కోవిడ్-19 టెస్టింగ్ కోసం PCR మిషన్స్ డొనేట్ చేసిన ఎంవి అగుస్టా

భారతదేశంలో కరోనా వైరస్ రోజు రోజుకి ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ కారణంగా భారతదేశం మొత్తం 2020 ఏప్రిల్ 14 వరకు 21 రోజులు లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ వల్ల దేశ ఆర్థిక పరిస్థితి చాలా వరకు దిగజారిపోయింది. అంతే కాకుండా కరోనాకి వ్యతిరేఖంగా పోరాడుతున్న భారత ప్రభుత్వానికి మద్దతుగా చాలా ఆటో పరిశ్రమలు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించాయి.

ఈ నేపథ్యంలో ఎంవి అగుస్టా కంపెనీ కరోనా టెస్టింగ్ కోసం పిసిఆర్ మిషన్స్ డొనేట్ చేసింది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.. !

COVID-19 టెస్టింగ్ కోసం PCR మిషన్స్ డొనేట్ చేసిన ఎంవి అగుస్టా

ఇటాలియన్ మోటారుసైకిల్ బ్రాండ్ అయిన ఎంవి అగుస్టా కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో ఆసుపత్రులకు మద్దతుగా పరీక్ష యంత్రాలను విరాళంగా ఇచ్చింది. ఎంవి అగుస్టా ప్రకారం సంస్థ కేవలం 30 నిమిషాల్లో ప్రాసెస్ చేయగల అధునాతన పరీక్ష యంత్రాలను విరాళంగా ఇచ్చింది.

COVID-19 టెస్టింగ్ కోసం PCR మిషన్స్ డొనేట్ చేసిన ఎంవి అగుస్టా

ఇది రిమోట్‌గా కూడా ఉపయోగించవచ్చు మరియు పరీక్ష కోసం పెరుగుతున్న అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది. ఇది కరోనా బాధితులను వేగంగా గుర్తిస్తుంది. ఆరోగ్య కార్యకర్తలు మరియు వైద్య సిబ్బంది వారి స్వంత రక్షణ కోసం మరియు వారి కుటుంబాల కోసం పరీక్షలు కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

COVID-19 టెస్టింగ్ కోసం PCR మిషన్స్ డొనేట్ చేసిన ఎంవి అగుస్టా

మార్చి 8 న కరోనావైరస్ అత్యవసర పరిస్థితుల కోసం నిధుల సేకరణ ప్రారంభించిన స్థానిక స్వచ్ఛంద సంస్థ ఫోండాజియోన్ సిర్కోలో డెల్లా బొంటా ఓన్లస్‌తో ఎంవి అగుస్టా కూడా సహకారం అందించింది. దీని ఫలితంగా ఇప్పటికే వరేస్ ఆసుపత్రికి ముఖ్యమైన ఇంటెన్సివ్ కేర్ పరికరాలను విరాళంగా ఇచ్చారు.

COVID-19 టెస్టింగ్ కోసం PCR మిషన్స్ డొనేట్ చేసిన ఎంవి అగుస్టా

ఎంవి అగుస్టా మోటార్ సిఇఒ ‘తైమూర్ సర్దరోవ్' మాటాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సమాజాన్ని రక్షించడానికి కృషి చేస్తున్న వారికి అగుస్టా మద్దతు ఇస్తుంది. ఫోండాజియోన్ సిర్కోలో డెల్లా బొంటా కూడా కొన్ని క్లిష్టమైన అవసరాలను తీర్చడంలో మాకు సహాయపడింది. కాబట్టి వేగంగా మరియు సమర్ధవంతంగా పనిచేయగలిగామం అన్నారు.

COVID-19 టెస్టింగ్ కోసం PCR మిషన్స్ డొనేట్ చేసిన ఎంవి అగుస్టా

క్వాంట్‌స్టూడియో టిఎం 5 రియల్ టైమ్ పిసిఆర్ సిస్టమ్ అని పిలువబడే ఈ యంత్రాన్ని బ్రిటిష్ థర్మో ఫిషర్ సైంటిఫిక్ ఉత్పత్తి చేస్తుంది. ప్రత్యేకమైన ఈ మిషన్ కోవిడ్-19 టెస్టింగ్ కి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితులలో ఈ మిషన్స్ చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం రోగనిర్ధారణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఈ యంత్రాలు ఉపయోగపడుతాయని ఎంవి అగుస్టా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

COVID-19 టెస్టింగ్ కోసం PCR మిషన్స్ డొనేట్ చేసిన ఎంవి అగుస్టా

ఏది ఏమైనా ఈ యంత్రాలు ప్రస్తుత అత్యవర పరిస్థితికి చాలా ఉపయోగంగా ఉంటాయి. ఎట్టకేలకు ఆటో పరిశ్రమలు కరోనా నివారణలో తమవంతు మద్దతుగా సహాయపడుతున్నాయి. కరోనా నివారణలో మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి అభినందనలు.

Most Read Articles

English summary
MV Agusta Donates PCR Machine For COVID-19 Testing. Read in Telugu.
Story first published: Tuesday, April 7, 2020, 11:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X