Just In
- 21 hrs ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- 23 hrs ago
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- 1 day ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 1 day ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
Don't Miss
- Lifestyle
సోమవారం దినఫలాలు : ఉద్యోగులు ఈరోజు పనిని సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతారు...!
- News
ఘోరం: పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లిదండ్రులు, మళ్లీ బతికిస్తాం, కరోనా శివుడి తల నుంచే..
- Movies
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రపంచంలోనే అత్యంత చవకైన హెల్మెట్‌ను విడుదల చేసిన డిటెల్!
ప్రపంచంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ డిటెల్ ఈజీ (రూ.19,999)ని తయారు చేసి ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ డిటెల్, తాజాగా డిటెల్ ట్రెడ్ పేరుతో ప్రపంచంలోనే అత్యంత సరసమైన హెల్మెట్‌ను తయారు చేసింది. ఈ డిటెల్ ట్రెడ్ హెల్మెట్ బిఐఎస్ ఆమోదం కూడా పొందింది.

రైడర్ల సౌకర్యం మరియు సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని డిటెల్ ఈ హాఫ్-ఫేస్ హెల్మెట్‌ను అత్యంత దృఢమైన పదార్థాలతో తయారు చేసింది. భారత మార్కెట్లో డిటెల్ ట్రెడ్ హెల్మెట్ ఖరీదు ధర 699 రూపాయలు మాత్రమే. ఈ హెల్మెట్‌ను కావాలనుకునే కస్టమర్లు www.detel-india.com మరియు అమెజాన్ వెబ్‌సైట్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు.
అంతేకాకుండా, దీనిని బల్క్‌లో కొనుగోలు చేయాలనుకునే వారు B2BAdda.com ద్వారా ఆర్డ్ చేయవచ్చు. భారతదేశంలో మోటారిస్టులకు మరియు పిలియన్ రైడర్లకు హెల్మెట్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసినదే. అయితే, ఈ హెల్మెట్లు తప్పనిసరిగా బిఐఎస్ సర్టిఫై చేసినవి మాత్రమే అయి ఉండాలి.

దేశంలో దినదినం పెరుగుతున్న టూవీలర్ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం హెల్మెట్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ట్రాఫిక్ నిబంధనలను మరియు భద్రతా నియమాలను పాటించేలా, మోటారిస్టులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించేందుకు గానూ డిటెల్ అతి తక్కువ ఖర్చుతో కూడిన ఓపెన్ ఫేస్ హెల్మెట్‌ను ప్రవేశపెట్టింది.
MOST READ:సైకిల్‌పై కాశ్మీర్ నుంచి 8 రోజుల్లో కన్యాకుమారి చేరుకున్న 17 ఏళ్ల యువకుడు, ఇతడే

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ హెల్మెట్లను తయారు చేసినట్లు డిటెల్ పేర్కొంది. డిటెల్ ట్రెడ్ హెల్మెట్లు అధునాతనమైనవి, మన్నికైనవి మరియు తేలికైనవి. పురుషులు మరియు మహిళలు ఇరువురికి అనుకూలంగా ఉండేలా వీటిని డిజైన్ చేశారు. ఇది బైక్ రైడర్ల రోజువారీ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడినదని కంపెనీ తెలిపింది.

డిటెల్ ట్రెడ్ తక్కువ ధర ఉన్నప్పటికీ, మన్నికలో ఎక్కడా రాజీపడదని కంపెనీ తెలిపింది. ఈ హెల్మెట్ అనేక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. ట్రెడ్ హెల్మెట్ రూపకల్పన చాలా ప్రీమియంగా ఉంటుందని మరియు రైడర్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హెల్మెట్ లోపలి వైపు తొలగించగల ఇంటీరియర్ మెటీరియల్‌తో తయారు చేశామని డిటెల్ వివరించింది.
MOST READ:కుండపోత వర్షంలో నిలబడి 4 గంటలు డ్యూటీ చేసిన పోలీస్.. ఎక్కడో తెలుసా ?

ఈ హెల్మెట్ యొక్క వైజర్ గీతలు పడకుండా ఉండేలా (స్క్రాచ్-ఫ్రీ) మరియు రాత్రి వేళ్లలో బైక్ నడుపుతున్నప్పుడు దృశ్యమానత (విజిబిలిటీ) స్పష్టంగా ఉండేలా దృఢమైన క్లియర్ ప్లాస్టిక్‌తో తయారు చేయబడినది. అంతేకాకుండా, ఎదురుగా మరియు వెనుకగా వచ్చే వాహనాలను అప్రమత్తం చేసేందుకు హెల్మెట్ పైభాగంలో ఓ రిఫ్లెక్టర్ కూడా ఉంటుంది.

ఈ సందర్భంగా, డిటెల్ వ్యవస్థాపకుడు యోగేష్ భాటియా మాట్లాడుతూ, 'రహదారి భద్రత విషయంలో రైడర్ మరియు పిలియన్ రైడర్ కోసం హెల్మెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదించిన చొరవను మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. దేశంలో హెల్మెట్ నిబంధనలు మారిన తర్వాత, ఇప్పుడు చాలా మంది కస్టమర్లు నాణ్యమైన హెల్మెట్ల కోసం చూస్తున్నారు. సాధారణంగా రోడ్డు ప్రక్కన లభించే నాసిరకం హెల్మెట్లు చాలా ప్రమాదకరమైనవి. ఈ నేపథ్యంలో, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని వారికి సరసమైన ధరకే సురక్షితమైన హెల్మెట్‌ను అందించాలనే ఉద్దేశ్యంతో ట్రెడ్ హెల్మెట్‌ను తీసుకురావటం జరిగింద'ని అన్నారు.
MOST READ:పబ్‌జి ప్రేమికుల కోసం తయారైన కొత్త హెల్మెట్స్.. చూసారా !