కెటిఎమ్ డ్యూక్ 790 పై 2 లక్షల డిస్కౌంట్ ఆఫర్

ఇండియన్ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న మోటర్ సైకిల్స్ లో కెటిఎమ్ బైక్ ఒకటి. ఇప్పుడు కెటిఎమ్ తన బ్రాండ్ అయిన డ్యూక్ 790 బైకుపై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. !

కెటిఎమ్ డ్యూక్ 790 పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్

ఇప్పుడు కెటిఎమ్ డ్యూక్ 790 పై దాదాపు రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్ మిగిలిఉన్న బిఎస్-4 మోడల్ బైకులకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు అన్ని కంపెనీలు తమ వాహనాలను బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయాల్సి ఉంది. ఇంక కేవలం 20 రోజులకన్నా తక్కువ వ్యవధి ఉన్న కారణంగా ఈ ఆఫర్ ప్రకటించారు.

కెటిఎమ్ డ్యూక్ 790 పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్

కెటిఎమ్ డ్యూక్ 790 సెప్టెంబర్ 23 న రూ. 8.64 లక్షలకు లాంచ్ చేసింది. మొత్తం 100 యూనిట్లు భారతీయ తీరాలకు చేరాయి. ఈ మోటార్ సైకిళ్లకు ప్రారంభంలో మంచి స్పందన ఉంది. అంతే కాకుండా దిగుమతి చేసుకున్న 100 మోటార్ సైకిళ్లను కంపెనీ 10 రోజుల్లో 41 యూనిట్లను విక్రయించింది.

కెటిఎమ్ డ్యూక్ 790 పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్

ప్రస్తుతం భారత మార్కెట్లో కెటిఎమ్ డ్యూక్ 790 సుజుకి జిఎస్ఎక్స్-ఎస్ 750, డుకాటీ మాన్స్టర్ 797, ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్, యమహా ఎంటి -09 మరియు కవాసకి జెడ్ 900 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంది. ఇవన్నీ మంచి పోటీని ఇస్తున్నాయి. ఇంతటి కఠినమైన పోటీతో మరియు అధిక ధరలను కలిగి ఉండటం చేత ఈ కెటిఎమ్ డ్యూక్ 790 అనుకున్న రీతిలో అమ్ముడు కావు.

కెటిఎమ్ డ్యూక్ 790 పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్

బిఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయవలసిన సమయం మరింత సమీపిస్తున్న కారణం డీలర్లు ఇటువంటి భారీ ఆఫర్ ను ప్రకటించడంతో వినియోగదారులను ఎక్కువగా ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది.

కెటిఎమ్ డ్యూక్ 790 పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్

కెటిఎమ్ డ్యూక్ 790 బైక్ 799 సిసి లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 104 బిహెచ్‌పి మరియు 87 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది మరియు స్లిప్పర్ అసిస్ట్ క్లచ్‌తో ప్రామాణిక 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌కు జత చేయబడింది. కెటిఎమ్ డ్యూక్ 790 బరువు 169 కేజీల వరకు ఉంటుంది. ఇది బాగా తేలికైన మోటార్ సైకిల్స్ లో ఒకటి.

కెటిఎమ్ డ్యూక్ 790 పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్

కెటిఎమ్ డ్యూక్ 790 బైకులో 43 మిమీ అప్ సైడ్ డౌన్ ఫోర్కులు ఉంటాయి. అంతే కాకుండా వెనుక భాగంలో పూర్తిగా అడ్జస్టబుల్ మోనో-షాక్ నిర్వహిస్తారు. 790 డ్యూక్‌లోని ముందు భాగంలో డ్యూయల్ 300 ఎంఎం డిస్క్‌లు మరియు వెనుక భాగంలో ఒకే 240 ఎంఎం డిస్క్‌లు ఉన్నాయి.

కెటిఎమ్ డ్యూక్ 790 పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్

కెటిఎమ్ డ్యూక్ 790 మోటారుసైకిల్ నాలుగు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి రైన్, స్ట్రీట్, స్పోర్ట్స్ మరియు ట్రాక్. కెటిఎమ్ డ్యూక్ 790 లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎబిఎస్ (యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్), లీన్ యాంగిల్ సెన్సిటివిటీ, మోటారు స్లిప్ రెగ్యులేషన్, స్టెబిలిటీ కంట్రోల్ మరియు క్లచ్ లెస్ అప్‌షిఫ్ట్‌లు మరియు డౌన్‌షిఫ్ట్‌ వంటివి ఉంటాయి.

డ్యూక్ 790 లో పుల్లీ డిజిటల్ టిఎఫ్టి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. ఇది రైడర్‌కు మరింత సమాచారాన్ని అందిస్తుంది. 790 డ్యూక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీని ప్రారంభించడానికి మాడ్యూల్‌ను కలిగి ఉన్న ‘కెటిఎం పవర్‌పార్ట్‌లతో' మోటార్‌సైకిళ్లను అప్‌గ్రేడ్ చేసే అవకాశాన్ని కూడా కంపెనీ అందిస్తోంది. ఈ మాడ్యూల్ ద్వారా, రైడర్స్ తమ స్మార్ట్‌ఫోన్‌ను బైక్‌తో ఒక అప్లికేషన్ ద్వారా కనెక్ట్ చేయవచ్చు మరియు ట్రిప్ వివరాలు, టెలిమెట్రీ మొదలైన వాటితో సహా అనేక సమాచారాన్ని యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది.

కెటిఎమ్ డ్యూక్ 790 పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కెటిఎమ్ డ్యూక్ 790 అనేక ఫీచర్లు మరియు శక్తివంతమైన ఇంజిన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు కెటిఎమ్ డ్యూక్ 790 ఫై దాదాపు 2 లక్షల రూపాయల డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. ఇంతటి భారీ డిస్కౌంట్ ని ప్రకటించడం వల్ల చాల మంది వినియోగదారులను ఆకర్శించే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, March 12, 2020, 10:43 [IST]
English summary
KTM 790 Duke Discount Offer: Up To Rs 2 Lakh On Remaining BS4 Models. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+