టీవీఎస్ యంగ్ మీడియా రేసర్ ప్రోగ్రామ్‌లో మరో అడుగు ముందుకేసిన డ్రైవ్‌స్పార్క్ ; వివరాలు

టీవీఎస్ తన యంగ్ మీడియా రేసర్ ప్రోగ్రామ్‌ను సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం 2017 లో తిరిగి ప్రారంభమైంది మరియు ఇది ప్రస్తుతం వారి నాల్గవ సీజన్. ఈ రేస్ లో దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు ఒకరిపై ఒకరు పోటీ పడతారు.

టీవీఎస్ యంగ్ మీడియా రేసర్ ప్రోగ్రామ్‌లో మరో అడుగు ముందుకేసిన డ్రైవ్‌స్పార్క్ ; వివరాలు

మా డ్రైవ్‌స్పార్క్ ఇప్పుడు మూడు సీజన్లుగా ఈ యంగ్ మీడియా రేసర్ కార్యక్రమంలో పాల్గొంటోంది. ఈ సారి కోవిడ్-19 మహమ్మారి కారణంగా సీజన్ కొంత ఆలస్యం అయింది. కాబట్టి ఈ సారి ట్రైనింగ్ మరియు క్వాలిఫయింగ్ సెషన్ కోసం 14 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.

టీవీఎస్ యంగ్ మీడియా రేసర్ ప్రోగ్రామ్‌లో మరో అడుగు ముందుకేసిన డ్రైవ్‌స్పార్క్ ; వివరాలు

ఇటీవల చెన్నైలో జరిగిన టీవీఎస్ యంగ్ మీడియా రేసర్ ప్రోగ్రామ్ 4.0 యొక్క తదుపరి దశకు చేరుకుంది. టీవీఎస్ యంగ్ మీడియా రేసర్ ప్రోగ్రామ్ 4.0 కి డ్రైవ్‌స్పార్క్ తరపున మా రివ్యూ ఎడిటర్ ప్రోమీత్ ఘోష్ హాజరయ్యారు, అంతే కాకుండా అతను తదుపరి రేస్‌కు అర్హత సాధించాడు.

MOST READ:కొత్త ఫీచర్స్‌తో రానున్న 2021 రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ.. చూసారా!

టీవీఎస్ యంగ్ మీడియా రేసర్ ప్రోగ్రామ్‌లో మరో అడుగు ముందుకేసిన డ్రైవ్‌స్పార్క్ ; వివరాలు

టీవీఎస్ యంగ్ మీడియా రేసర్ ప్రోగ్రాం 4.0 లో డ్రైవ్‌స్పార్క్ తదుపరి దశకు చేరుకుని విజయాన్ని సాధించింది. ఈ రేసు రేస్-స్పెక్ టివిఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4 వి లో జరుగుతుంది.

టీవీఎస్ యంగ్ మీడియా రేసర్ ప్రోగ్రామ్‌లో మరో అడుగు ముందుకేసిన డ్రైవ్‌స్పార్క్ ; వివరాలు

కోవిడ్ సమయంలో కూడా మంచి మార్గంలో శిక్షణ ఇవ్వబడింది. రేసర్లందరినీ నాలుగు గ్రూపులుగా విభజించారు మరియు అన్ని రైడర్స్ మధ్య 10 సెకన్ల గ్యాప్ ఉంటుంది. ఒక ల్యాప్ తరువాత ప్రతి ఒక్కరికి బెస్ట్ టైమింగ్ పొందడానికి మూడు ల్యాప్లు ఇవ్వబడ్డాయి.

MOST READ:ఇకపై ట్రాఫిక్ ఫైన్ చెల్లించకపోతే ఏమవుతుందో తెలుసా !

టీవీఎస్ యంగ్ మీడియా రేసర్ ప్రోగ్రామ్‌లో మరో అడుగు ముందుకేసిన డ్రైవ్‌స్పార్క్ ; వివరాలు

క్వాలిఫైయింగ్ సెషన్ ముగిసిన తరువాత, డ్రైవ్‌స్పార్క్‌కు పి 5 (ల్యాప్ టైమ్ 2.29.31 తో) స్థానం లభించిందని చెప్పడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మాత్రమే కాకుండా మా డ్రైవ్‌స్పార్క్ తదుపరి రేస్‌కు కూడా అర్హత సాధించాము. ఇప్పుడు డ్రైవ్‌స్పార్క్ తదుపరి రేసులో మళ్లీ తన ప్రతిభను చూపించబోతోంది.

టీవీఎస్ యంగ్ మీడియా రేసర్ ప్రోగ్రామ్‌లో మరో అడుగు ముందుకేసిన డ్రైవ్‌స్పార్క్ ; వివరాలు

వచ్చే నెలలో జరగబోయే వచ్చే సీజన్ కోసం మేము త్వరలో రేస్ ట్రాక్‌లో ఉండబోతున్నాం. డ్రైవ్‌స్పార్క్ కొన్నేళ్లుగా అదేవిధంగా మంచి ప్రదర్శన కనబరిచింది మరియు వచ్చే సీజన్‌లో కూడా మంచి ప్రదర్శన కనబరిచి మంచి స్థానాలు సాధిస్తుందని భావిస్తున్నాము.

MOST READ:పట్టాలెక్కనున్న కొత్త డబుల్ డెక్కర్ ట్రైన్స్ ; ఎప్పుడో తెలుసా ?

టీవీఎస్ యంగ్ మీడియా రేసర్ ప్రోగ్రామ్‌లో మరో అడుగు ముందుకేసిన డ్రైవ్‌స్పార్క్ ; వివరాలు

టీవీఎస్ యంగ్ మీడియా రేసర్ ప్రోగ్రాం 4.0 ను మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్‌లో ఈసారి కూడా మునుపటిలాగానే నిర్వహించారు. కరోనా సమయంలో కూడా రేసును సురక్షితంగా నిర్వహించినందుకు టీవీఎస్ కూడా నిజంగా ప్రశంసనీయం. టీవీఎస్ ఇలాగే ఎప్పటికి తన బైకింగ్ కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము.

Most Read Articles

English summary
TVS Young Media Racer Program 4.0. Read in Telugu.
Story first published: Monday, November 23, 2020, 19:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X