హీరో మోటోకార్ప్‌తో దోస్తీ కట్టిన హ్యార్లీ డేవిడ్‌సన్.. చవక హ్యార్లీ బైక్‌లు నిజమయ్యేనా?

భారత ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ మరియు అమెరికన్ టూవీలర్ మేజర్ హ్యార్లీ డేవిడ్‌సన్ కంపెనీలు చేతులు కలిపాయి. భారత మార్కెట్‌లో తమ వ్యూహాత్మక భవిష్యత్ ప్రణాళికల కోసం హీరో మోటోకార్ప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు హ్యార్లీ డేవిడ్‌సన్ ప్రకటించింది.

హీరో మోటోకార్ప్‌తో దోస్తీ కట్టిన హ్యార్లీ డేవిడ్‌సన్.. చవక హ్యార్లీ బైక్‌లు నిజమయ్యేనా?

ఇరు కంపెనీల మధ్య కుదిరిన ఈ భాగస్వామ్యాన్ని 'ది రివైర్' అని పిలువనున్నారు. హ్యార్లీ డేవిడ్‌సన్ యొక్క కొత్త సమగ్ర వ్యాపార వ్యూహంలో భాగంగా ఈ కొత్త భాగస్వామ్యం పుట్టుకొచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం, హీరో మోటోకార్ప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లను విక్రయించడమే కాకుండా సర్వీస్ కూడా చేయగలదు.

హీరో మోటోకార్ప్‌తో దోస్తీ కట్టిన హ్యార్లీ డేవిడ్‌సన్.. చవక హ్యార్లీ బైక్‌లు నిజమయ్యేనా?

పంపిణీ ఒప్పందం ప్రకారం, హ్యార్లీ డేవిడ్‌సన్ పార్ట్స్, యాక్సెసరీస్, రైడింగ్ గేర్ మరియు దుస్తులు వంటి అధికారిక మర్చండైజ్ ఇప్పుడు బ్రాండ్-ఎక్స్‌క్లూజివ్ హెచ్-డి డీలర్లు మరియు భారతదేశం అంతటా ఉన్న హీరో యొక్క ప్రస్తుత డీలర్‌షిప్ నెట్‌వర్క్ రెండింటి ద్వారా కూడా అందుబాటులో ఉంటాయని హ్యార్లీ డేవిడ్‌సన్ తెలిపింది.

MOST READ:బస్ డ్రైవర్ నైపుణ్యం వల్ల ప్రాణాలతో బయట పడ్డ బైక్ రైడర్ [వీడియో]

హీరో మోటోకార్ప్‌తో దోస్తీ కట్టిన హ్యార్లీ డేవిడ్‌సన్.. చవక హ్యార్లీ బైక్‌లు నిజమయ్యేనా?

లైసెన్సింగ్ ఒప్పందం ప్రకారం, హీరో మోటోకార్ప్ ఇప్పుడు భారతదేశంలో ఐకానిక్ ‘హ్యార్లీ డేవిడ్‌సన్' బ్రాండ్ పేరుతో అనేక రకాల ప్రీమియం మోటార్‌సైకిళ్లను అభివృద్ధి చేసి విక్రయించే అవకాశం ఉంటుంది. ఇరు తయారీదారుల మధ్య కుదిరిన ఒప్పందం అటు హీరో మోటోకార్ప్‌కు ఇటు హ్యార్లీ డేవిడ్‌సన్‌కు ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.

హీరో మోటోకార్ప్‌తో దోస్తీ కట్టిన హ్యార్లీ డేవిడ్‌సన్.. చవక హ్యార్లీ బైక్‌లు నిజమయ్యేనా?

ఈ భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న విస్తృతమైన హీరో మోటోకార్ప్ నెట్‌వర్క్ సాయంతో హ్యార్లీ డేవిడ్‌సన్ తమ మోటార్‌సైకిళ్లను వినియోగదారులకు మరింత చేరువ చేయనుంది. ఇంతకు ముందు చెప్పినట్లుగానే, ఐకానిక్ అమెరికన్ బ్రాండ్ హ్యార్లీ డేవిడ్‌సన్ మరియు ప్రపంచంలోనే అతిపెద్ద టూవీలర్ బ్రాండ్ హీరో మోటోకార్ప్‌ల మధ్య భాగస్వామ్యం హ్యార్లీ డేవిడ్‌సన్ యొక్క కొత్త వ్యాపార వ్యూహంలో భాగంగా ఉంటుంది.

