రూ.19,999 లకే డిటెల్ ఎలక్ట్రిక్ స్కూటర్ - ధర, ఫీచర్లు, వివరాలు

భారత మార్కెట్లో మరో కొత్త ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ పుట్టుకొచ్చింది. ఇప్పటిక్ ఎలక్ట్రిక్ ఉపకరణాల తయారీలో పేరుగాంచిన డిటెల్, తాజాగా డిటెల్ ఈజీ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ సింగిల్ వేరియంట్‌లో మాత్రమే లభ్యం కానుంది. మార్కెట్లో దీని ధర కేవలం రూ.19,999 (ప్లస్ జీఎస్టీ).

రూ.19,999 లకే డిటెల్ ఎలక్ట్రిక్ స్కూటర్ - ధర, ఫీచర్లు, వివరాలు

డిటెల్ ఈజీ ఈ-స్కూటర్‌ను ప్రధానంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ మరియు ఫ్లీట్ ఆపరేటర్లను లక్ష్యంగా చేసుకుని మార్కెట్లో ప్రవేశపెట్టారు. డిటెల్ ఈజీ జెట్ బ్లాక్, పెరల్ వైట్ మరియు మెటాలిక్ రెడ్ అనే మూడు రంగులో లభిస్తుంది. ప్రస్తుతం దేశంలో లభిస్తున్న వాటిలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇది ఒకటిగా నిలుస్తుంది.

రూ.19,999 లకే డిటెల్ ఎలక్ట్రిక్ స్కూటర్ - ధర, ఫీచర్లు, వివరాలు

వినియోగదారులు స్కూటర్‌ను ఆన్‌లైన్‌లో బ్రాండ్ అధికారిక వెబ్‌సైట్ detel-india.com నుంచి కానీ లేదా తమ భాగస్వామి www.b2badda.com సైట్ ద్వారా కానీ కొనుగోలు చేయవచ్చు.

MOST READ:మాడిఫైడ్ బెంజ్ 600 పుల్మాన్ లిమోసిన్ : ఈ కార్ ముందు ఏ కారైనా దిగదుడుపే

రూ.19,999 లకే డిటెల్ ఎలక్ట్రిక్ స్కూటర్ - ధర, ఫీచర్లు, వివరాలు

కొనుగోలు మరియు యాజమాన్య అనుభవాన్ని మరింత సులభతరం చేయటానికి కంపెనీ తమ వినియోగదారుల కోసం ఈఎమ్ఐ ఫైనాన్స్ పథకాలను అందించడానికి బజాజ్ ఫిన్‌సర్వ్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ కొత్త ఫైనాన్స్ పథకాలతో ఇప్పుడు దేశంలోనే అత్యంత సరసమైన డిటెల్ ఈజీ ఈ-స్కూటర్ స్వంతం చేసుకోవడం మరింత సులభంగా మారుతుంది.

రూ.19,999 లకే డిటెల్ ఎలక్ట్రిక్ స్కూటర్ - ధర, ఫీచర్లు, వివరాలు

డిటెల్ ఈజీ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది లోడ్ మోయడానికి సహాయపడే యుటిటేరియన్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ముందు భాగంలో ఒక బాస్కెట్, పెరిగిన రైడర్ సీట్, ఫ్లాట్ పిలియన్ సీటు మరియు బ్యాక్‌రెస్ట్ కూడా ఉంటాయి.

MOST READ:భారీ మల్టీ-యాక్సిల్ టిప్పర్ ట్రక్కును విడుదల చేసిన టాటా మోటార్స్

రూ.19,999 లకే డిటెల్ ఎలక్ట్రిక్ స్కూటర్ - ధర, ఫీచర్లు, వివరాలు

ఫ్లీట్ ఆపరేటర్లు, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు సరిపోయేలా దీని వెనుక ఫ్లాట్ సీట్ మరియు ఫ్రంట్ బాస్కెట్‌లను డిజైన్ చేశారు. ఇది పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంటుంది. ఇందులో మొత్తం ఎల్‌ఈడీ లైటింగ్ ఉంటుంది. ఇది స్కూటర్‌లో మిగిలి ఉన్న ఛార్జింగ్ గురించి స్పష్టమైన సూచనను అందిస్తుంది.

