దుమ్మురేపుతున్న డుకాటీ పానిగలే V 2 టీజర్ ఇమేజ్

డుకాటీ కంపెనీ తమ రాబోయే మోటారుసైకిల్ యొక్క టీజర్ ఇమేజ్ భారత మార్కెట్లో విడుదల చేసింది. పానిగలే వి 2 మోటార్ సైకిల్ యొక్క ఇమేజ్ కంపెనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయబడింది. ఈ మోటారుసైకిల్ త్వరలో భారత మార్కెట్లో అమ్మకానికి రానుంది. ఈ కొత్త మోటార్ సైకిల్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.

దుమ్మురేపుతున్న డుకాటీ పానిగలే V 2 టీజర్ ఇమేజ్

డుకాటీ పానిగలే వి 2 మొట్టమొదట ప్రపంచవ్యాప్తంగా 2019 ఇఐసిఎమ్ఎ లో ఆవిష్కరించబడింది. డుకాటీ భారత మార్కెట్ దాని లాంచ్ డేట్ మాత్రం ధ్రువీకరించలేదు. కానీ త్వరలో రాబోతుందని మాత్రం మేము ఆశిస్తున్నాము. ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల ఈ వ్యవధి కొంత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ మోటార్ సైకిల్ యొక్క ఇమేజ్ పోస్ట్ చేయడం జరిగింది.

దుమ్మురేపుతున్న డుకాటీ పానిగలే V 2 టీజర్ ఇమేజ్

భారతదేశంలో డుకాటీ ఒకసారి లాంచ్ అయిన తర్వాత, డుకాటీ పానిగలే వి 2 ఇటాలియన్ బ్రాండ్ యొక్క మొట్టమొదటి బిఎస్-6 కంప్లైంట్ ఆఫర్ అవుతుంది.

MOST READ:సుజుకి బర్గ్‌మన్ 200 స్కూటర్ : ధర & ఇతర వివరాలు

దుమ్మురేపుతున్న డుకాటీ పానిగలే V 2 టీజర్ ఇమేజ్

కొత్త డుకాటీ పానిగలే వి 2 యూరో 5 కంప్లైంట్ 955 సిసి సూపర్ క్వాడ్రో ఎల్-ట్విన్ ఇంజిన్‌ని కలిగి ఉంటుంది. ఇది 10,750 ఆర్‌పిఎమ్ వద్ద 155 బిహెచ్‌పి మరియు 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 104 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

దుమ్మురేపుతున్న డుకాటీ పానిగలే V 2 టీజర్ ఇమేజ్

ఈ కొత్త డుకాటీ పానిగలే వి 2 చూడటానికి చాలా వరకు పానిగలే వి 4 మోటార్ సైకిల్ ని పోలి ఉంటుంది. ఈ బిఎస్ 6 పానిగలే వి 2 మోటార్ సైకిల్ పానిగలే వి 4 బైక్ నుంచి చాలా భాగాలను తీసుకుంటుంది. ఇందులో సింగిల్-సైడెడ్ స్వింగార్మ్, ఐఎంయు అసిస్టెడ్ ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, కార్నరింగ్ ఎబిఎస్ మరియు ఇంజిన్ బ్రేకింగ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

MOST READ:కరోనా బాధితుల కోసం బైక్ అంబులెన్సులు విరాళంగా ఇచ్చిన హీరో మోటోకార్ప్

దుమ్మురేపుతున్న డుకాటీ పానిగలే V 2 టీజర్ ఇమేజ్

డుకాటీ పానిగలే వి 2 మోటార్ సైకిల్ 959 పానిగలే బైక్ యొక్క నవీనీకరణ అని చెప్పాలి. పానిగలే వి 2 మోనోకోక్ ఫ్రేమ్ ద్వారా కొనసాగుతోంది, సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ భాగాలు 959 పానిగలే నుండి తీసుకోబడిపోయింది.

దుమ్మురేపుతున్న డుకాటీ పానిగలే V 2 టీజర్ ఇమేజ్

డుకాటీ పానిగలే వి 2 లో 43 మిమీ పుల్లీ అడ్జస్టబుల్ బిగ్ పిస్టన్ ఫోర్కులు కలిగి ఉంటుంది. అంతే కాకుండా వెనుక భాగంలో మోనో-షాక్ సెటప్ ఉంటుంది. దీని బ్రేకింగ్ వ్యవస్థను గమనించినట్లయితే ముందు భాగంలో డ్యూయల్ 320 మిమీ సెమీ ఫ్లోటింగ్ డిస్క్‌లు మరియు వెనుక భాగంలో ఒకే 245 ఎంఎం ఉంటుంది.

MOST READ:అధికారిక వెబ్ సైట్ నుంచి తొలగించబడిన హోండా మోటార్ సైకిల్స్, ఎందుకంటే..?

దుమ్మురేపుతున్న డుకాటీ పానిగలే V 2 టీజర్ ఇమేజ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం..!

డుకాటీ పానిగలే వి 2 ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఆఫర్, ఇది 2019 EICMA లో ఆవిష్కరించబడింది. అప్పటి నుంచి ఈ మోటార్ సైకిల్ భారత మార్కెట్లో ఎక్కువ ధరను కలిగి ఉంది. దీని ధర దాదాపుగా రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉంటుంది.

Most Read Articles

English summary
Ducati Panigale V2 Teaser Image Released Ahead Of India Launch: Here Are All The Details. Read in Telugu.
Story first published: Wednesday, April 29, 2020, 17:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X