Just In
- 2 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 3 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 4 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 5 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- News
394 మంది పోలీసులకు గాయాలు.. కొందరు ఐసీయూలో.. 19 మంది అరెస్ట్: ఢిల్లీ సీపీ
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఒకే నెలలో భారీగా అమ్ముడైన ఇఎమ్ఎక్స్ ఎలక్ట్రిక్ సైకిల్, ఇదే
ఇటీవల కాలంలో సాధారణంగా బైకులు, కార్లు ఎక్కువ ఇష్టపడతారనే విషయం అందరికి తెలిసిందే, ఇది మాత్రమే కాదు చాలామంది ప్రజలు ఇప్పటికి కూడా ఎక్కువగా సైకిల్స్ ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు. ఈ తరుణంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ సైకిల్స్ తయారుచేసి విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో కొత్త సైకిల్ పుట్టుకొచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

పూణేకు చెందిన ఇ-మోటొరాడ్ ఇటీవల ఎలక్ట్రిక్ సైకిల్ ఇఎమ్ఎక్స్ ను విడుదల చేసింది. మొదటి దశలో ఈ ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ యొక్క 1,200 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇ-మోట్రాడ్ సంస్థ ప్రారంభించిన ఒక నెలలోనే అన్ని సైకిళ్లను విక్రయించినట్లు తెలిపింది.

ఇ-మోటొరాడ్ అనేది ఒక స్టార్టప్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు. కంపెనీ యొక్క ఈ-బైక్‌లకు మంచి ఆదరణ లభించింది, ఇది భారత సైకిల్ మార్కెట్‌కు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ కారణంగా దీనికి మరిన్ని ఎలక్ట్రిక్ సైకిళ్లను విడుదల చేయడానికి వీలు కల్పిస్తుంది.
MOST READ:ఒకటి, రెండు కాదు ఏకంగా 80 పోర్స్చే కార్లను కలిగి ఉన్న 80 ఏళ్ళ వ్యక్తి ; పూర్తి వివరాలు

అతి తక్కువ కాలంలోనే ఎక్కువ అమ్మకాల కారణంగా పూణేకు చెందిన ఈ సంస్థ తన అమ్మకందారుల సంఖ్యను పెంచాలని యోచిస్తోంది. 100 మందికి పైగా కొత్త డీలర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ తాజా నివేదికలో తెలిపింది.

ఇ-మోటొరాడ్ మొదటి మరియు రెండవ శ్రేణి నగరాల్లో పెద్ద సంఖ్యలో షోరూమ్‌లను ఓపెన్ చేయాలనుకుంటోంది. 2021 నాటికి సుమారు 12,000 ఇ-సైకిళ్లను విక్రయించాలని కూడా కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఇ-మోటోరాడ్ కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్‌భార్ ప్రాజెక్టు సహాయం కోరినట్లు ఇ-మోటోరాడ్ అధ్యక్షుడు కునాల్ గుప్తా అన్నారు.
MOST READ:ఉద్యోగుల కోసం గృహ నిర్మాణాలను చేపడుతున్న మారుతి సుజుకి; వివరాలు

ప్రస్తుతం అమ్మకంలో అత్యధికంగా అమ్ముడైన ఇఎమ్ఎక్స్ ఈ-సైకిల్ రెండు సస్పెన్షన్ మరియు డిస్క్ బ్రేక్‌లతో సహా అనేక ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క గరిష్ట వేగం గంటకు 21 కి.మీ. ఇఎమ్ఎక్స్ ఎలక్ట్రిక్ మోటారుసైకిల్‌ను ఛార్జ్ చేయడానికి కంపెనీ ఈ సైకిల్ లో శామ్‌సంగ్ బ్యాటరీని ఏర్పాటు చేసింది.

ఈ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత, ఇఎమ్ఎక్స్ ఎలక్ట్రిక్ సైకిల్ 45 కి.మీ వరకు కదులుతుంది. అంతే కాకుండా సాధారణ సైకిల్ లాగా సుమారు 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇఎమ్ఎక్స్ ఎలక్ట్రిక్ సైకిల్ మూడు మోడల్స్ లో విక్రయించబడుతుంది. అవి కాస్మోస్, డి-రెక్స్ మరియు డి-రెక్స్ ప్రో అనే వేరియంట్స్.
MOST READ:టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసిన కేరళ ప్రభుత్వం.. ఎందుకంటే ?

ఈ ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ ప్రారంభ ధర రూ. 50 వేలు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా దీనిని సాధారణ సైకిల్ లాగా కూడా ఉపయోగించవచ్చు. ఇటీవల కాలంలో సైకిల్స్ కి ఉన్న ప్రాధాన్యత అందరికి తెలిసిందే, కావున మార్కెట్లో మరింత ఎక్కువ అమ్మకాలు జరుగుతాయి.