హ్యార్లీ డేవిడ్‌సన్ నుంచి 350సీసీ మోటార్‌సైకిల్ - వివరాలు

అమెరికన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ హ్యార్లీ డేవిడ్‌సన్ ఇప్పుడు సామాన్య కస్టమర్ల కోసం కూడా అందుబాటులో ఉండేలా ఓ చిన్నసైజ్ ప్రీమియం మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తోంది. భారత్ వంటి హై వాల్యూమ్ టూవీలర్ మార్కెట్లో గట్టిగా నిలబడాలంటే హ్యార్లీ డేవిడ్‌సన్ అన్ని వర్గాల వినియోగదారులకు కూడా అందుబాటులో ఉండేలా హ్యార్లీ డేవిడ్‌సన్ తమ మోటార్‌సైకిళ్లను ఆఫర్ చేయాల్సిన అవసరం ఉంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ నుంచి 350సీసీ మోటార్‌సైకిల్ - వివరాలు

ఈ నేపథ్యంలో, హ్యార్లీ డేవిడ్‌సన్ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తోంది. చిన్న సామర్థ్యం గల మోటార్‌సైకిల్‌పై పనిచేస్తోంది. ఈ మోటార్‌సైకిల్‌ను చైనాకు చెందిన కియాన్‌జియాంగ్ మోటార్‌సైకిల్ కంపెనీకి (క్యూజే మోటార్స్ అని కూడా పిలుస్తారు) లైసెన్స్ చేయనున్నారు.

హ్యార్లీ డేవిడ్‌సన్ నుంచి 350సీసీ మోటార్‌సైకిల్ - వివరాలు

ప్రస్తుతానికి ఈ మోటార్‌సైకిల్ గురించి వివరాలు పరిమితంగానే ఉన్నప్పటికీ, హ్యార్లీ డేవిడ్‌సన్ మాత్రం తమ తుది ఉత్పత్తి రెండరింగ్‌ను విడుదల చేసింది. గాడివాడి ప్రకారం, త్వరలో విడుదల కాబోయే హ్యార్లీ చిన్న బైక్‌లో 350సీసీ పారలల్-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇప్పటి వరకూ హ్యార్లీ డేవిడ్‌సన్ వి షేపులో ఉండే వి-ట్విన్ ఇంజన్లను మాత్రమే తయారు చేసేది, తొలిసారిగా ఈ చిన్న మోటార్‌సైకిల్ కోసం పారలల్ ట్విన్ ఇంజన్‌ను డెవలప్ చేస్తోంది.

MOST READ: కెజిఎఫ్ స్టార్ యష్ లగ్జరీ కార్లు, ఎలా ఉన్నాయో చూసారా ?

హ్యార్లీ డేవిడ్‌సన్ నుంచి 350సీసీ మోటార్‌సైకిల్ - వివరాలు

కొత్త హ్యార్లీ చిన్న సామర్థ్యం గల మోటార్‌సైకిల్‌లో ఉపయోగించే ఫ్రేమ్, స్వింగ్‌ఆర్మ్, డిస్క్ బ్రేక్ రోటర్లను మరియు సస్పెన్షన్‌లను బెనెల్లి టిఎన్‌టి 300 నుండి గ్రహించే అవకాశం ఉంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ నుంచి 350సీసీ మోటార్‌సైకిల్ - వివరాలు

ఈ మోటార్‌సైకిల్‌లో బిఎస్6 వెర్షన్ 353సీసీ పారలల్-ట్విన్ ఇంజన్ ఉంటుంది. క్యూజే మోటార్స్ దాఖలు చేసిన టైప్-అప్రూవల్ పత్రాల ప్రకారం, క్యూజే350-13 / టిఎన్‌టి 300 (2021 మోడల్)లో 353సీసీ పారలల్-ట్విన్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది, ఇది గరిష్టంగా 35.5 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

MOST READ: లగ్జరీ బైక్‌పై కనిపించిన భారత సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి

హ్యార్లీ డేవిడ్‌సన్ నుంచి 350సీసీ మోటార్‌సైకిల్ - వివరాలు

అయితే, ఈ ఇంజన్‌ను కొత్త హ్యార్లీ డేవిడ్‌సన్ చిన్న మోటార్‌సైకిల్‌లో నేరుగా ఉపయోగించకుండా ఈ బ్రాండ్‌కి తగినట్లుగా ట్యూనింగ్ చేసి ఉపయోగించే ఆస్కారం ఉంది. తమ ఫ్యూచర్ మోటార్‌సైకిల్‌లో 353సీసీ పారలల్ ట్విన్ ఇంజన్ ఉంటుందని హ్యార్లీ డేవిడ్‌సన్ ఇప్పటికే వెల్లడించింది.