రూ.19,999 లకే డిటెల్ ఎలక్ట్రిక్ స్కూటర్ - ధర, ఫీచర్లు, వివరాలు

డిటెల్ ఈజీ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని మోటార్ విషయానికి వస్తే, ఇందులో 250 వాట్ హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది 48 వోల్ట్ 12 ఆంప్ లైఫ్‌పిఓ4 బ్యాటరీతో పనిచేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, డిటెల్ ఈజీ స్కూటర్ పూర్తి ఛార్జ్‌పై 60 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను కలిగి ఉంటుంది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయటం కోసం సుమారు 7 నుండి 8 గంటల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది.

MOST READ:స్వాతంత్య్ర దినోత్సవం: భారత్‌లో తయారైన టాప్ 5 ఫేమస్ ‘మేడ్-ఇన్-ఇండియా' కార్లు

రూ.19,999 లకే డిటెల్ ఎలక్ట్రిక్ స్కూటర్ - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. డిటెల్ ఈజీ స్కూటర్‌ను ఉపయోగించడానికి కస్టమర్లు డ్రైవింగ్ లైసెన్స్ లేదా వాహన రిజిస్ట్రేషన్ కలిగి ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ మార్గమధ్యంలో స్కూటర్ బ్యాటరీ ఛార్జ్ అయిపోతే, చైన్ డ్రైవ్‌ను ఉపయోగించి వెనుక చక్రానికి అనుసంధానించబడిన పెడల్ వ్యవస్థ ద్వారా సైకిల్‌లా తొక్కుకుంటూ వెళ్లిపోవచ్చు.

రూ.19,999 లకే డిటెల్ ఎలక్ట్రిక్ స్కూటర్ - ధర, ఫీచర్లు, వివరాలు

స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌లు మరియు వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌ల ద్వారా బ్రేకింగ్ జరుగుతుంది. రైడర్స్ భద్రతను నిర్ధారించడానికి కంపెనీ ఓ ఉచిత హెల్మెట్ కూడా అందిస్తోంది.

MOST READ:మారుతి సుజుకి : అమ్మకాలలో కొత్త మైలురాయిని చేరుకున్న ఆల్టో

రూ.19,999 లకే డిటెల్ ఎలక్ట్రిక్ స్కూటర్ - ధర, ఫీచర్లు, వివరాలు

ఈజీ స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా, డిటెల్ వ్యవస్థాపకుడు, సీఈఓ యోగేష్ భాటియా మాట్లాడుతూ, "ప్రపంచంలోనే అత్యంత చవకైన డిటెల్-ఈవి ద్విచక్ర వాహనాన్ని ప్రారంభించినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. పర్యావరణం పట్ల పెరుగుతున్న అవగాహన, పెట్రోల్ ధరలు పెరగడం మరియు కఠినమైన ఉద్గార నిబంధనలు మొదలైనవి వివిధ అంశాల కారణంగా భారతదేశంలో ఈవి పరిశ్రమ అభివృద్ధి చెందుతోందని" అన్నారు.

రూ.19,999 లకే డిటెల్ ఎలక్ట్రిక్ స్కూటర్ - ధర, ఫీచర్లు, వివరాలు

డిటెల్ ఈజీ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ట్రెడిషనల్ స్కూటర్ అందించే అన్ని అవసరాలను తీర్చలేదు. తక్కువ దూరం ప్రయాణించడం కోసం, లాట్ మైల్ కనెక్టివిటీ మరియు ఫ్లీట్ ఆపరేటర్లను లక్ష్యంగా చేసుకొని డిటెల్ ఈజీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేశారు. ఇది ఈ సెగ్మెంట్లో ఇటీవలే విడుదలైన జెమోపాయ్ మిసో మరియు టెకో ఎలక్ట్రా సాథి వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Detel has launched a new electric scooter called the Easy in the Indian market. The electric moped is available in a single variant and retails at Rs 19,999 (plus the GST). The Easy e-scooter is primarily aimed at last-mile connectivity and fleet operators. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X