స్పాట్ టెస్టులో కనిపించిన హీరో ఎలక్ట్రిక్ బైక్
భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్న ద్విచక్రవాహన తయారీ కంపెనీ హీరో మోటార్స్. ఈ కంపెనీ చాలా రకాల వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. హీరో మోటార్ సైకిల్స్ నాణ్యతలో మరియు మన్నికలొ రారాజు. ఇప్పుడు ఈ కంపెనీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

హీరో మోటార్స్ సంస్థ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటారుసైకిల్‌ను రాబోయే ఆటో ఎక్స్‌పో 2020 లో విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నది. దీనిని 150-160 సిసి స్ట్రీట్ మోడల్ లాగా రూపొందించనుంది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్స్ గురించి బ్యాటరీ ప్యాక్ గురించి ఇంకా ఖచ్చితమైన సమాచారం లేదు. కానీ 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రారంభించబడుతుంది మాత్రం కచ్చితంగా చెప్పగలము. ఇది గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇంకా ఒకే చార్జిపై 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. దీని ధర దాదాపు రూ. 1.5 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది.

ఇది సాధారణ స్ట్రీట్ మోడల్ బైక్ లాగా ఉంటుంది. ఇందులో ఫ్లాట్ వైడ్ హ్యాండిల్ బార్, రెగ్యులర్ మోటార్ సైకిల్లో ఉండేటువంటి ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. బ్యాటరీ ప్యాక్ అల్లాయ్ వీల్స్ వద్ద ఉంటుంది. రెండు చివరలలో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు మోనోషాక్ వంటివి ఇందులో ఉంటాయి.

రాబోయే హీరో ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ పుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, రిమోట్ డయాగ్నస్టిక్స్ తో పాటు స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ మరియు నావిగేషన్ ఉంటుందని భావిస్తున్నారు.

2020 ఆటో ఎక్స్‌పోలో ప్రారంభించనున్న ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ హీరో బ్రాండ్ నుంచి వస్తున్న మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఇప్పుడు పంజాబ్ లోని లుథియానాలో జరుగుతుంది. కంపెనీ సంవత్సరానికి 1,00,000 యూనిట్ల ఉత్పాదక సామర్త్యాన్ని కలిగి ఉండాలని యోచిస్తోంది.

ఇప్పటికే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ ని 2020 ఆటో ఎక్స్‌పో ప్రారంభించనుంది. ఈ వెహికల్స్ ఆటో ఎక్స్‌పోలో లాంచ్ అయిన తరువాత మరిన్ని వివరాలు మనకు తెలుస్తాయి.
Source: Carandbike


Click it and Unblock the Notifications








