డ్యుకాటి పానిగేల్ వి2 వైట్ రోసో ఆవిష్కరణ - స్పెసిఫికేషన్లు, వివరాలు

ఇటాలియన్ మోటారుసైకిల్ బ్రాండ్ డ్యుకాటి ఓ సరికొత్త మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. 'డ్యుకాటి పానిగేల్ వి2 వైట్ రోసో' పేరుతో కంపెనీ ఈ కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. ఈ మోటారుసైకిల్ మొట్టమొదటి సారిగా వరల్డ్ డ్యుకాటి ప్రీమియర్‌లో కనిపించింది మరియు ఇది బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవల్ సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్ అయిన డ్యుకాటి 959 పానిగేల్ స్థానాన్ని భర్తీ చేయనుంది.

డ్యుకాటి పానిగేల్ వి2 వైట్ రోసో ఆవిష్కరణ - స్పెసిఫికేషన్లు, వివరాలు

పానిగేల్ వి2 మోటార్‌సైకిల్ బాడీవర్క్‌లో పెరల్ వైట్ పెయింట్ స్కీమ్ మరియు ఎయిర్ వెంట్స్ మరియు సైడ్ ఫెయిరింగ్‌ల వద్ద రెడ్ కలర్ హైలైట్స్ ఉంటాయి. ఈ మోటార్‌సైకిల్‌లోని అల్లాయ్ వీల్స్‌ను కూడా రెడ్ కలర్ థీమ్‌తో డిజైన్ చేశారు.

డ్యుకాటి పానిగేల్ వి2 వైట్ రోసో ఆవిష్కరణ - స్పెసిఫికేషన్లు, వివరాలు

డ్యుకాటి పానిగేల్ వి2 బైక్‌లో ఈ కొత్త పెయింట్ స్కీమ్ మినహా వేరే ఇతర మార్పులు చేయలేదు. ఈ మోటార్‌సైకిల్‌లో 155 బిహెచ్‌పి మరియు 104 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే బిఎస్6 కంప్లైంట్ 955 సిసి సూపర్‌క్వాడ్రో ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

డ్యుకాటి పానిగేల్ వి2 వైట్ రోసో ఆవిష్కరణ - స్పెసిఫికేషన్లు, వివరాలు

డ్యుకాటి భారత మార్కెట్లో కూడా తమ కొత్త పానిగేల్ వి2 ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది, అయితే మోటారుసైకిల్ ఎప్పుడు విడుదల అవుతుందనే విషయంపై ప్రస్తుతం ఎటువంటి ధృవీకరణ లేదు. వైట్ రోసో పెయింట్ స్కీమ్‌తో తయారు చేసిన కొత్త డ్యుకాటి పానిగేల్ వి2 భారత మార్కెట్లో లభించకపోవచ్చని సమాచారం.

డ్యుకాటి పానిగేల్ వి2 వైట్ రోసో ఆవిష్కరణ - స్పెసిఫికేషన్లు, వివరాలు

డ్యుకాటి పానిగేల్ వి2 భారత మార్కెట్లో విడుదలైతే దాని ధర సుమారు రూ.16.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉండొచ్చని అంచనా. ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న డ్యుకాటి 959 పానిగేల్ ధర (రూ. 15.30 లక్షలు, ఎక్స్-షోరూమ్) కంటే కాస్తం ఎక్కువగా ఉంటుది.

డ్యుకాటి పానిగేల్ వి2 వైట్ రోసో ఆవిష్కరణ - స్పెసిఫికేషన్లు, వివరాలు

ఇక డ్యుకాటి సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, ఈ బ్రాండ్ ఇటీవలే డ్యుకాటి స్క్రాంబ్లర్ సిరీస్ మోటార్‌సైకిళ్ల అనేక యాక్ససరీలను పరిచయం చేసింది. ఈ కొత్త యాక్ససరీలను కాన్ఫిగరేటర్ ద్వారా ఆన్‌లైన్‌లో చూడవచ్చు మరియు కొనుగోలుదారులు తమ మోటార్‌సైకిళ్లతో పాటు వాటిని కొనుగోలు చేసి, తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

డ్యుకాటి పానిగేల్ వి2 వైట్ రోసో ఆవిష్కరణ - స్పెసిఫికేషన్లు, వివరాలు

ఈ యాక్ససరీల శ్రేణిని పూర్తిగా పరిశోధించిన తర్వాతే అభివృద్ధి చేశామని, ఇవి స్టైల్ మరియు ప్రాక్టికాలిటీ మధ్య అద్భుతమైన సమతుల్యతను అందిస్తుందని డ్యుకాటి పేర్కొంది. డ్యుకాటి ప్రస్తుత కస్టమర్లు మరియు భవిష్యత్ కస్టమర్ల కోసం కంపెనీ ఓ వర్చువల్ గ్యారేజీని కూడా సృష్టించింది, దీని ద్వారా కస్టమర్లు కొనుగోలుకు ముందే తమకు నచ్చిన యాక్ససరీలు బైక్‌పై ఎలా కనిపిస్తాయో తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది.

డ్యుకాటి పానిగేల్ వి2 వైట్ రోసో ఆవిష్కరణ - స్పెసిఫికేషన్లు, వివరాలు

డ్యుకాటి స్క్రాంబ్లర్ రేంజ్ మోటార్‌సైకిళ్ల కోసం సీట్లు, ఎగ్జాస్ట్ సిస్టమ్స్, బ్యాగ్స్, వాటర్‌ప్రూఫ్ పన్నీర్స్, హెడ్‌లైట్ యాక్సెసరీస్, బార్ ఎండ్ మిర్రర్స్ వంటి అనేక ఇతర యాడ్-ఆన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

డ్యుకాటి పానిగేల్ వి2 వైట్ రోసో ఆవిష్కరణ - స్పెసిఫికేషన్లు, వివరాలు

డ్యుకాటి పానిగేల్ వి2 వైట్ రోసో మోటార్‌సైకిల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

వైట్ అండ్ రెడ్ పెయింట్ స్కీమ్‌తో తయారైన డ్యుకాటి పానిగేల్ వి2 వైట్ రోసో, డ్యుకాటి రెడ్ పెయింట్ స్కీమ్‌తో పోల్చుకుంటే తక్కువే అయినప్పటికీ ఇది మోటారుసైకిల్‌కు మరింత క్యారెక్టర్‌ను జోడిస్తుంది. వ్యక్తిగతీకరించిన పెయింట్ జాబ్స్‌తో ఎవరైతో తమ మోటార్‌సైకిల్‌ను కస్టమైజ్ చేసుకోవాలనుకుంటారో వారికి ఇది అద్భుతమైన కాన్వాస్‌లా ఉంటుంది. ఇందులోని కొత్త బిఎస్6 కంప్లైంట్ ఇంజన్ పాత బిఎస్4 కంప్లైంట్ ఇంజన్ కన్నా అధికంగా 5 బిహెచ్‌పిల ఎక్కువ శక్తిని ఉత్పత్తిని చేయటం కూడా మంచి విషయంగా చెప్పుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, July 6, 2020, 15:40 [IST]
English summary
Italian motorcycle manufacturer Ducati has just about unveiled its Panigale V2 White Rosso. The motorcycle made its first public appearance at the World Ducati Premier, and will replace the 959 Panigale as the brand's entry-level supersport motorcycle. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+