని అతిపెద్ద మోటార్‌సైకిల్ కంపెనీ అయిన 'రాయల్ ఎన్‌ఫీల్డ్' పై కూడా పడింది.

కోవిడ్-19 భయం; చాలా చోట్ల రాయల్ ఎన్‌ఫీల్డ్ రీజనల్ ఆఫీసులు బంద్!

కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ గుర్గావ్‌లో ఉన్న తమ కార్పోరేట్ ఆఫీస్‌తో పాటుగా దేశంలోని 12 ఇతర రీజనల్ ఆఫీసులను కూడా మూసివేయాలని నిర్ణయించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ తమ ఉద్యోగులకు పంపిన ఓ ఇంటర్నల్ సర్క్యులర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.

కోవిడ్-19 భయం; చాలా చోట్ల రాయల్ ఎన్‌ఫీల్డ్ రీజనల్ ఆఫీసులు బంద్!

షోరూమ్‌లు కాకుండా ప్రాంతీయ కార్యాలయాల్లో పనిచేసే రాయల్ ఎన్‌ఫీల్డ్ సిబ్బంది ఇదవరకటిలానే ఇంటి నుంచే పనిచేయాలని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. గుర్గావ్, చెన్నై, బెంగుళూరు, ముంబై, జార్ఖండ్, హైదరాబాద్, భువనేశ్వర్ మరియు ఇతర నగరాల్లోని మొత్తం 12 ప్రాంతీయ కార్యాలయాలను తక్షణమే మూసివేసి, ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కంపెనీ యాజమాన్యం కోరింది.

MOST READ: మారుతి కార్లపై జూన్ నెల ఆఫర్స్ - స్పెషల్ డిస్కౌంట్స్

కోవిడ్-19 భయం; చాలా చోట్ల రాయల్ ఎన్‌ఫీల్డ్ రీజనల్ ఆఫీసులు బంద్!

ఇలా చేయటం వలన కోవిడ్-19ను ఎదుర్కోవటమే కాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహణ ఖర్చు కూడా తగ్గించుకున్నట్లు అవుతుందని కంపెనీ భావిస్తోంది. యంత్రాలపై మరియు ఫ్యాక్టరీలలో పనిచేసే సిబ్బంది మినహా ఇతర సిబ్బంది మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని నిర్ణయించినట్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ కమర్షియల్ ఆఫీసర్ లలిత్ మాలిక్ తెలిపారు.

కోవిడ్-19 భయం; చాలా చోట్ల రాయల్ ఎన్‌ఫీల్డ్ రీజనల్ ఆఫీసులు బంద్!

ఇదిలా ఉంటే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ మోడల్ 'రాయర్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350' (Royal Enfield Meteor 350)ను మరికొద్ది రోజుల్లోనే భారత మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వస్తున్న సరికొత్త మోడల్ బైక్ ఇది. థండర్‌బర్డ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ మోడల్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

కోవిడ్-19 భయం; చాలా చోట్ల రాయల్ ఎన్‌ఫీల్డ్ రీజనల్ ఆఫీసులు బంద్!

ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 ఇంజన్ విషయానికి వస్తే, ప్రస్తుత 346 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ యొక్క సరికొత్త ఓహెచ్‌సి (ఓవర్ హెడ్ క్యామ్‌షాఫ్ట్) వెర్షన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ 346 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 19.1 బిహెచ్‌పిల శక్తిని మరియు 28 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది.

MOST READ: కరోనా నివారణలో భాగంగా మహీంద్రా అంబులెన్స్

కోవిడ్-19 భయం; చాలా చోట్ల రాయల్ ఎన్‌ఫీల్డ్ రీజనల్ ఆఫీసులు బంద్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రాంతీయ కార్యాలయాలు మూతపడటంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కోవిడ్-19 వ్యాప్తిని నివారించేందుకు ఇప్పటికే అనేక కార్పోరేట్ కంపెనీలు తమ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను కల్పిస్తున్నాయి. కస్టమర్లతో నేరుగా సంప్రదింపులు చేయాల్సిన అవసరం లేని సిబ్బంది ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా తమ రీజనల్ ఆఫీసుల సిబ్బందికి మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కల్పించింది. ఫ్యాక్టరీలు, వర్క్‌షాపులు, డీలర్ల వద్ద పనిచేసే సిబ్బంది మాత్రం యధావిధిగా పనిచేయనున్నారు.

Most Read Articles

English summary
The auto industry in our country has also faced a huge hit by the pandemic. However, Royal Enfield has decided to shut down 12 regional offices, including its corporate office in Gurugram. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X