త్వరలో బిఎస్ 6 జెడ్ 900 డెలివరీలను ప్రారంభించనున్న కవాసకి

జపాన్ ద్విచక్ర వాహన తయారీదారు అయిన కవాసకి, 2020 కవాసకి జెడ్ 900 బిఎస్ 6 మోటార్ సైకిల్స్ ని త్వరలో డెలివరీ చేయనుంది. దీనికి సంబందించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

త్వరలో బిఎస్ 6 జెడ్ 900 డెలివరీలను ప్రారంభించనున్న కవాసకి

కవాసకి ఇండియా గడువుకు ముందే తన వాహనాలను బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయాలని సంకల్పించింది. దీనికి గాను తుది గడువుగా 2020 మార్చి 20 ని నిర్ణయించుకుంది. సాధారణంగా అన్ని సంస్థలు ఏప్రిల్ 1 కల్లా బిఎస్-6 నిబంధనలకు అనుగుణంగా తయారు చేయాలనీ భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు తయారు చేస్తోంది.

త్వరలో బిఎస్ 6 జెడ్ 900 డెలివరీలను ప్రారంభించనున్న కవాసకి

కవాసాకి ఇండియా తన ప్రసిద్ధ జెడ్ 900 మిడిల్ వెయిట్ నేకెడ్ స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ యొక్క బిఎస్ 6 వెర్షన్‌ను డీలర్‌షిప్ స్థానాన్ని బట్టి రూ .8.50 - 9.00 లక్షల మధ్య ఎక్స్‌షోరూమ్ ధర వద్ద విడుదల చేసింది. అవుట్‌గోయింగ్ బిఎస్ 4 వెర్షన్ కంటే ఎక్కువ ధరను ప్రకటించింది. మునుపటి బిఎస్ 4 వెర్షన్ ధర రూ. 7.69 లక్షలు.

త్వరలో బిఎస్ 6 జెడ్ 900 డెలివరీలను ప్రారంభించనున్న కవాసకి

ప్రస్తుతం బిఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా దీనిని నవీనీకరించడం వల్ల కచ్చితమైన ధరలను అంచనా వేయనప్పటికీ 2020 కవాసకి జెడ్ 900 ఫీచర్స్ మరియు స్టైలింగ్ పరంగా గణనీయమైన మెరుగుదలలతో వస్తుంది.

త్వరలో బిఎస్ 6 జెడ్ 900 డెలివరీలను ప్రారంభించనున్న కవాసకి

కవాసాకి జెడ్ 900 నాలుగు రైడింగ్ మోడ్ లను కలిగి ఉంటుంది. అవి స్పోర్ట్, రోడ్, రెయిన్ మరియు మాన్యువల్. అవుట్గోయింగ్ మోడల్‌తో పోలిస్తే, డిజైన్ పరంగా కవాసకి కొంత నవీనీకరించిందనే చెప్పాలి. ఇందులో ఎల్ఇడి హెడ్‌ల్యాంప్స్, 4.3-అంగుళాల టిఎఫ్‌టి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌ ఉంటాయి. ఇది రైడాలజీ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని కూడా కలిగి ఉంటుంది.

త్వరలో బిఎస్ 6 జెడ్ 900 డెలివరీలను ప్రారంభించనున్న కవాసకి

2020 కవాసాకి జెడ్ 900 మెరుగైన పని తీరుని కలిగి ఉంటుంది. కాబట్టి చాలా మంది వినియోగదారులను ఆకర్షించే అవకాశం కూడ ఉంది. ఇది 948 సిసి ఇంజిన్ ని కలిగి ఉంటుంది. ఇంజిన్ 9500 ఆర్‌పిఎమ్ వద్ద 123 బిహెచ్‌పి మరియు 7700 ఆర్‌పిఎమ్ వద్ద 98.6 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటుంది.

త్వరలో బిఎస్ 6 జెడ్ 900 డెలివరీలను ప్రారంభించనున్న కవాసకి

కవాసాకి మోటార్ సైకిళ్ళు ద్విచక్ర వాహన మార్కెట్ యొక్క ప్రీమియం అత్యుత్తమ విలువను అందిస్తున్నాయి, అయినప్పటికీ వారి ఎంట్రీ లెవల్ ఉత్పత్తులైన నింజా 300, నింజా 400 మరియు వెర్సిస్ ఎక్స్ -300 లకు తక్కువ ఆఫర్లు కలిగి ఉన్నాయి. ఏది ఏమైనా కొత్త కవాసకి జెడ్ 900 కూడా వినియోగదారులకు చాల అనుకూలంగా ఉంటుందని ఆశించవచ్చు.

త్వరలో బిఎస్ 6 జెడ్ 900 డెలివరీలను ప్రారంభించనున్న కవాసకి

కొత్త జెడ్ 900 బైక్ రెండు షేడ్స్‌లో లభిస్తుంది. అవి మెటాలిక్ గ్రాఫైట్ గ్రే / మెటాలిక్ స్పార్క్ బ్లాక్ మరియు మెటాలిక్ స్పార్క్ బ్లాక్ / మెటాలిక్ ఫ్లాట్ స్పార్క్ బ్లాక్. ఇది ఇండియన్ మార్కెట్లో సుజుకి జిఎస్ఎక్స్-ఎస్ 750, ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ మరియు కెటిఎమ్ 790 డ్యూక్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Image Courtesy: Northeast Biking Community/Facebook

More from DriveSpark

Article Published On: Thursday, February 20, 2020, 15:50 [IST]
English summary
2020 Kawasaki Z900 BS6 arrives at dealership – Deliveries start. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+