Just In
- 11 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 13 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 14 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 14 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హ్యార్లీ డేవిడ్సన్ ఐరన్ 883 ధర పెంపు, వివరాలు
అమెరికన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ 'హ్యార్లీ డేవిడ్సన్' దేశీయ విపణిలో విక్రయిస్తున్న 'ఐరన్ 883' మోటార్‌సైకిల్ ధరలు పెరిగాయి. మార్చ్ 2020లోనే హ్యార్లీ డేవిడ్సన్ తమ ఐరన్ 883 బైక్‌లో కొత్తగా బిఎస్6 వెర్షన్‌ను విడుదల చేసింది, అప్పట్లో ఈ మోడల్ ధర రూ.9.26 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండేది.

కాగా.. ప్రస్తుతం ఈ మోడల్ ధరలు రూ.12,000 మేర పెరిగాయి. తాజా ధర పెంపుతో కొత్త హ్యార్లీ డేవిడ్సన్ ఐరన్ 883 బిఎస్6 మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ.9.38 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఆన్లైన్ ద్వారా కూడా కస్టమర్లు ఈ బైక్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇది నాలుగు రకాల పెయింట్ స్కీమ్స్ (బ్లాక్ డెనిమ్, బర్రాక్యుడా సిల్వర్ డెనిమ్, రివర్ రాక్ గ్రే, స్కార్చ్డ్ ఆరెంజ్/సిల్వర్ ఫాక్స్)లో లభిస్తుంది.

హ్యార్లీ డేవిడ్సన్ ఐరన్ 883 మోటార్‌సైకిల్‌లో కంపెనీ నుంచి అత్యంత పాపులర్ అయిన ఎయిర్-కూల్డ్ 'ఎవల్యూషన్' ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ 883సీసీ ఇంజన్ ఈఎస్పిఎఫ్ఐ (ఎలక్ట్రానిక్ సీక్వెన్షియల్ పోర్ట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. బిఎస్4 వెర్షన్ ఇంజన్‌తో పోల్చుకుంటే 2 ఎన్ఎమ్ల తక్కువ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది (బిఎస్6 ఇంజన్ 4,750 ఆర్‌పిఎమ్ వద్ద 68 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. బిఎస్4 ఇంజన్ 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 70 ఎన్ఎమ్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది). ఈ ఇంజన్ 5-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో వస్తుంది.
MOST READ: కొత్త 2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త బిఎస్6 వెర్షన్ హ్యార్లీ డేవిడ్సన్ ఐరన్ 883లో బైక్‌లో ఇంజన్ అప్‌గ్రేడ్స్ మినహా వేరే ఇతర మార్పులు లేవు. ఐరన్ 883 మోటార్‌సైకిల్ 2,185 ఎమ్.ఎమ్ పొడవును, 1,515 ఎమ్.ఎమ్ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. దీని సైట్ హైట్ 760 ఎమ్.ఎమ్ మరియు దీని గ్రౌండ్ హైట్ 140 ఎమ్.ఎమ్. ఈ రోడ్‌స్టర్ బైక్ మొత్తం 247 కిలోల బరువును కలిగి ఉంటుంది.

వెర్షన్ హ్యార్లీ డేవిడ్సన్ ఐరన్ 883 బేర్-బోన్ డిజైన్‌తో ఓ మంచి రోడ్‌స్టర్ లుక్‌ని కలిగి ఉంటుంది. ఇందులో గుండ్రటి హెడ్‌ల్యాంప్స్, సింగిల్-పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్ ఇండికేటర్స్, వెడల్పాటి హ్యాండిల్ బార్, ఫార్వార్డ్ సీట్ ఫుట్‌పెగ్స్, బ్లాక్డ్ అవుట్ డ్యూయెల్ ఎగ్జాస్ట్, బాబర్ మోడల్ సీట్ నుంచి స్ఫూర్తి పొందిన టక్ అండ్ రోల్ డిజైన్ వంటి ఫీచర్లను గమనించవచ్చు. ఈ మోటార్‌సైకిల్ సింగిల్ సీట్‌తో వస్తుంది, కస్టమర్లు కావాలనుకుంటే పిలియన్ రైడర్ సీట్‌ను జోడించుకోవచ్చు.
MOST READ: మహీంద్రా సుప్రో అంబులెన్స్ : ధర & ఇతర వివరాలు

ఇందులోని ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇది రైడర్‌కు కావల్సిన సమాచారాన్ని తెలియజేస్తుంది. ఓడోమీటర్, డ్యూయెల్ ట్రిప్ మీటర్స్, సమయాన్ని తెలియజేసే టైమ్ క్లాక్, లో-ఫ్యూయెల్ ఇండికేటర్, లో-ఆయిల్ ప్రెజర్ ఇండికేటర్, ఇంజన్ డయాగ్నోస్టిక్ రీడవుట్ వంటి సమాచారాన్ని ఈ కన్సోల్ తెలియజేస్తుంది. ఈ బైక్‌లో 12.5 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది.

సస్పెన్షన్ విషయానికి వస్తే హ్యార్లీ డేవిడ్సన్ ఐరన్ 883లో ముందు వైపు టెలిస్కోపిక్ మరియు వెనుక వైపు ట్విన్-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. ఇరువైపులా డ్యూయెల్-పిస్టన్ కాలిపర్లతో కూడిన డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇందులో డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్ స్టాండర్డ్ ఫీచర్‌గా వస్తుంది. ఈ మోటార్‌సైకిల్‌లో ముందు వై 9-స్పోక్ 19-ఇంచ్ అల్లాయ్ వీల్ ఉంటుంది, దానికి 100/90 టైరు అమర్చబడి ఉంటుంది. వెనుక వైపు 16 ఇంచ్ అల్లాయ్ వీల్ ఉంటుంది, దానికి 150/80 టైర్ ఉంటుంది.
MOST READ: టాటా సుమో గురించి మీకు తెలియని కొన్ని నిజాలు !

ఇక హ్యార్లీ డేవిడ్సన్కి సంబంధించిన ఇతర వార్తల్లోకి వెళితే.. హ్యార్లీ డేవిడ్సన్ మాత్రం కొత్తగా ప్రవేశపెట్టిన స్ట్రీట్ రాడ్ బిఎస్6 మోటార్‌సైకిల్‌పై కంపెనీ ఏకంగా రూ.55,500 ల క్యాష్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. ట'మరిన్ని వివరాలకు ఈ లింకుపై క్లిక్ చేయండి..

హ్యార్లీ డేవిడ్సన్ ఐరన్ 883 ధర పెంపుపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
హ్యార్లీ డేవిడ్సన్ ఐరన్ 883 ధర పెంపుకు సంబంధించి కంపెనీ ఎలాంటి కారణాలను వెల్లడించకపోయినప్పటికీ, తాజాగా భారత్‌లో బిఎస్6 నిబంధనలు ప్రవేశపెట్టడటంతో అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ఇంజన్లను అప్‌గ్రేడ్ చేస్తున్నాయి. ఈ అప్‌గ్రేడ్ కోసం కంపెనీలు అధనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది, ఈ ఖర్చు వలన ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. హ్యార్లీ డేవిడ్సన్ ధరల పెంపుకు కూడా ఇదే కారణం కావచ్చని తెలుస్తోంది.