హ్యార్లీ డేవిడ్‌సన్ నుంచి 350సీసీ మోటార్‌సైకిల్ - వివరాలు

హ్యార్లీ నుంచి రాబోయే ఈ చిన్న మోటార్‌సైకిల్‌లో ఇంజన్ మరియు ఇతర హార్డ్‌వేర్‌లను క్యూ350-13 మోడల్‌తో పంచుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే డిజైన్‌ను మాత్రం ఫ్లాట్ ట్రాక్ స్టైల్ మోడళ్ల నుండి స్పూర్తి పొంది తయారు చేసే అవకాశం ఉంది.

MOST READ: కరోనా ఎఫెక్ట్ : పండ్లు అమ్ముకుంటున్న టాక్సీ & క్యాబ్ డ్రైవర్లు

హ్యార్లీ డేవిడ్‌సన్ నుంచి 350సీసీ మోటార్‌సైకిల్ - వివరాలు

హ్యార్లీ డేవిడ్‌సన్ షెడ్యూల్ ప్రకారం (క్రిస్‌మస్ 2021 కి దగ్గర్లో) ఈ కొత్త తక్కువ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిల్‌ను విడుదల చేయవచ్చనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది భారత మార్కెట్లో విడుదలైతే దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ.3 లక్షల నుండి రూ.3.5 లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ నుంచి 350సీసీ మోటార్‌సైకిల్ - వివరాలు

హ్యార్లీ డేవిడ్‌సన్ 350సీసీ మోటార్‌సైకిల్ భారత మార్కెట్లో విడుదలైతే ఇది ఈ సెగ్మెంట్లోని బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్, బెనెల్లి టిఎన్‌టి 300 మోడళ్లతో పోటీ పడనుంది.

MOST READ: బుడతడు ఉపయోగించడానికి బుల్లి కారు తయారుచేసిన తండ్రి

హ్యార్లీ డేవిడ్‌సన్ నుంచి 350సీసీ మోటార్‌సైకిల్ - వివరాలు

ఇక హ్యార్లీకి సంబంధించిన ఇతర వార్తలను పరిశీలిస్తే, ఈ బ్రాండ్ ఇటీవలే తమ 1200 కస్టమ్ మోడల్ ధరలను పెంచింది. ఇప్పుడు ఈ 1,202సీసీ మోటారుసైకిల్‌పై రూ.12,000 మేర ధర పెరిగింది. తాజా పెంపుతో దీని ప్రస్తుత ధర రూ.10.89 లక్షలు ఎక్స్-షోరూమ్, ఇండియాగా ఉంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ నుంచి 350సీసీ మోటార్‌సైకిల్ - వివరాలు

హ్యార్లీ డేవిడ్‌సన్ 350సీసీ మోటార్‌సైకిల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఈ మోటార్‌సైకిల్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికి ఇది ఊహాగానమే అయినప్పటికీ, భవిష్యత్తులో ఇది నిజమయ్యే అవకాశం లేకపోలేదు. గతంలో కూడా కూడా 1000సీసీ కంటే ఎప్పుడూ తక్కువ సామర్థ్యం లేకుండా మోటార్‌సైకిళ్లను తయారు చేసిన హ్యార్లీ డేవిడ్‌సన్ భారత్ వంటి ఏషియా మార్కెట్లు, అలాగే యూరప్ మార్కెట్ల కోసం స్ట్రీట్ 750 మోటార్‌సైకిల్‌ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసినదే.

Source:GaadiWaadi

Most Read Articles

English summary
American two-wheeler manufacturer, Harley-Davidson, has been working on a smaller capacity motorcycle that will be licenced to China based Qianjiang Motorcycle Co, also known as QJ Motors, for production. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X