జనవరిలో హీరో మోటోకార్ప్ ద్వారా రీఎంట్రీ ఇవ్వనున్న హ్యార్లీ డేవిడ్‌సన్

అమెరికాకి చెందిన ఐకానిక్ టూవీలర్ బ్రాండ్ హ్యార్లీ డేవిడ్‌సన్, భారత్‌కి చెంజిన ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్‌తో ఓ వ్యాపర భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసినదే. ప్రస్తుతం భారత్ నుండి తొలగిపోయిన హ్యార్లీ డేవిడ్‌సన్ హీరో మోటోకార్ప్ ద్వారా వచ్చే జనవరి నుండి తిరిగి భారత్‌లో తమ వ్యాపారాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

జనవరిలో హీరో మోటోకార్ప్ ద్వారా రీఎంట్రీ ఇవ్వనున్న హ్యార్లీ డేవిడ్‌సన్

భారత మార్కెట్‌లో తమ వ్యూహాత్మక భవిష్యత్ ప్రణాళికల కోసం హీరో మోటోకార్ప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు హ్యార్లీ డేవిడ్‌సన్ ప్రకటించింది. ఇందులో భాగంగా, హీరో మోటోకార్ప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లను విక్రయించడమే కాకుండా సర్వీస్ కూడా చేయగలదు.

జనవరిలో హీరో మోటోకార్ప్ ద్వారా రీఎంట్రీ ఇవ్వనున్న హ్యార్లీ డేవిడ్‌సన్

ఇందుకు సంబంధించి హ్యార్లీ డేవిడ్‌సన్ ఇప్పుడు ఓ అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం, జనవరి 2021 నుండి హీరో మోటోకార్ప్ బ్రాండ్ ద్వారా భారతదేశంలో తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తామని హ్యార్లీ డేవిడ్‌సన్ పేర్కొంది.

MOST READ:ఇకపై ట్రాఫిక్ ఫైన్ చెల్లించకపోతే ఏమవుతుందో తెలుసా !

జనవరిలో హీరో మోటోకార్ప్ ద్వారా రీఎంట్రీ ఇవ్వనున్న హ్యార్లీ డేవిడ్‌సన్

భారతదేశంలో హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్ల యజమానులు వారంటీ మరియు H.O.G (హార్లే ఓనర్స్ గ్రూప్)తో సహా అన్ని ప్రయోజనాలను పొందడం కొనసాగిస్తారని కంపెనీ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ రెండు కంపెనీల మధ్య కుదిరిన భాగస్వామ్యానికి 'ది రివైర్' అనే పేరు పెట్టారు. భారతదేశంలో హ్యార్లీ డేవిడ్‌సన్ యొక్క కొత్త సమగ్ర వ్యాపార వ్యూహంలో భాగంగా ఈ కొత్త భాగస్వామ్యం పుట్టుకొచ్చింది.

జనవరిలో హీరో మోటోకార్ప్ ద్వారా రీఎంట్రీ ఇవ్వనున్న హ్యార్లీ డేవిడ్‌సన్

ఈ పంపిణీ ఒప్పందం ప్రకారం, హ్యార్లీ డేవిడ్‌సన్ పార్ట్స్, యాక్సెసరీస్, రైడింగ్ గేర్ మరియు దుస్తులు వంటి అధికారిక మర్చండైజ్ ఇప్పుడు బ్రాండ్-ఎక్స్‌క్లూజివ్ హెచ్-డి డీలర్లు మరియు భారతదేశం అంతటా ఉన్న హీరో యొక్క ప్రస్తుత డీలర్‌షిప్ నెట్‌వర్క్ రెండింటి ద్వారా కూడా అందుబాటులో ఉంటాయని హ్యార్లీ డేవిడ్‌సన్ తెలిపింది.

MOST READ:కొత్త స్టైల్‌లో సోనెట్ ఎస్‌యూవీ డెలివరీ చేసినా కియా మోటార్స్.. ఎలాగో తెలుసా ?

జనవరిలో హీరో మోటోకార్ప్ ద్వారా రీఎంట్రీ ఇవ్వనున్న హ్యార్లీ డేవిడ్‌సన్

లైసెన్సింగ్ ఒప్పందం ప్రకారం, హీరో మోటోకార్ప్ ఇప్పుడు భారతదేశంలో ఐకానిక్ ‘హ్యార్లీ డేవిడ్‌సన్' బ్రాండ్ పేరుతో అనేక రకాల ప్రీమియం మోటార్‌సైకిళ్లను అభివృద్ధి చేసి విక్రయించే అవకాశం ఉంటుంది. ఇరు తయారీదారుల మధ్య కుదిరిన ఒప్పందం అటు హీరో మోటోకార్ప్‌కు ఇటు హ్యార్లీ డేవిడ్‌సన్‌కు ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.

