Just In
- 22 min ago
2020 ఇండియన్ నేషనల్ మోటార్‌సైకిల్ డ్రాగ్ ఛాంపియన్షిప్ విజేతగా హేమంత్ ముద్దప్ప
- 1 hr ago
భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..
- 1 hr ago
కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి
- 3 hrs ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
Don't Miss
- News
నిమ్మగడ్డతో పోరులో జగన్ వైఫల్యానికి కారణమిదే -తర్వాత స్టెప్ ఇదైతేనే సేఫ్: ఎంపీ రఘురామ
- Sports
'కార్టూన్ బాయ్' రిషభ్ పంత్‌ను ట్రోల్ చేసిన రషీద్ ఖాన్!! ఏమన్నాడంటే?
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు... ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న తొలి మహిళా పైలట్ స్వాతి రాథో
- Finance
కరోనా టైంలో ముఖేష్ అంబానీ ప్రతి గంట సంపాదన రూ.90 కోట్లు, వారి సంపద రూ.3వేలే!
- Movies
30 ఏళ్ళ తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్ అన్నయ్యలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌కు రానున్న 2021 డ్యుకాటి స్క్రాంబ్లర్ రేంజ్ మోటార్‌సైకిళ్లు
ఇటాలియన్ సూపర్ బైక్ కంపెనీ డ్యుకాటి, తమ 2021 స్క్రాంబ్లర్ రేంజ్ మోటార్‌సైకిళ్లను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఈ కొత్త మోడళ్లు వచ్చే ఏడాదిలో భారత మార్కెట్లో కూడా విడుదల కానున్నాయి. కొత్త 2021 డ్యుకాటి స్క్రాంబ్లర్ రేంజ్ మోటార్‌సైకిళ్లు ఇప్పుడు అనేక కాస్మెటిక్ అప్డేట్స్, రీడిజైన్స్, కొత్త ఫీచర్లు మరియు అదనపు పరికరాలతో మునుపటి కంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

కొత్త 2021 డ్యుకాటి స్క్రాంబ్లర్ రేంజ్ మోడళ్లు ఇప్పుడు కొత్త ఫీచర్లు, డిజైన్, పరికరాలతో పాటుగా సరికొత్త ‘నైట్‌షిఫ్ట్' వేరియంట్‌తో కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త వేరియంట్ ఐకాన్, ఐకాన్ డార్క్ మరియు డెసెర్ట్ స్లెడ్ వేరియంట్లలో లభ్యం కానున్నాయి.

కొత్త 2021 డ్యుకాటి స్క్రాంబ్లర్ రేంజ్‌లోని నాలుగు వేరియంట్లు కూడా ఇప్పుడు 800సిసి ఇంజిన్ యొక్క అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను కలిగి ఉంటాయి. ఈ ఇంజన్ ఇప్పుడు కఠినమైన యూరో-5 (బిఎస్6 సమానమైన) ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.
MOST READ:పరుగులు తీస్తున్న ఫాస్ట్‌ట్యాగ్ ఇన్స్టాలేషన్.. ఇప్పటికి ఎంతో తెలుసా?

ఈ ఇంజన్ 803సిసి ఎల్-ట్విన్ ఎయిర్-కూల్డ్ యూనిట్ రూపంలో లభిస్తుంది. ఇది గరిష్టంగా 8250 ఆర్‌పిఎమ్ వద్ద 72 బిహెచ్పి పవర్‌ను మరియు 5750 ఆర్‌పిఎమ్ వద్ద 66 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఈ మోటార్‌సైకిళ్లలో ముందు వైపు కయాబా నుండి గ్రహించిన 41 మిమీ అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు మరియు వెనుక వైపు మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. కాగా, వెనుక సస్పెన్షన్ యూనిట్ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్తో లభిస్తుంది. ఫ్రంట్ అండ్ రియర్ సెటప్ రెండూ 150 మిమీ ట్రావెల్‌ను కలిగి ఉంటాయి.
MOST READ:కవాసకి బైక్ ఇంజిన్‌తో నడిచే హెలికాఫ్టర్.. మీరు చూసారా !

బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపు 330 మిమీ డిస్క్ మరియు వెనుక వైపు 245 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. కొత్త 2021 డ్యుకాటి స్క్రాంబ్లర్ రేంజ్ మోడళ్లు బాష్ నుండి గ్రహించిన కార్నరింగ్ ఏబిఎస్‌తో లభ్యం కానున్నాయి.

కొత్త 2021 డ్యుకాటి స్క్రాంబ్లర్ రేంజ్లో నైట్‌షిఫ్ట్ మరియు డెసెర్ట్ స్లెడ్ వేరియంట్లు స్పోక్ అల్యూమినియం వీల్స్‌తో రానుండగా, ఐకాన్ వేరియంట్లు అల్లాయ్ వీల్స్‌తో లభ్యం కానున్నాయి. ఈ మోటార్‌సైకిళ్లలో ముందు వైపు 18 ఇంచ్ వీల్స్ మరియు వెనుకవైపు 17 ఇంచ్ వీల్స్ ఉంటాయి మరియు వీటిపై పిరెల్లి టైర్లను అమర్చబడి ఉంటాయి.
MOST READ:ప్రత్యర్థులకు సరైన ప్రత్యర్థిగా నిలవనున్న రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 [డ్రైవ్ వీడియో]

కొత్త నైట్ షిఫ్ట్ వేరియంట్ కొత్త ఏవియేషన్ గ్రే పెయింట్ స్కీమ్‌తో పాటు సన్నటి హ్యాండిల్బార్లను కలిగి ఉండి, వెనుక ఫెండర్‌ను కోల్పోతుంది. ఇందులో కేఫ్-రేసర్ స్టైల్ మిర్రర్స్ మరియు ఫుల్-థ్రోటల్ స్టైల్ నంబర్ ప్లేట్లు ఉంటాయి.

కొత్త 2021 స్క్రాంబ్లర్ మోడళ్లు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడి లైటింగ్ కోసం ఎల్సిడి డిస్ప్లే యూనిట్లను కలిగి ఉన్నాయి. ఐకాన్ మరియు డెసెర్ట్ స్లెడ్ వేరియంట్లు కూడా అనేక కొత్త పవర్ఫుల్ పెయింట్ స్కీమ్‌లను కలిగి ఉంటాయి.
MOST READ:మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

డెసెర్ట్ స్లెడ్ మోడల్లో ఇప్పుడు కొత్త ‘స్పార్క్లింగ్ బ్లూ' పెయింట్ స్కీమ్‌తో లభిస్తుంది. అలాగే, 2021 స్క్రాంబ్లర్ ఐకాన్ వేరియంట్ ఇప్పుడు కొత్త ‘డ్యుకాటి రెడ్' కలర్ ఆప్షన్లో అందుబాటులోకి రానుంది. ఇది స్టాండర్డ్ ఎల్లో పెయింట్ స్కీమ్‌తో కూడా లభిస్తుంది.

డ్యుకాటి 2021 స్క్రాంబ్లర్ రేంజ్ మోటార్‌సైకిళ్లపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
డ్యుకాటి 2021 స్క్రాంబ్లర్ రేంజ్ మోటార్‌సైకిళ్లను వచ్చే ఏడాది మధ్య భాగంలో భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. డ్యుకాటి ఇప్పటికే స్క్రాంబ్లర్ యొక్క పెద్ద 1100 సిసి వెర్షన్లను ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసినదే.