ఈమోస్ వైల్డ్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ; ధర & ఇతర వివరాలు

ఆస్ట్రేలియాకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ తన కొత్త ఈమోస్ వైల్డ్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ విడుదల చేసింది. ఈ కొత్త ఈమోస్ వైల్డ్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్ ఆస్ట్రేలియన్ మార్కెట్లో విక్రయించడానికి అనుమతి పొందింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ధర 2,999 ఆస్ట్రేలియన్ డాలర్లు, అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1.61 లక్షలు.

ఈమోస్ వైల్డ్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ; ధర & ఇతర వివరాలు

కొత్త వైల్డ్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ బ్రాండ్ యొక్క పర్సనల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైనప్ లో ఉంటుంది. ఈ బైక్ యొక్క గరిష్ట వేగం గంటకు 50 కి.మీ. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మీరు వేగంగా బైక్ నడపవచ్చు.

ఈమోస్ వైల్డ్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ; ధర & ఇతర వివరాలు

కొత్త ఈమోస్ వైల్డ్ ఎలక్ట్రిక్ బైక్ స్టాండర్డ్ క్రూయిజర్ బైక్ యొక్క అన్ని స్టైలింగ్ అంశాలను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఏప్ హ్యాంగర్ హ్యాండిల్ బార్, రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్, 18 అంగుళాల టైర్ విత్ లార్జ్ ఫ్రంట్ మరియు రియర్ ఫెండర్, సోలో సాడిల్ మరియు ఫార్వర్డ్-మౌంటెడ్ ఫుట్‌పెగ్‌లను కలిగి ఉంటుంది.

MOST READ:హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ టర్బో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

ఈమోస్ వైల్డ్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ; ధర & ఇతర వివరాలు

ఈమోస్ యొక్క సహ వ్యవస్థాపకుడు & సిఇఓ హ్యారీ ప్రోస్కెఫల్లాస్ మాట్లాడుతూ, ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఎక్కువమంది ప్రజలను ఆకర్శించగలదు. ఈ బైక్ మంచి పనితీరుని అందిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు అధికంగా డిమాండ్ ఉన్న తరుణంలో ఇవి కూడా ఎక్కువ వినియోగంలోకి రానున్నాయని అన్నారు.

ఈమోస్ వైల్డ్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ; ధర & ఇతర వివరాలు

ఈమోస్ వైల్డ్ క్రూయిజర్ బైక్ 1.5 కిలోవాట్, 2 కిలోవాట్ మరియు 3 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారు ఎంపికలతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ రిమూవబుల్ 12 AH, 20 AH లేదా 30 AH కి అనుకూలమైన 60 వోల్ట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో అందిస్తున్నారు.

MOST READ:ఇప్పుడే చూడండి.. రూ. 3.70 లక్షల స్కాట్ సైకిల్

ఈ ఎలక్ట్రిక్ మోటారు 95 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత, గరిష్టంగా 90 కి.మీ వరకు నడుస్తుంది. ఈ బ్యాటరీ 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఈ బైక్ బరువు 82 కిలోలు మరియు గరిష్టంగా 200 కిలోల లోడ్ మోసే సామర్థ్యం కలిగి ఉంటుంది.

ఈమోస్ వైల్డ్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ; ధర & ఇతర వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

ఈమోస్ వైల్డ్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది మార్కెట్లో చాలామందిని ఆకరిస్తుంది. ప్రస్తుతం ఈ మోటార్ సైకిల్ ఆస్ట్రేలియా మార్కెట్లలో అమ్మకానికి ఉంది. అయితే ఇది భారతదేశానికి వచ్చే అవకాశం లేదు.

MOST READ:బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 18 క్రూయిజర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

Most Read Articles

English summary
EMoS WYLD Electric Cruiser Motorcycle Unveiled. Read in Telugu.
Story first published: Monday, September 21, 2020, 15:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X