హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ రాడ్ బిఎస్6 బైక్‌పై రూ.55,500ల భారీ డిస్కౌంట్

ప్రస్తుతం భారత్‌లో బిఎస్6 వాహనాల హవా నడుస్తోంది. ఓవైపు బిఎస్6 వాహనాలను ప్రవేశపెడుతూనే మరోవైపు వాటి ధరలను అధికంగా పెంచేస్తున్నారు. అయితే.. అమెరిన్ మోటాల్‌సైకిల్ బ్రాండ్ హ్యార్లీ డేవిడ్‌సన్ మాత్రం కొత్తగా ప్రవేశపెట్టిన స్ట్రీట్ రాడ్ బిఎస్6 మోటార్‌సైకిల్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ మోడల్‌పై కంపెనీ ఏకంగా రూ.55,500 ల క్యాష్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ రాడ్ బిఎస్6 బైక్‌పై రూ.55,500ల భారీ డిస్కౌంట్

ఈ క్రూజర్ స్టైల్ హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ రాడ్మోటార్‌సైకిల్‌ను రూ.6,55,500 ప్రారంభ ధరతో మార్కెట్లో విడుదల చేశారు. ఇప్పుడు ఈ మోడల్‌పై రూ.55,500 ల డిస్కౌంట్‌ను ఆఫర్ చేయడంతో ప్రస్తుతం దీని ధర ఆరు లక్షలకు దిగొచ్చింది. మార్కెట్లో కొత్త బిఎస్6 హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ రాడ్ ధర రూ.5,99,999 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ రాడ్ బిఎస్6 బైక్‌పై రూ.55,500ల భారీ డిస్కౌంట్

ఈ స్ట్రీట్ రాడ్ బిఎస్6 అర్బన్-క్రూజర్ మోటార్‌సైకిల్‌లో ఇదివరకటి బిఎస్4 ఇంజన్‌నే అప్‌గ్రేడ్ చేసి ఉపయోగించారు. ఈ 749 సీసీ వి-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 70 బిహెచ్‌పిల శక్తిని, 62 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఆరు గేర్లు ఉండే ట్రాన్సిమిషన్ సిస్టమ్ ఉంటుంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ రాడ్ బిఎస్6 బైక్‌పై రూ.55,500ల భారీ డిస్కౌంట్

వెడల్పాటి హ్యాండిల్ బార్, టియర్ డ్రాప్ షేపులో ఉండే ఫ్యూయెల్ ట్యాంక్, గుండ్రటి హెడ్‌ల్యాంప్స్ మరియు టర్న్ ఇండికేటర్స్, ఒవెల్ షేపులో ఉండే టెయిల్ ల్యాంప్, పొడవాటి బ్లాక్డ్-అవుట్ ఎగ్జాస్ట్ (సైలెన్సర్), రైడర్‌కు మరింత సౌకర్యాన్ని అందించేలా డిజైన్ చేసిన ఫ్రంట్ ఫుట్ పెగ్స్, కంఫర్టబల్ రైడర్ అండ్ పిలియన్ రైడర్ సీట్స్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి.

హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ రాడ్ బిఎస్6 బైక్‌పై రూ.55,500ల భారీ డిస్కౌంట్

బైక్ ముందు వైపు తలకిందులుగా ఉండే యూఎస్‌డి (అప్ సైడ్ డౌన్) ఫ్రంట్ సస్పెన్షన్ ఇందులో మరో ప్రత్యేకత. వెనుక వైపు గ్యాస్ చార్జ్డ్ సస్పెన్షన్లను ఉపయోగించారు. ముందు మరియు వెనుక రెండు వైపులా డిస్క్ బ్రేక్స్ అమర్చారు. ఈ డిస్క్ బ్రేక్స్ డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)ను కలిగి ఉంటాయి.

హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ రాడ్ బిఎస్6 బైక్‌పై రూ.55,500ల భారీ డిస్కౌంట్

ఈ కొత్త 2020 హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ రాడ్ మోటార్‌సైకిల్ మొత్తం నాలుగు రంగుల్లో (వివిడ్ బ్లాక్, రివర్ రాక్ గ్రే డెనిమ్, స్టోన్ వాష్డ్ వైట్ పెరల్, పెర్ఫార్మెన్స్ ఆరెంజ్) లభిస్తుంది. వివిడ్ బ్లాక్ మినహా ఇతర మూడు కలర్ ఆప్షన్స్ కావాలనుకునే కస్టమర్లు అధికంగా రూ.68,500 చెల్లించాల్సి ఉంటుంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ రాడ్ బిఎస్6 బైక్‌పై రూ.55,500ల భారీ డిస్కౌంట్

ఇక వేరే వార్తల్లోకి వెళితే... హ్యార్లీ డేవిడ్‌సన్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ మెకానిజం కోసం ఓ పేటెంట్‌ను ఫైల్ చేసింది. హ్యార్లీ డేవిడ్‌సన్ ఫైల్ చేసిన పేటెంట్ చిత్రాలను చూస్తుంటే, ఈ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ మెకానిజంలో గింబాల్‌లో మౌంట్ చేసిన ఓ హై-స్పీడ్ ఫ్లైవీల్ రెండు యాక్సెస్‌ను తిప్పడంలో సహకరిస్తుంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ రాడ్ బిఎస్6 బైక్‌పై రూ.55,500ల భారీ డిస్కౌంట్

ఒకవేళ ఈ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే ఇకపై వాహనాలకు స్టాండ్ వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. మోటార్‌సైకిల్ వేగం తక్కువగా ఉన్నప్పుడు లేదా చలనంలో లేనప్పుడు ఈ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ మెకానిజం పనిచేయటం మొదలు పెడుతుంది. ఈ టెక్నాలజీ వలన మోటార్‌సైకిల్ మరింత స్థిరత్వంతో ముందుకు సాగుతుంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ రాడ్ బిఎస్6 బైక్‌పై రూ.55,500ల భారీ డిస్కౌంట్

హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ రాడ్ బిఎస్6 డిస్కౌంట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

లాక్‌డౌన్ తర్వాత ఆటోమొబైల్ కంపెనీలన్నీ తమ ఉత్పత్తుల ధరలను పెంచుతుంటే, హ్యార్లీ డేవిడ్‌సన్ మాత్రం అనూహ్య రీతిలో తమ స్ట్రీట్ రాడ్ బైక్‌పై రూ.55,500 డిస్కౌంట్ ప్రకటించడం, అందులోనూ బిఎస్6 మోడల్‌పై ఈ తగ్గింపును అందించడం స్వాగతించదగిన అంశం.

More from DriveSpark

Article Published On: Thursday, June 11, 2020, 18:00 [IST]
English summary
American motorcycle manufacturer, Harley-Davison has announced a new discount offer on the Street Road BS6 motorcycle in the Indian market. The cruiser motorcycle is offered with a cash discount of Rs 55,500 for a limited period. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+