MOST READ:ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కొత్త ట్రాఫిక్ సిగ్నెల్ సిస్టం ఏర్పాటు.. ఎక్కడో తెలుసా?

హీరో మోటోకార్ప్‌తో దోస్తీ కట్టిన హ్యార్లీ డేవిడ్‌సన్.. చవక హ్యార్లీ బైక్‌లు నిజమయ్యేనా?

దేశంలోని ప్రస్తు పరిస్థితులు మరియు 2020లోని లాక్‌డౌన్ నాటి పరిస్థితులు హ్యార్లీ డేవిడ్‌సన్ అమ్మకాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. గత కొంత కాలంగా కంపెనీ భారత మార్కెట్లో నిలదొక్కుకునేందుకు కష్టపడుతోంది.

హీరో మోటోకార్ప్‌తో దోస్తీ కట్టిన హ్యార్లీ డేవిడ్‌సన్.. చవక హ్యార్లీ బైక్‌లు నిజమయ్యేనా?

భారతదేశంలోని బావాల్‌లో హ్యార్లీ డేవిడ్‌సన్ తమ తయారీ ప్లాంట్‌ను మూసివేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. గురుగ్రామ్‌లోని తన అమ్మకపు కార్యాలయంలో కూడా కార్యకలాపాలను గణనీయంగా తగ్గించి, ఉద్యోగులను కూడా తొలగించినట్లు సమాచారం.

MOST READ:సైకిల్ రిపేర్ షాప్ ఓనర్ తయారుచేసిన ఎలక్ట్రిక్ బైక్.. ఎలా ఉందో చూసారా ?

హీరో మోటోకార్ప్‌తో దోస్తీ కట్టిన హ్యార్లీ డేవిడ్‌సన్.. చవక హ్యార్లీ బైక్‌లు నిజమయ్యేనా?

హీరో మోటోకార్ప్ భాగస్వామ్యం ద్వారా హ్యార్లీ డేవిడ్‌సన్ భారతదేశంలో ప్రస్తుత కస్టమర్లకు సర్వీస్, స్పేర్స్, యాక్ససరీస్ మరియు అన్ని ఇతర అంశాలలో మద్దతును కొనసాగిస్తుందని అమెరికన్ బ్రాండ్ నిర్ధారించింది.

హీరో మోటోకార్ప్‌తో దోస్తీ కట్టిన హ్యార్లీ డేవిడ్‌సన్.. చవక హ్యార్లీ బైక్‌లు నిజమయ్యేనా?

భారతదేశంలో హ్యార్లీ డేవిడ్‌సన్ బ్రాండ్‌కు భారీ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, దేశంలో విజృంభించిన కోవిడ్-19 మహమ్మారి మరియు తదుపరి లాక్‌డౌన్ తర్వాత ఏర్పడిన పరిస్థితులు కంపెనీ అమ్మకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఈ ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ నుండి ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్ స్ట్రీట్ 750 ధర సుమారు రూ.5 లక్షల ఎక్స్-షోరూమ్ (ఇండియా) రేంజ్‌లో ఉంది.

MOST READ:గోల్డ్ కలర్ రోల్స్ రాయిస్ కారులో ప్రయాణించాలనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

హీరో మోటోకార్ప్‌తో దోస్తీ కట్టిన హ్యార్లీ డేవిడ్‌సన్.. చవక హ్యార్లీ బైక్‌లు నిజమయ్యేనా?

హ్యార్లీ డేవిడ్‌సన్ - హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

అంతా ఊహించినట్లుగానే హ్యార్లీ డేవిడ్‌సన్, హీరో మోటోకార్ప్ కంపెనీలు ఒక్కటిగా కలిశాయి. భారత మార్కెట్లో ఈ రెండు బ్రాండ్లు ఇకపై ఎలా పనిచేస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో, ఇరు కంపెనీల భాగస్వామ్యం ఫలితంగా సరికొత్త వాహనాలు పుట్టుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
Harley-Davidson today announced that the American brand has partnered with Hero MotoCorp for the Indian market. The new partnership comes as part of Harley-Davidson's new business overhaul strategy, called 'The Rewire'. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X