హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపైన అమేజింగ్ ఆఫర్..ఇప్పుడు 29 వేలకే స్కూటర్

ఇండియన్ మార్కెట్లో బాగా ప్రసిద్ధి చెందిన సంస్థలలో హీరో మోటార్స్ ఒకటి. ఇప్పుడు ఈ సంస్థనుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయడం జరిగింది. వీటి యొక్క ఆఫర్స్ మరియు బెనెఫీట్స్ వంటి వాటిని గురించి తెలుసుకుందాం!

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపైన అమేజింగ్ ఆఫర్..ఇప్పుడు 29 వేలకే స్కూటర్

గురుగ్రామ్ ఆధారిత హీరో ఎలక్ట్రిక్ తన ఫ్లాష్ ఆల్-ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పరిమిత ఆఫర్లను అందిస్తోంది. కంపెనీ తన లీడ్-యాసిడ్ వేరియంట్‌పై దాదాపు రూ. 7,088 తగ్గింపును అందిస్తుంది. హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ యొక్క లిథియం-అయాన్ మరియు లీడ్-యాసిడ్ వేరియంట్‌లపై రూ. 10,500 వరకు పేటీఎం ప్రయోజనాలను అందిస్తోంది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపైన అమేజింగ్ ఆఫర్..ఇప్పుడు 29 వేలకే స్కూటర్

ఇండియాలో నార్త్ ఈస్ట్ మినహా మిగిలిన ప్రాంతాలలో 7,088 రూపాయల తగ్గింపుతో 29,990 రూపాయలకు మరియు నార్త్ ఈస్ట్ ఇండియాలో మాత్రం 32,710 రూపాయలతో ఈ వాహనాలను అందిస్తుంది. ఇది యువకులకు మరియు ఫస్ట్ టైం రైడ్ చేసే వారికి చాల అనుకూలంగా ఉంటుంది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపైన అమేజింగ్ ఆఫర్..ఇప్పుడు 29 వేలకే స్కూటర్

ఈ స్కూటర్‌లో సౌకర్యవంతమైన సీట్ ని కలిగి ఉండటంతో పాటు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రీజెనరేటివ్ బ్రేకింగ్ మరియు ఎల్‌ఇడి హెడ్‌లైట్లు ఉన్నాయి. ఫ్లాష్ ఒక తేలికపాటి విద్యుత్ మరియు దాని నియంత్రణకు 69 కిలోగ్రాముల (లిథియం-అయాన్ వేరియంట్) బరువు ఉంటుంది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపైన అమేజింగ్ ఆఫర్..ఇప్పుడు 29 వేలకే స్కూటర్

ఫ్లాష్ లీడ్-యాసిడ్ వేరియంట్ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇది పూర్తి ఛార్జింగ్ కలిగి ఉన్నప్పుడు 50 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. లిథియం-అయాన్ వేరియంట్ అదే టాప్ స్పీడ్‌ను అందిస్తుంది. అయితే పూర్తి ఛార్జింగ్ కలిగి ఉన్నప్పుడు దాదాపు15 కిలోమీటర్ల పరిధిని అదనంగా అందిస్తుంది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపైన అమేజింగ్ ఆఫర్..ఇప్పుడు 29 వేలకే స్కూటర్

లీడ్-ఆసిడ్ మరియు లిథియం అయాన్ వేరియంట్ రెండింటిలోనూ బ్యాటరీని పుల్ ఛార్జింగ్ తీసుకురావడానికి వరుసగా ఎనిమిది మరియు నాలుగు గంటల సమయం పడుతుంది. ఫ్లాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటాయి.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపైన అమేజింగ్ ఆఫర్..ఇప్పుడు 29 వేలకే స్కూటర్

హీరో ఎలక్ట్రిక్ వెహికల్స్ పంజాబ్‌లోని లుధియానాలో తయారు చేసే సదుపాయాన్ని కలిగి ఉంది. వీటి యొక్క వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1 లక్ష యూనిట్లు. ఈ కంపెనీ ఫోటాన్, ఆప్టిమా మరియు డాష్‌తో సహా మొత్తం పది ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లను తయారు చేస్తుంది. సంస్థ 12 సంవత్సరాలుగా 3 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించింది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపైన అమేజింగ్ ఆఫర్..ఇప్పుడు 29 వేలకే స్కూటర్

ఇప్పుడు చాలా సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడంపై ఆసక్తిని చూపిస్తున్నాయి. ఈ విధంగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడం వల్ల పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చు. ఎలాంటి వాతావరణ కలుషితం కాకుండా ఉండటానికి అనుగుణంగా ఉంటుంది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపైన అమేజింగ్ ఆఫర్..ఇప్పుడు 29 వేలకే స్కూటర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:

సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలపై ఇచ్చే ఏదైనా తగ్గింపు వాటి యొక్క అమ్మకాల స్థాయిని పెంచుతుంది. హీరో మోటార్స్ వాటి యొక్క ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అమ్మకాలను పెంచడానికి చేసిన ఆలోచన ఇది. సంస్థ ఇంకా తన ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లపై డిస్కౌంట్ మరియు బెనీఫీట్స్ ని అందిస్తుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Hero Electric Flash Scooter Limited Period Discounts: Benefits And Offers Up To Rs 10,500. Read in Telugu.
Story first published: Thursday, January 23, 2020, 17:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X