Just In
- 2 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 2 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 4 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 5 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- Finance
నిర్మల సీతారామన్ బడ్జెట్ పైన స్టార్టప్స్ అంచనాలు
- News
ఏకగ్రీవాలపై వివరణ కోరాం, ఆటంకం కలిగిస్తే కోర్టుకే, మంత్రి వ్యాఖ్యలు బాధించాయి: నిమ్మగడ్డ రమేష్ కుమార్
- Sports
3 బంతుల్లో 15 పరుగులు.. ధోనీ తరహాలో చివరి బంతికి సిక్స్ బాదిన సోలంకి! సెమీస్‌కు బరోడా!
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పిల్లలు మరియు ప్రీ-టీనేజర్ల కోసం ఫైర్‌ఫాక్స్ ప్రత్యేక షోరూమ్
భారతదేశపు ప్రముఖ సైకిల్ బ్రాండ్ మరియు హీరో గ్రూపుకి చెందిన ప్రీమియం సైకిళ్ల తయారీ సంస్థ ఫైర్‌ఫాక్స్, పిల్లలు మరియు ప్రీ-టీనేజర్ల కోసం ప్రత్యేకంగా దేశంలోనే తమ మొట్టమొదటి ఎక్స్‌పీరియెన్షల్ షోరూమ్ న్యూఢిల్లీలో ప్రారంభించినట్లు ప్రకటించింది.

ఉత్తర భారతదేశంలోనే ఈ తరహా స్టోర్ మొట్టమొదిటదని కంపెనీ పేర్కొంది. ఉత్తర భారతదేశపు అతిపెద్ద బొమ్మలు మరియు సైకిల్ మార్కెట్ అయిన జండేవాలాన్, న్యూ ఢిల్లీలో ఈ స్టోర్‌ను ప్రారంభించారు. ఈ షోరూమ్‌లో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం ప్రత్యేకమైన సైకిల్ కలెక్షన్ ఉంటుంది.

ఈ షోరూమ్‌లో ఫైర్‌ఫాక్స్ అందిస్తున్న ప్రీమియం రేంజ్ సైకిళ్ళు మరియు యాక్ససరీలను కంపెనీ అందుబాటులో ఉంచింది. ఈ స్టోర్‌ను కేవలం సైకిళ్ల కొనుగోళ్ల కోసం మాత్రమే కాకుండా, పిల్లలకు వినోదాన్ని అందించేలా కూడా డిజైన్ చేశారు.

ఈ దుకాణంలో పిల్లల కోసం బ్లాక్‌లు, రాక్ క్లైంబింగ్ జోన్, పిల్లల లాంజ్ మరియు పిల్లల కోసం అంకితమైన గ్రాఫిటీ వాల్ మొదలైనవి ఉన్నాయి. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. ఒకటి పిల్లల బైక్‌ల (3-9 సంవత్సరాలు) కోసం, మరొకటి జూనియర్ బైక్‌ల (9-12 సంవత్సరాలు) కోసం ఉంటాయి.

ఫైర్‌ఫాక్స్ అందిస్తున్న ఈ సైకిళ్లు 14" నుండి 24" సైజుల్లో లభిస్తాయి. మోడల్‌ను బట్టి వాటి ధరలు రూ. 5,500 నుండి రూ.17,500 వరకు ఉంటాయి.
MOST READ:నుజ్జు నుజ్జయిన 25 కోట్ల విలువైన పగని కార్.. ఎలాగో తెలుసా

భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారి విజృంభన తర్వాత, మార్కెట్లో సైకిళ్ల గిరాకీ బాగా పెరిగిందని, ప్రజలను ఆరోగ్యవంతంగా ఉంచడంలో సైక్లింగ్ మంచి వ్యాయామాన్ని అందిస్తుందని అంతేకాకుండా రద్దీగా ఉండే ప్రజా రవాణా వ్యవస్థ నుండి తప్పించుకునేందుకు కూడా ఇదొక చక్కటి మార్గమని కంపెనీ తెలిపింది.

ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ద్విచక్ర వాహనాలు అందుబాటులోకి రావటంతో, ఇటీవలి కాలంలో సైకిల్ పరిశ్రమ తీవ్ర మందగమనాన్ని చూసింది. అయితే, ఇప్పుడు దేశంలో పరిస్థితులు మారాయి, ప్రజలకు ఆరోగ్యం మరియు పర్యావరణ పట్ల అవగాహన పెరగడంతో సైకిల్ పరిశ్రమ తిరిగి జోరందుకుంది.
MOST READ:అద్భుతంగా ఉన్న గాజు ముక్కలతో డెకరేట్ చేసిన వోక్స్‌వ్యాగన్ కారు.. చూసారా..!

పిల్లల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు బైక్, స్కూటీలకు బదులుగా ఎలక్ట్రిక్ సైకిల్ లేదా సాధారణ సైకిల్ ఇవ్వడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫైర్‌ఫాక్స్ అమ్మకాలు పెరిగాయి. మే 2020 నుండి కంపెనీ ఆన్‌లైన్ అమ్మకాల్లో 10 ఎక్స్ పెరుగుదలను నమోదు చేసింది.

ఫైర్‌ఫాక్స్ బ్రాండ్‌కు ఆన్‌లైన్ స్టోర్స్‌తో పాటు, దేశవ్యాప్తంగా 500కి పైగా భౌతిక రిటైల్ స్టోర్లను కూడా కలిగి ఉంది. ప్రీమియం మరియు స్టాండర్డ్ సైకిల్ విభాగంలో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతున్న హీరో సైకిల్స్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉపాధిని అందిస్తుంది.
MOST READ:రూ. 1.26 కోట్ల రూపాలకు అమ్ముడైన 118 సంవత్సరాల పాత వెహికల్ నెంబర్.. ఎందుకో తెలుసా

భారతదేశంలో సైకిల్ మార్కెట్లో కంపెనీకి 43 శాతం వాటా ఉంది. హీరో సైకిల్స్ 2015 లో ఫైర్‌ఫాక్స్ సైకిల్స్ బ్రాండ్‌ను సొంతం చేసుకుంది. ఫైర్‌ఫాక్స్ సైకిళ్లు స్టాండర్డ్ సైకిళ్ల కన్నా భిన్నంగా ఉంటాయి. స్పోర్ట్స్, అడ్వెంచర్ సైకిళ్ల తయారీలో ఇది చాలా ప్రసిద్ధి చెందిన బ్రాండ్.

హీరో సైకిల్స్ సంవత్సరానికి 60 లక్షల సైకిళ్లను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. లుధియానా, భితా మరియు ఘజియాబాద్‌లలో హీరో సైకిల్స్‌కి ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఈ సంస్థ శ్రీలంకలో కూడా ఓ అత్యాధునిక ప్లాంట్‌ను ప్రారంభించింది. ఈ బ్రాండ్ కేవలం సైకిళ్లే కాకుండా, ఆటోమొబైల్ ఉపకరణాలను కూడా తయారు చేస్తుంది.