గుడ్ న్యూస్.. బిఎస్ 6 ఐరన్ 883 బైక్ ధర ప్రకటించిన హార్లే డేవిడ్సన్

అమెరికన్ మోటారుసైకిల్ తయారీదారు అయిన హార్లే డేవిడ్సన్ తన బ్రాండ్ ఐరన్ 883 బిఎస్ 6 మోడళ్ల ధరలను ప్రకటించింది. ఈ మోటార్ సైకిల్ ధర దాదాపుగా రూ. 9.74 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి ప్రారంభమవుతుంది.

గుడ్ న్యూస్.. బిఎస్ 6 ఐరన్ 883 బైక్ ధర ప్రకటించిన హార్లే డేవిడ్సన్

హార్లే డేవిడ్సన్ ఐరన్ 883 మోడల్ మోటార్ సైకిల్స్ 883 సిసి ఎయిర్-కూల్డ్ ఎవల్యూషన్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 50 బ్రేక్ హార్స్‌పవర్ మరియు 70 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఇది ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

గుడ్ న్యూస్.. బిఎస్ 6 ఐరన్ 883 బైక్ ధర ప్రకటించిన హార్లే డేవిడ్సన్

కొత్త ఐరన్ 883 లో హార్లే బైక్ లో కొత్త మార్పులు చేయలేదు మరియు మోటారుసైకిల్ అదే హ్యాండిల్ బార్ మౌంటెడ్ ఎలక్ట్రానిక్ స్పీడోమీటర్‌ను కలిగి ఉంది.

గుడ్ న్యూస్.. బిఎస్ 6 ఐరన్ 883 బైక్ ధర ప్రకటించిన హార్లే డేవిడ్సన్

స్పీడోమీటర్‌లోని ప్రదర్శన ఓడోమీటర్, డైలీ క్లాక్, డ్యూయల్ ట్రిప్ మీటర్లు, లో ఆయిల్ ఫ్యూయెల్ ఇండికేటర్, లో ఆయిల్ ప్రెసర్ ఇండికేటర్ మరియు ఇంజిన్ డయాగ్నస్టిక్స్ రీడౌట్‌ వంటివి ఇందులో ఉంటాయి. హార్లే ఐరన్ 883 బ్లాక్ ట్రీట్‌మెంట్‌తో వస్తుంది. మోటారుసైకిల్ తక్కువ పరిమాణం గల సీటును కలిగి ఉంది.

గుడ్ న్యూస్.. బిఎస్ 6 ఐరన్ 883 బైక్ ధర ప్రకటించిన హార్లే డేవిడ్సన్

హార్లే డేవిడ్సన్ ఐరన్ 883 బైక్ సింగిల్ రైడర్ సీటును కలిగి ఉంటుంది. ఈ సీటు యొక్క టక్ అండ్ రోల్ డిజైన్ బాబర్ బైక్ ని తలపిస్తుంది. ఈ బిఎస్ 6 మోటారుసైకిల్‌లో 9 స్పోక్ మెషిన్డ్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.

గుడ్ న్యూస్.. బిఎస్ 6 ఐరన్ 883 బైక్ ధర ప్రకటించిన హార్లే డేవిడ్సన్

2020 ఐరన్ 883 బిఎస్ 6 మోడల్స్ నాలుగు రంగు ఎంపికలలో లభిస్తాయి. అవి బ్లాక్ డెనిమ్, బార్రాకుడా సిల్వర్ డెనిమ్, రివర్ రాక్ గ్రే, మరియు సిల్వర్ ఫ్లక్స్ తో స్కార్చ్డ్ ఆరెంజ్ కలర్స్.

గుడ్ న్యూస్.. బిఎస్ 6 ఐరన్ 883 బైక్ ధర ప్రకటించిన హార్లే డేవిడ్సన్

హార్లే-డేవిడ్సన్ సంబంధిత వార్తల ప్రకారం హార్లే-డేవిడ్సన్ తన స్ట్రీట్ 750, మరియు స్ట్రీట్ రాడ్ మోడళ్లను ఆర్మీ క్యాంటీన్ స్టోర్స్ విభాగం ద్వారా రిటైల్ చేయడం ప్రారంభించింది. ఇది సాయుధ దళాల సిబ్బందికి, మాజీ సైనికులకు ప్రత్యేకంగా లభిస్తుంది. అంతే కాకుండా మోటారు సైకిళ్ళు సైనిక సిబ్బందికి మాత్రమే వర్తించే కొన్ని డిస్కౌంట్లను కలిగి ఉంటాయి.

గుడ్ న్యూస్.. బిఎస్ 6 ఐరన్ 883 బైక్ ధర ప్రకటించిన హార్లే డేవిడ్సన్

సిఎస్డీ లేదా క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ రక్షణ మంత్రిత్వ శాఖ క్రింద భారత ప్రభుత్వానికి చెందినది. అన్ని సైనిక స్థావరాలు కలిగిన గారిసన్ నగరాల్లో మరియు పరిమిత ఫార్వర్డ్-ఆపరేటింగ్ స్థావరాల వద్ద డిపోలను కలిగి ఉంది.

గుడ్ న్యూస్.. బిఎస్ 6 ఐరన్ 883 బైక్ ధర ప్రకటించిన హార్లే డేవిడ్సన్

సిఎస్డీలో గృహోపకరణాలు, ఉపకరణాలు, క్రీడా పరికరాలు మరియు వాహనాలతో సహా పలు రకాల ఉత్పత్తులను విక్రయిస్తాయి. క్యాంటీన్ స్టోర్స్ విభాగం ద్వారా విక్రయించే వస్తువులను పన్నుల నుండి మినహాయించారు అందువల్ల తక్కువ రేట్లను కలిగి ఉంటుంది.

గుడ్ న్యూస్.. బిఎస్ 6 ఐరన్ 883 బైక్ ధర ప్రకటించిన హార్లే డేవిడ్సన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం.. !

హార్లే డేవిడ్సన్ 2020 ఐరన్ 883 బిఎస్ 6 మోడల్ ధరలను ప్రకటించింది. ఇది బిఎస్ 4 మోడల్ కంటే కొంత ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాపించిన కరోనా వల్ల కొంత ఆలస్యంగా వచ్చింది. ఏది ఏమైనా బిఎస్ 6 హార్లే డేవిడ్సన్ అద్భుతమైన ఆకర్షణను కలిగి ఉంటుంది. ఇది మంచి రైడింగు నానుభూతిని కలిగి ఉంటుంది. హార్లే డేవిడ్సన్ నివేదికల ప్రకారం ఈ మోటార్ సైకిల్ బిగా పని చేస్తున్నాడని భావించవచ్చు.

Most Read Articles

English summary
Harley Davidson Iron 883 BS6 Model Price Announced: Rs 51,000 More Expensive Than BS4 Models. Read in Telugu.
Story first published: Wednesday, March 25, 2020, 19:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X