హెల్మెట్ సేఫ్టీ రూల్స్ మారాయ్; ఇకపై ఫారిన్ హెల్మెట్స్ కూడా ధరించవచ్చు!

ద్విచక్ర వాహన హెల్మెట్ భద్రతా ప్రమాణాల కోసం కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 4వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్లు బ్యూరో పేర్కొంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఫారిన్ హెల్మెట్ల అమ్మకాలను కూడా సెప్టెంబర్ 2020 నుండి అనుమతించనున్నట్లు బ్యూరో తెలిపింది.

హెల్మెట్ సేఫ్టీ రూల్స్ మారాయ్; ఇకపై ఫారిన్ హెల్మెట్స్ కూడా ధరించవచ్చు!

మోటార్‌సైక్లిస్టులు శిరస్సుపై ధరించే హెల్మెట్లు 1.2 కిలోల బరువు పరిమితిని మించకుండా ఉండాలని 2018లో జారీ చేసిన కరెన్సీ నిబంధనలను ఎత్తివేస్తామని బ్యూరో తెలిపింది. ఫలితంగా, మన దేశంలో విదేశీ బ్రాండ్ల హెల్మెట్లను విక్రయించేందుకు మార్గం సుగమం కానుంది.

హెల్మెట్ సేఫ్టీ రూల్స్ మారాయ్; ఇకపై ఫారిన్ హెల్మెట్స్ కూడా ధరించవచ్చు!

గత 2018లో అమలు చేసిన నిబంధనల ప్రకారం, ఐఎస్ఐ ప్రమాణాల గుర్తింపు లేని మరియు 1.2 కిలోల కంటే ఎక్కువ బరువు కలిగి ఉన్న హెల్మెట్ల విక్రయాలపై నిషేధం విధించారు. అయితే, సెప్టెంబర్ 4వ తేదీ నుండి, హెల్మెట్ బరువుతో సంబంధం లేకుండా, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న హెల్మెట్లు ఐఎస్ఐ నిబంధనలకు లోబడి ఉన్నంత వరకు దేశీయ విపణిలో విక్రయించేందుకు బ్యూరో అనుమతి ఇవ్వనుంది.

MOST READ:హెల్మెట్ సేఫ్టీ రూల్స్ మారాయ్; ఇకపై ఫారిన్ హెల్మెట్స్ కూడా ధరించవచ్చు!

హెల్మెట్ సేఫ్టీ రూల్స్ మారాయ్; ఇకపై ఫారిన్ హెల్మెట్స్ కూడా ధరించవచ్చు!

తక్కువ నాణ్యత కలిగిన మరియు పరిమిత భద్రతను మాత్రమే ఆఫర్ చేసే హెల్మెట్ల అమ్మకాలను నియంత్రించే లక్ష్యంతో రవాణా మంత్రిత్వ శాఖ పరీక్ష నిబంధనలను మార్చిన తరువాత హెల్మెట్ల విక్రయాలపై ఆంక్షలు అమలు చేయబడ్డాయి. ఈ నిర్ణయం వలన దిగుమతి చేసుకున్న హెల్మెట్ల తయారీదారులు మరియు రిటైలర్లు తమ ఉత్పత్తులను విక్రయించుకోవటం కష్టతరంగా మారింది.

హెల్మెట్ సేఫ్టీ రూల్స్ మారాయ్; ఇకపై ఫారిన్ హెల్మెట్స్ కూడా ధరించవచ్చు!

అధిక నాణ్యతతో కూడిన మెరుగైన మరియు సురక్షితమైన హెల్మెట్ల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ప్రభుత్వం వివిధ తయారీదారుల ప్రతినిధులతో సమావేశమై, వాటిని దేశంలో ఎందుకు విక్రయించడానికి అనుమతించాలనే అంశంపై చర్చించింది.

MOST READ:80 మీటర్లు దొర్లుకుంటూ వెళ్లినప్పటికీ బయటపడిన టాటా టియాగోలోని ప్రయాణికులు, ఎలానో మీరే చూడండి

హెల్మెట్ సేఫ్టీ రూల్స్ మారాయ్; ఇకపై ఫారిన్ హెల్మెట్స్ కూడా ధరించవచ్చు!

ఈ విషయంపై రవాణా మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, "తయారీదారులందరూ బిఐఎస్ నిబంధనలు పాటించేందుకు వీలుగా తుది నోటిఫికేషన్ తేదీ నుండి క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (క్యూసిఓ) కోసం ఆరు నెలల సమయం ఇస్తాము. ఈ గడువు తర్వాత, ఐఎస్ఐ మార్క్ లేని హెల్మెట్లను విక్రయించడం చట్టరీత్యా నేరం అవుతుంది" అని చెప్పారు.

హెల్మెట్ సేఫ్టీ రూల్స్ మారాయ్; ఇకపై ఫారిన్ హెల్మెట్స్ కూడా ధరించవచ్చు!