జనవరిలో హీరో మోటోకార్ప్ ద్వారా రీఎంట్రీ ఇవ్వనున్న హ్యార్లీ డేవిడ్‌సన్

ఈ భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న విస్తృతమైన హీరో మోటోకార్ప్ నెట్‌వర్క్ సాయంతో హ్యార్లీ డేవిడ్‌సన్ తమ మోటార్‌సైకిళ్లను వినియోగదారులకు మరింత చేరువ చేయనుంది. ఇంతకు ముందు చెప్పినట్లుగానే, ఐకానిక్ అమెరికన్ బ్రాండ్ హ్యార్లీ డేవిడ్‌సన్ మరియు ప్రపంచంలోనే అతిపెద్ద టూవీలర్ బ్రాండ్ హీరో మోటోకార్ప్‌ల మధ్య భాగస్వామ్యం హ్యార్లీ డేవిడ్‌సన్ యొక్క కొత్త వ్యాపార వ్యూహంలో భాగంగా ఉంటుంది.

MOST READ:వెయ్యి ఎల్‌ఎన్‌జి స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నెల్

జనవరిలో హీరో మోటోకార్ప్ ద్వారా రీఎంట్రీ ఇవ్వనున్న హ్యార్లీ డేవిడ్‌సన్

కరోనా మహమ్మారి తర్వాత దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు మరియు 2020లోని లాక్‌డౌన్ నాటి పరిస్థితులు హ్యార్లీ డేవిడ్‌సన్ అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపాయి. గత కొంత కాలంగా కంపెనీ భారత మార్కెట్లో నిలదొక్కుకునేందుకు కష్టపడుతోంది. భారతదేశంలోని బావాల్‌లో హ్యార్లీ డేవిడ్‌సన్ తమ తయారీ ప్లాంట్‌ను మూసివేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. గురుగ్రామ్‌లోని తన అమ్మకపు కార్యాలయంలో కూడా కార్యకలాపాలను గణనీయంగా తగ్గించి, ఉద్యోగులను కూడా తొలగించినట్లు సమాచారం.

జనవరిలో హీరో మోటోకార్ప్ ద్వారా రీఎంట్రీ ఇవ్వనున్న హ్యార్లీ డేవిడ్‌సన్

భారతదేశంలో హ్యార్లీ డేవిడ్‌సన్ బ్రాండ్‌కు భారీ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, దేశంలో విజృంభించిన కోవిడ్-19 మహమ్మారి మరియు తదుపరి లాక్‌డౌన్ తర్వాత ఏర్పడిన పరిస్థితులు కంపెనీ అమ్మకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఈ ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ నుండి ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్ స్ట్రీట్ 750 ధర సుమారు రూ.5 లక్షల ఎక్స్-షోరూమ్ (ఇండియా) రేంజ్‌లో ఉంది.

MOST READ:వరల్డ్ రికార్డ్ సృష్టించడానికి సిద్దమవుతున్న శ్రీ సిద్ధరూధ స్వామీజీ రైల్వే స్టేషన్ ; వివరాలు

జనవరిలో హీరో మోటోకార్ప్ ద్వారా రీఎంట్రీ ఇవ్వనున్న హ్యార్లీ డేవిడ్‌సన్

హ్యార్లీ డేవిడ్‌సన్ భారత్‌లో హీరో మోటోకార్ప్ ద్వారా రీఎంట్రీ ఇవ్వటంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హ్యార్లీ డేవిడ్‌సన్ మరియు హీరో మోటోకార్ప్‌ల మధ్య కుదిరిన ఈ ఒప్పందం ఇరు బ్రాండ్‌లకు లబ్ధి చేకూర్చనుంది. హీరో మోటోకార్ప్‌కి దేశవ్యాప్తంగా ఉన్న విస్తృతమైన డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా హ్యార్లీ డేవిడ్‌సన్ ఇకపై దేశంలోని మరిన్ని ప్రాంతాలకు తమ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Harley-Davidson to resume its India operations from January 2021. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X