జెమోపాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై అమేజింగ్ ఫెస్టివల్ డిస్కౌంట్స్..

నోయిడాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ జెమోపాయ్ ఎలక్ట్రిక్ ఈ ఏడాది పండుగ సీజన్‌ను పురస్కరించుకొని తమ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మరియు ప్రయోజనాలను ప్రకటించింది. లిమిటెడ్ టైమ్ ఆఫర్‌గా ప్రవేశపెట్టిన ఈ ఆఫర్లు మిసో, ఆస్ట్రిడ్ లైట్ మరియు రైడర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు వర్తిస్తాయని కంపెనీ తెలిపింది.

జెమోపాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై అమేజింగ్ ఫెస్టివల్ డిస్కౌంట్స్..

కస్టమర్ ఎంచుకునే మోడల్‌ను బట్టి కంపెనీ రూ.2,000 నుంచి రూ.5,500 మేర తగ్గింపులను అందిస్తోంది. ఇందులో జెమోపాయ్ అందిస్తున్న పాపులర్ స్కూటర్ ఆస్ట్రిడ్ లైట్‌ను అదనపు యాక్ససరీలతో అందిస్తోంది. ఈ ఆఫర్లు నవంబర్ 20, 2020 వరకు చెల్లుబాటులో ఉంటాయని కంపెనీ వివరించింది.

జెమోపాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై అమేజింగ్ ఫెస్టివల్ డిస్కౌంట్స్..

జెమోపాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై నగదు తగ్గింపులతో పాటుగా ప్రతి కస్టమర్‌కు రూ.1000 డిస్కౌంట్ వోచర్‌ను కూడా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ వోచర్‌ను క్రెడిట్ఆర్ రీడీమ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. కస్టమర్లు తమ పాత పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలను క్రెడిట్ఆర్‌కు విక్రయించేటప్పుడు ఎక్సేంజ్ వ్యాల్యూపై అదనంగా రూ.1,000 పొందేందుకు ఈ వోచర్‌ను ఉపయోగించుకోవచ్చు.

MOST READ:కొత్తగా డ్రైవింగ్ చేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే

జెమోపాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై అమేజింగ్ ఫెస్టివల్ డిస్కౌంట్స్..

జెమోపాయ్ ప్రస్తుత పండుగ సీజన్‌లో తమ ఎలక్ట్రిక్ వాహనాలపై తగ్గింపులు, వివిధ ప్రోత్సాహకాలను అందించడం ద్వారా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించి, తద్వారా పర్యవరణానికి మేలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

జెమోపాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై అమేజింగ్ ఫెస్టివల్ డిస్కౌంట్స్..

ప్రస్తుతం జెమోపాయ్‌కి దేశవ్యాప్తంగా 60కి పైగా డీలర్‌షిప్ కేంద్రాలు మరియు కస్టమర్ టచ్‌పాయింట్‌లు ఉన్నాయి. అన్ని డీలర్‌షిప్‌లలో తప్పనిసరిగా సర్వీస్ సెంటర్స్ కూడా కలిగి ఉంటాయి. కస్టమర్లకు అన్ని సేవలను ఒకే రూఫ్ క్రింద అందించాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

MOST READ:మీరు ఎప్పుడూ చూడని మోడిఫైడ్ సూరజ్ 325 సిసి బైక్

జెమోపాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై అమేజింగ్ ఫెస్టివల్ డిస్కౌంట్స్..

దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడిన భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకొని, సంభావ్య ఈవి కొనుగోలుదారులకు సరసమైన ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించాలని జెమోపాయ్ లక్ష్యంగా పెట్టుకుంది. జెమోపాయ్ ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్సేంజ్ ద్వారా కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల కోసం కంపెనీ క్రెడిట్ఆర్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసినదే.

జెమోపాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై అమేజింగ్ ఫెస్టివల్ డిస్కౌంట్స్..

ఈ భాగస్వామ్యంలో భాగంగా, కస్టమర్లు తమ పాత పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలను క్రెడిట్ఆర్‌కు విక్రయిస్తే, కొత్త జెమోపాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి అయ్యే ఖర్చులో సదరు మొత్తాన్ని తీసివేయటం జరుగుతుంది. ప్రస్తుతం ఫెస్టివ్ ఆఫర్‌లో భాగంగా, క్రెడిట్ఆర్ కోట్ చేసిన మొత్తంపై రూ.1,000 అదనపు తగ్గింపు కూడా ఇవ్వబడుతుంది.

MOST READ:గుడ్ న్యూస్.. త్వరలో రోడ్డుపైకి రానున్న కొత్త హోండా హైనెస్ సిబి350 బైక్

జెమోపాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై అమేజింగ్ ఫెస్టివల్ డిస్కౌంట్స్..

జెమోపాయ్ ప్రస్తుతం మిసోతో ప్రారంభించి దేశంలో మొత్తం మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తుంది. జెమోపాయ్ మిసో ఒకే ఛార్జీపై సుమారు 70 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇకపోతే రైడర్ మరియు ఆస్ట్రిడ్ లైట్ అనే మోడళ్లు పూర్తి బ్యాటరీ ఛార్జ్‌పై 90 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్‌ని ఆఫర్ చేస్తాయి. అయితే, ఆస్ట్రిడ్ లైట్‌లో మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, సెంట్రల్ లాకింగ్, స్మార్ట్‌ఫోన్ కోసం యుఎస్‌బి ఛార్జింగ్ స్లాట్ వంటి ఫీచర్లతో లభిస్తుంది.

జెమోపాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై అమేజింగ్ ఫెస్టివల్ డిస్కౌంట్స్..

ఈ ఫెస్టివల్ ఆఫర్ల గురించి జెమోపాయ్ ఎలక్ట్రిక్ సహ వ్యవస్థాపకుడు అమిత్ రాజ్ సింగ్ మాట్లాడుతూ, "లాక్‌డౌన్ అనంతరం దేశంలో చాలా మంది కస్టమర్లు ప్రజ రవాణా కన్నా వ్యక్తిగత రవాణాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారికి సరమైన మరియు సురక్షితమైన రవాణా సాధనాన్ని అందించడమే లక్ష్యంగా మేము మా ఉత్పత్తులపై పండుగ ఆఫర్లను అందిస్తున్నాము. జెమోపాయ్ స్కూటర్‌ను సొంతం చేసుకోవడం ఇబ్బంది లేని మరియు ప్రతిష్టాత్మకమైన అనుభవాన్ని అందించడానికి ఈ ఆఫర్లు సహకరిస్తాయని" ఆయన చెప్పారు.

MOST READ:8 నెలల క్రితం పోయింది.. మళ్లీ ఇప్పుడు దొరికింది.. థ్యాంక్యూ పోలీస్..

జెమోపాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై అమేజింగ్ ఫెస్టివల్ డిస్కౌంట్స్..

జెమోపాయ్ ఫెస్టివల్ ఆఫర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

జెమోపాయ్ ప్రస్తుత పండుగ సీజన్‌లో భాగంగా తమ మొత్తం ప్రోడక్ట్ లైనప్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించగలమని కంపెనీ ధీమాగా ఉంది. దేశంలో మారుతున్న టూవీలర్ ట్రెండ్స్‌కు సహకరించేందుకు మరియు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను ప్రోత్సహించేందుకు ఇది తోడ్పడుతుంది.

Most Read Articles

English summary
Noida based Electric Scooters maker, Gemopai Electric, announced attractive discounts & benefits during the festive season this year. The limited-time offer is valid on its electric scooter range — Miso, Astrid Lite and Ryder. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X