ఇదే విషయంపై స్టీల్‌బర్డ్ హైటెక్ మేనేజింగ్ డైరెక్టర్, మరియు ద్విచక్ర వాహన హెల్మెట్ తయారీదారుల సంఘం అధ్యక్షుడు రాజీవ్ కపూర్ మాట్లాడుతూ, "బేస్ (బరువు) క్యాప్‌ని తొలగించడం వలన, అది డాట్ స్టాండర్డ్, యూరోపియన్ హెల్మెట్లు మరియు ఇతర దిగుమతి చేసుకున్న హెల్మెట్లు కూడా ఐఎస్ఐ ప్రమాణానికి అర్హత పొందగలవు. కాబట్టి, వీటిని దిగుమతి చేసుకొని విక్రయించేందుకు భారత ప్రభుత్వం అనుమతించవచ్చు" అని అన్నారు.

MOST READ:పోలీసులు స్వాధీనం చేసుకున్న 4 కోట్ల విలువైన లంబోర్ఘిని సూపర్ కార్, కారణం ఏంటో తెలుసా ?

హెల్మెట్ సేఫ్టీ రూల్స్ మారాయ్; ఇకపై ఫారిన్ హెల్మెట్స్ కూడా ధరించవచ్చు!

"భారతదేశంలో యూరోపియన్ స్టాండర్డ్ హెల్మెట్లను ఉత్పత్తి చేసే తయారీదారులు ఐఎస్ఐ మార్కుతో ద్వంద్వ ధృవీకరణను కలిగి ఉంటారు, అలాగే భారతదేశంలో అమ్మకానికి హెల్మెట్లపై సిఈ లేదా మార్క్‌ను కూడా కలిగి ఉంటార"ని కపూర్ చెప్పారు.

హెల్మెట్ సేఫ్టీ రూల్స్ మారాయ్; ఇకపై ఫారిన్ హెల్మెట్స్ కూడా ధరించవచ్చు!

హెల్మెట్ స్టాండర్డ్స్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, ఈ నిర్ణయం తయారీదారులకు మరియు వినియోగదారులకు శుభవార్త అని హెల్మెట్ తయారీదారుల సంఘం వ్యాఖ్యానించింది.

MOST READ:బైక్ కింద నుంచి 20 బాటిల్స్ మద్యం స్వాధీనం, వీడియో చూస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు

హెల్మెట్ సేఫ్టీ రూల్స్ మారాయ్; ఇకపై ఫారిన్ హెల్మెట్స్ కూడా ధరించవచ్చు!

కోవిడ్ -19 పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ప్రజలు వ్యక్తిగత రవాణా వైపు అడుగులు వేస్తున్నందున రాబోయే కొన్నేళ్లలో హెల్మెట్ మార్కెట్ పెరుగుతుందని ఈ అసోసియేషన్ అభిప్రాయపడింది.

హెల్మెట్ సేఫ్టీ రూల్స్ మారాయ్; ఇకపై ఫారిన్ హెల్మెట్స్ కూడా ధరించవచ్చు!

మన దేశంలో దిగుమతి చేసుకొని విక్రయించే హెల్మెట్ల ధర సుమారు లక్ష రూపాయల వరకూ ఉంటోంది. అయితే, ప్రస్తుతం భారతదేశంలో ప్రీమియం మోటార్ సైకిళ్లకు డిమాండ్ పెరిగుతున్నందన, కొత్త హెల్మెట్ నిబంధనల కారణంగా దేశంలో ప్రీమియం హెల్మెట్‌ల దిగుమతి కూడా పెరిగే అవకాశం ఉంది.

హెల్మెట్ సేఫ్టీ రూల్స్ మారాయ్; ఇకపై ఫారిన్ హెల్మెట్స్ కూడా ధరించవచ్చు!

హెల్మెట్స్‌కి సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, యూరప్‌లో హెల్మెట్ల కోసం భద్రతా ప్రమాణాలను నిర్ణయించిన ఐక్యరాజ్యసమితి సంస్థ, ఇసిఇ 22.05 పరీక్షలను అప్‌డేట్ చేసినట్లు ప్రకటించింది. ఇసిఇ 22.06 అని పిలువబడే ఈ కొత్త ప్రమాణాలు 2023 నుండి అమలులోకి రానున్నాయి.

హెల్మెట్ సేఫ్టీ రూల్స్ మారాయ్; ఇకపై ఫారిన్ హెల్మెట్స్ కూడా ధరించవచ్చు!

హెల్మెట్ సేఫ్టీ రూల్స్ మార్పులపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మోటార్‌సైక్లింగ్ భద్రతకు సంబంధించినంతవరకు ప్రభుత్వం చివరకు ఓ మంచి నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. గత 2018లో అమలు చేసిన ఆంక్షలపై పరిశ్రమ నుంచి చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ కొత్త నిర్ణయంతో దేశంలో మరిన్ని ఫారిన్ హెల్మెట్లు అందుబాటులోకి రానున్నాయి. మరి ఇది దేశీయ హెల్మెట్ పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపనుందో చూడాలి.

Most Read Articles

English summary
The Bureau of Indian Standards (BIS) has announced that it will be issuing a new notification for two-wheeler helmet standards starting 4 September this year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X