ఒకే సారి మూడు ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్

భారతదేశంలో ద్విచక్ర వాహన విభాగంలో అతి పెద్ద సంస్థ హీరో మోటార్స్. హీరో బ్రాండ్ నుంచి ఇప్పుడు 2020 ఆటో ఎక్స్‌పోలో మూడు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. వీటిని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

ఒకే సారి మూడు ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్

హీరో మోటార్స్ ఇప్పుడు జరుగుతున్న ఆటో ఎక్స్‌పోలో మూడు కొత్త ఉత్పత్తులను రిలీజ్ చేసింది. అవి ఒకటి ఎఇ-29 ఎలక్ట్రిక్ స్కూటర్, రెండు ఎఇ-3 ఎలక్ట్రిక్ ట్రైక్ మరియు మూడవ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎఇ-47 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్.

ఒకే సారి మూడు ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్

హీరో సంస్థ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ ముంజాల్ మాటాడుతూ వినియోగదారుల అవసరాలను తీర్చడానికి సాంకేతిక వాహనాలను ప్రవేశపెడుతున్నామని, 2030 నాటికి దేశంలో దాదాపు అన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని, దీనికి ప్రభుత్వం కూడా తనవంతు సహాయాన్ని అందించాలని చెప్పారు.

ఒకే సారి మూడు ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్

ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడం వల్ల పర్యావరణ సమతుల్యతని కాపాడవచ్చని, భవిష్యత్ లో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలు రావడం వల్ల ఇంధన కొరత ఉండదని తెలియజేసారు. హీరో బ్రాండ్ నుంచి ఇప్పుడు మోటార్ సైకిల్, ట్రెక్ మరియు స్కూటర్ అనే మూడు ఎలక్ట్రిక్ ఉత్పత్తులు వెలువడ్డాయి.

ఒకే సారి మూడు ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్

హీరో ఎఇ-47 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లో 4 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ మరియు 3.5 కిలోవాట్ల లిథియం ఆయన బ్యాటరీ ప్యాక్ ని కలిగి ఉంటుంది. ఇది గంటకు 85 కిలోమీటర్ల వేగంతో 0 నుంచి 60 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 9 సెకన్ల కాలంలో చేరుకోగల సామర్త్యాన్ని కలిగి ఉంటుంది.

ఒకే సారి మూడు ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్

హీరో ఎలక్ట్రిక్ ఎఇ -47 లో బ్యాటరీ ఎకో మోడ్‌లో గరిష్టంగా 160 కిలోమీటర్ల పరిధిని అందిస్తాయి. ఇది ఒక సారి పుల్ ఛార్జింగ్ చేయడానికి 4 గంటల సమయం పడుతుంది.

ఒకే సారి మూడు ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్

హీరో ఎఇ -47 ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ డిస్క్ బ్రేక్‌లతో సహా అనేక ఫీచర్స్ ని కలిగి ఉంటుంది. మోటారుసైకిల్ వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ కలిగి ఉంటుంది. ఇందులో క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ ఫంక్షన్, మొబైల్ యాప్ కనెక్టివిటీ, రియల్ టైమ్ వెహికల్ ట్రాకింగ్ మరియు జియో-ఫెన్సింగ్ వంటివి కూడా ఉంటాయి.

ఒకే సారి మూడు ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్

హీరో ఎలక్ట్రిక్ యొక్క రెండవ వాహనం హై-స్పీడ్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎఇ- 29. హీరో ఎలక్ట్రిక్ ఎఇ- 29 స్కూటర్ 1కెడబ్ల్యు ఎలక్ట్రిక్ మోటారుతో అదే 48 వి / 3.5 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో జతచేయబడుతుంది, ఇది గంటకి 55 కిలోమీటర్ల వేగాన్ని కలిగి ఉంటుంది. ఒకే ఛార్జీపై గరిష్టంగా 80 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

ఒకే సారి మూడు ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్

హీరో ఎలక్ట్రిక్ ఎఇ- 29 మొదటి ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, యాంటీ-తెఫ్ట్ స్మార్ట్ లాక్, మొబైల్ ఛార్జర్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వాక్ అసిస్ట్ మరియు రివర్స్ ఫంక్షన్ వంటి లక్షణాలతో వస్తుంది.

ఒకే సారి మూడు ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్

ఇంకా హీరో ఎలక్ట్రిక్ యొక్క చివరి ఉత్పత్తి ఎఇ-3 ఎలక్ట్రిక్ ట్రైక్. ఎఇ-3 ఎలక్ట్రిక్ ట్రైక్ 5.5 కెడబ్ల్యు ఎలక్ట్రిక్ మోటారుతో 48 వి / 4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ట్రైక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకే ఛార్జ్‌లో గరిష్టంగా 100 కిలోమీటర్ల పరిధిని మరియు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో అందిస్తుంది.

ఒకే సారి మూడు ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హీరో ఎలక్ట్రిక్ దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు. ఆటో ఎక్స్‌పో 2020 లో కంపెనీ భారత మార్కెట్ కోసం సరికొత్త ఎలక్ట్రిక్ మొబిలిటీ ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టిన తరువాత మార్కెట్లో అమ్మకాలను మెరుగు పరచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

Most Read Articles

English summary
Auto Expo 2020: Hero Electric AE-47 Motorcycle, AE-29 Scooter & AE-3 Trike Revealed. Read in Telugu.
Story first published: Wednesday, February 5, 2020, 19:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X