Just In
- 22 hrs ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- 1 day ago
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- 1 day ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 1 day ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
Don't Miss
- Finance
బంగారం నిరోధకం, ఈ వారం ప్రభావం చూపే అంశాలు ఇవే
- News
జగన్..ఎన్డీఏ వైపే?: హోదా ఇస్తే ఎందాకైనా: మోడీ అఖిల పక్షానికి ముందే ఆ నిర్ణయం: ఎంపీలతో
- Movies
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
- Lifestyle
సోమవారం దినఫలాలు : ఉద్యోగులు ఈరోజు పనిని సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతారు...!
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాయల్ ఎన్ఫీల్డ్ స్టాక్ యార్డ్‌లో అగ్నిప్రమాదం; భారీ ఆస్తి నష్టం!?
చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఐషర్ మోటార్స్‌కి చెందిన ప్రముఖ టూవీలర్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్కు సంబంధించిన జైపూర్ ట్రాన్సిట్ స్టాక్‌యార్డ్‌లో మంటలు చెలరేగి ఆస్తి నష్టం జరిగింది.

బుధవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో, జైపూర్‌లోని కుకాస్ వద్ద ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క ట్రాన్సిట్ స్టాక్ యార్డులో అగ్ని ప్రమాదం సంభవించినట్లు ఐషర్ మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదని, మోటార్‌సైకిళ్లు కూడా దగ్ధం కాలేదని కంపెనీ వివరించింది.

"ఈ ప్రమాదంలో సిబ్బందిని ఆ ప్రాంతం నుండి సురక్షితంగా తరలించారు మరియు ఇందుకు అవరసమైన అన్ని అత్యవసర ప్రోటోకాల్స్ అనుసరించబడ్డాయి. ఈ ప్రాంతంలో పనిచేసే సిబ్బందికి ఎటువంటి హాని జరగలేదు" అని ఐషర్ మోటార్స్ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది.
MOST READ:డోర్ స్టెప్ వెహికల్ సర్వీస్ ప్రారంభించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

స్టాక్ యార్డ్‌లో ఓ మూల స్వల్పంగా ప్రారంభమైన మంటలు ఆ తర్వాత మొత్తం వ్యాపించాయి. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన వేర్‌హౌస్ సిబ్బంది సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వటంతో అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు.

కాగా, అగ్ని ప్రమాదానికి సంబంధించిన సరైన కారణం ఇంకా తెలియరాలేదు. అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో భవనం చాలా వరకూ కాలిపోయి, ఆస్తి నష్టం వాటిళ్లినట్లుగా చెబుతున్నారు. కాగా, ఈ సంఘటన రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ యొక్క కార్యకలాపాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదని కంపెనీ తెలిపింది.
MOST READ:డ్యూయెల్ టోన్‌లో మహీంద్రా కెయువి100 ఎన్ఎక్స్టి విడుదల: ధర, ఫీచర్లు

ఇక రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ భారత మార్కెట్ ఓ సరికొత్త 350సిసి క్రూయిజర్ మోటార్‌సైకిల్ 'మీటియోర్'ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. కంపెనీ ఇప్పటికే ఈ మోడల్‌ను దేశీయ రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. ఈ బైక్‌ను పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్నారు. ఇది పాపులర్ థండర్బర్డ్ 350 స్థానాన్ని భర్తీ చేయనుంది.

అంతేకాకుండా, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఇకపై తమ మోటార్‌సైకిళ్లకు తామే స్వయంగా కస్టమైజేషన్ ఆప్షన్లను అందించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే, 'మేక్-ఇట్-యువర్స్' (ఎమ్ఐవై) పేరిట ఓ పర్సనలైజ్డ్ కస్టమైజేషన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది.
MOST READ:20 సంవత్సరాల తర్వాత కూడా కొత్తగా ఉన్న పాత కారు.. ఇది ఒక పొలిటికల్ లీడర్ ఇష్టమైన కార్ కూడా

రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్‌సైకిల్ కస్టమైజేషన్ లేదా పర్సనలైజేషన్‌కు సంబంధించి కంపెనీ ఓ కొత్త యాప్‌ను కూడా డెవలప్ చేసింది. ఇది 3డి కాన్ఫిగరేటర్ ద్వారా పనిచేస్తుంది. దీని సాయంతో కస్టమర్లు అందుబాటులో ఉన్న వేలాది కాంబినేషన్ల ద్వారా తమ అభిమాన రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్‌ను తమకు నచ్చిన ఉపకరణాలతో వర్చ్యువల్‌గా కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.