ప్రపంచంలోనే అత్యంత చవకైన హెల్మెట్‌ను విడుదల చేసిన డిటెల్!

ప్రపంచంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ డిటెల్ ఈజీ (రూ.19,999)ని తయారు చేసి ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ డిటెల్, తాజాగా డిటెల్ ట్రెడ్ పేరుతో ప్రపంచంలోనే అత్యంత సరసమైన హెల్మెట్‌ను తయారు చేసింది. ఈ డిటెల్ ట్రెడ్ హెల్మెట్ బిఐఎస్ ఆమోదం కూడా పొందింది.

ప్రపంచంలోనే అత్యంత చవకైన హెల్మెట్‌ను విడుదల చేసిన డిటెల్!

రైడర్ల సౌకర్యం మరియు సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని డిటెల్ ఈ హాఫ్-ఫేస్ హెల్మెట్‌ను అత్యంత దృఢమైన పదార్థాలతో తయారు చేసింది. భారత మార్కెట్లో డిటెల్ ట్రెడ్ హెల్మెట్ ఖరీదు ధర 699 రూపాయలు మాత్రమే. ఈ హెల్మెట్‌ను కావాలనుకునే కస్టమర్లు www.detel-india.com మరియు అమెజాన్ వెబ్‌సైట్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు.

అంతేకాకుండా, దీనిని బల్క్‌లో కొనుగోలు చేయాలనుకునే వారు B2BAdda.com ద్వారా ఆర్డ్ చేయవచ్చు. భారతదేశంలో మోటారిస్టులకు మరియు పిలియన్ రైడర్లకు హెల్మెట్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసినదే. అయితే, ఈ హెల్మెట్లు తప్పనిసరిగా బిఐఎస్ సర్టిఫై చేసినవి మాత్రమే అయి ఉండాలి.

ప్రపంచంలోనే అత్యంత చవకైన హెల్మెట్‌ను విడుదల చేసిన డిటెల్!

దేశంలో దినదినం పెరుగుతున్న టూవీలర్ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం హెల్మెట్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ట్రాఫిక్ నిబంధనలను మరియు భద్రతా నియమాలను పాటించేలా, మోటారిస్టులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించేందుకు గానూ డిటెల్ అతి తక్కువ ఖర్చుతో కూడిన ఓపెన్ ఫేస్ హెల్మెట్‌ను ప్రవేశపెట్టింది.

MOST READ:సైకిల్‌పై కాశ్మీర్ నుంచి 8 రోజుల్లో కన్యాకుమారి చేరుకున్న 17 ఏళ్ల యువకుడు, ఇతడే

ప్రపంచంలోనే అత్యంత చవకైన హెల్మెట్‌ను విడుదల చేసిన డిటెల్!

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ హెల్మెట్లను తయారు చేసినట్లు డిటెల్ పేర్కొంది. డిటెల్ ట్రెడ్ హెల్మెట్లు అధునాతనమైనవి, మన్నికైనవి మరియు తేలికైనవి. పురుషులు మరియు మహిళలు ఇరువురికి అనుకూలంగా ఉండేలా వీటిని డిజైన్ చేశారు. ఇది బైక్ రైడర్ల రోజువారీ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడినదని కంపెనీ తెలిపింది.

ప్రపంచంలోనే అత్యంత చవకైన హెల్మెట్‌ను విడుదల చేసిన డిటెల్!

డిటెల్ ట్రెడ్ తక్కువ ధర ఉన్నప్పటికీ, మన్నికలో ఎక్కడా రాజీపడదని కంపెనీ తెలిపింది. ఈ హెల్మెట్ అనేక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. ట్రెడ్ హెల్మెట్ రూపకల్పన చాలా ప్రీమియంగా ఉంటుందని మరియు రైడర్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హెల్మెట్ లోపలి వైపు తొలగించగల ఇంటీరియర్ మెటీరియల్‌తో తయారు చేశామని డిటెల్ వివరించింది.

MOST READ:కుండపోత వర్షంలో నిలబడి 4 గంటలు డ్యూటీ చేసిన పోలీస్.. ఎక్కడో తెలుసా ?

ప్రపంచంలోనే అత్యంత చవకైన హెల్మెట్‌ను విడుదల చేసిన డిటెల్!

ఈ హెల్మెట్ యొక్క వైజర్ గీతలు పడకుండా ఉండేలా (స్క్రాచ్-ఫ్రీ) మరియు రాత్రి వేళ్లలో బైక్ నడుపుతున్నప్పుడు దృశ్యమానత (విజిబిలిటీ) స్పష్టంగా ఉండేలా దృఢమైన క్లియర్ ప్లాస్టిక్‌తో తయారు చేయబడినది. అంతేకాకుండా, ఎదురుగా మరియు వెనుకగా వచ్చే వాహనాలను అప్రమత్తం చేసేందుకు హెల్మెట్ పైభాగంలో ఓ రిఫ్లెక్టర్ కూడా ఉంటుంది.

ప్రపంచంలోనే అత్యంత చవకైన హెల్మెట్‌ను విడుదల చేసిన డిటెల్!

ఈ సందర్భంగా, డిటెల్ వ్యవస్థాపకుడు యోగేష్ భాటియా మాట్లాడుతూ, 'రహదారి భద్రత విషయంలో రైడర్ మరియు పిలియన్ రైడర్ కోసం హెల్మెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదించిన చొరవను మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. దేశంలో హెల్మెట్ నిబంధనలు మారిన తర్వాత, ఇప్పుడు చాలా మంది కస్టమర్లు నాణ్యమైన హెల్మెట్ల కోసం చూస్తున్నారు. సాధారణంగా రోడ్డు ప్రక్కన లభించే నాసిరకం హెల్మెట్లు చాలా ప్రమాదకరమైనవి. ఈ నేపథ్యంలో, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని వారికి సరసమైన ధరకే సురక్షితమైన హెల్మెట్‌ను అందించాలనే ఉద్దేశ్యంతో ట్రెడ్ హెల్మెట్‌ను తీసుకురావటం జరిగింద'ని అన్నారు.

MOST READ:పబ్‌జి ప్రేమికుల కోసం తయారైన కొత్త హెల్మెట్స్.. చూసారా !

Most Read Articles

English summary
Detel has launched a new helmet called the TRED in the Indian market. The company claims it is a world’s most economical helmet. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X