Just In
- 4 min ago
భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల
- 9 min ago
భారత్‌లో మూడు కొత్త బైకులను విడుదల చేసిన డుకాటీ; వివరాలు
- 1 hr ago
సూపర్‌బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- 3 hrs ago
ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి
Don't Miss
- News
అనంత కలెక్టర్‌ను కదిలించిన ఫేస్బుక్ పోస్ట్: 24 గంటల్లోనే బస్సు: స్టూడెంట్స్‌తో కలిసి ప్రయాణం
- Finance
బడ్జెట్ కంటే ముందు ఏ స్టాక్స్ కొంటే లాభాలు వస్తాయి..?
- Sports
టీమిండియా సాధించిన చరిత్రాత్మక విజయాన్ని స్ఫూర్తిగా పొందండి: మోదీ
- Movies
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారీగా తగ్గిన హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750 ధర - వివరాలు
అమెరికన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ హ్యార్లీ డేవిడ్సన్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిల్ స్ట్రీట్ 750 ధరను కంపెనీ భారీగా తగ్గించింది. ఈ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ధరను కంపెనీ ఇప్పుడు రూ.65,000 తగ్గించింది.

తాజా తగ్గింపు తర్వాత ఇప్పుడు హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750 అర్బన్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ధర ర .4.69 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ప్రస్తుతం హ్యార్లీ డేవిడ్సన్ మోటార్‌సైకిల్ ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి - వివిడ్ బ్లాక్, పెర్ఫార్మెన్స్ ఆరెంజ్, బ్లాక్ డెనిమ్, వివిడ్ బ్లాక్ డీలక్స్ మరియు బార్రాకుడా సిల్వర్ డీలక్స్.

వివిడ్ బ్లాక్ కాకుండా, మిగిలిన అన్ని కలర్ ఆప్షన్లకు కస్టమర్లు రూ.12,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీని ఫలితంగా, మిగిలిన నాలుగు కలర్ ఆప్షన్ మోడళ్ల ధర రూ.4.81 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంటుంది.
MOST READ:ప్రయాణికులు వణికిపోయేలా చేసే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాలు, ఇవే

హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750 బిఎస్6 కంప్లైంట్ మోటార్‌సైకిల్‌లో ఉపయోగించిన 749 సిసి, వి-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ 3,750 ఆర్‌పిఎమ్ వద్ద 60 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఈ మోటార్‌సైకిల్‌లో ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్స్, అప్-రైట్ హ్యాండిల్‌బార్, మంచి కుషన్ కలిగిన రైడర్ సీటు, టియర్-డ్రాప్ ఆకారంలో ఉండే ఇంధన ట్యాంక్ ఉంటుంది. ఇది సిటీ రైడ్‌కే కాకుండా సుదూర ప్రయాణాలకు కూడా అనువుణంగా ఉంటుంది.
MOST READ:భారతదేశపు ఆటో పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన 5 ఐకానిక్ కార్లు, ఇవే

ఈ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ట్విన్ షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి, ఇవి డ్యూయల్-ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.

హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750 అనేది అమెరికన్ మోటారుసైకిల్ తయారీదారు నుండి భారతదేశంలో ప్రవేశపెట్టబడిన ఎంట్రీ లెవల్ క్రూయిజర్ మోటారుసైకిల్. ఇది భారత మార్కెట్లో కవాసాకి వల్కాన్ ఎస్ మోడల్‌కు నేరుగా పోటీ ఇస్తుంది.
MOST READ:ఇది చూసారా.. ఆడి కార్ గుర్రపు బండిగా మారింది, ఎందుకో తెలుసా

హ్యార్లీ డేవిడ్సన్కు సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీకి ఆఫర్ చేస్తున్న ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిళ్లు స్ట్రీట్ 750 మరియు స్ట్రీట్ రాడ్లను దేశవ్యాప్తంగా ఉన్న సాయుధ దళాల సిబ్బంది కోసం కేటాయించిన క్యాంటీన్ స్టోర్ విభాగాల (సిఎస్డి) ద్వారా ప్రత్యేక ధరలకు విక్రయిస్తున్నారు.

హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750 ధర తగ్గింపుపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
ఇటీవలి కాలంలో, చాలా మంది తయారీదారులు వివిధ కారణాల వల్ల వారి వాహనాల ధరలను పెంచడం మనం గమనించాము. అయితే, హ్యార్లీ డేవిడ్సన్ మాత్రం అందరినీ ఆశ్చర్యాన్నికి గురి చేస్తూ, తమ ప్రీమియం మోటార్‌సైకిల్ ధరను తగ్గించడం విశేషం. హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750 రెగ్యులర్‌గా డ్రైవ్ చేయటానికి లేదా సరదాగా అప్పుడప్పుడూ వారాంతాల్లో కూడా సుదీర్ఘ ప్రయాణాల కోసం వినియోగించేందుకు అనువుగా ఉంటుంది.