హీరో మోటోకార్ప్ నుండి రాబోతున్న ఫ్రీడో, ఇది ఎలక్ట్రిక్ స్కూటరా...కాదా?

ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్. భవిష్యత్తులో భారతీయ మార్కెట్లో సరికొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీని గురించి మరింత తెలుసుకుందాం!

హీరో మోటోకార్ప్ నుండి రాబోతున్న ఫ్రీడో ఎలక్ట్రిక్ స్కూటరా...కాదా?

హీరో మోటోకార్ప్ నుండి వెలువడే ఈ వాహనానికి ప్రీడో అని నామకరణం చేసారు. ఈ వాహనానికి సంబంధించిన ట్రేడ్‌మార్క్ దరఖాస్తుని సంబంధిత అధికారులకి అందించడం జరిగింది. భవిష్యత్ లో రాబోవు ఈ ఫ్రీడో గురించి ఖచ్చితమైన వివరాలు మనకు తెలియదు. ఫ్రీడో అనే పదానికి తెలుగులో స్వేచ్ఛ అని అర్థం వస్తుంది. హీరో మోటోకార్ప్ పెద్ద సంస్థ కాబట్టి ఇందులో నుంచి విడుదలయ్యే వాహనం కూడా ఆధునిక కాలానికి నమ్మదగినదిగా ఉండవచ్చు.

హీరో మోటోకార్ప్ నుండి రాబోతున్న ఫ్రీడో ఎలక్ట్రిక్ స్కూటరా...కాదా?

ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ కావచ్చునని వివిధ నివేదికలు అభిప్రాయపడుతున్నాయి. ఇది దేశంలో కొన్ని నగరాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెడో స్కూటర్ ఇప్పుడు మార్కెట్లో అత్యుత్తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్ అయిన ఏథర్ ఎనర్జీ యొక్క ఇష్టాలను స్వీకరించవచ్చు. ఇంకా బ్రాండ్ యొక్క ప్రాధమిక ప్రత్యర్థులలో ఒకరైన బజాజ్ ఆటో పూర్తి-ఎలక్ట్రిక్ ఐకానిక్ చేతక్ పేరును పునరుద్ధరించడానికి సిద్ధమవుతోంది.

హీరో మోటోకార్ప్ నుండి రాబోతున్న ఫ్రీడో ఎలక్ట్రిక్ స్కూటరా...కాదా?

హీరో మోటోకార్ప్ ఇంతకు ముందే 2016 ఆటో ఎక్స్‌పో లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రదర్శించింది. ఇది డ్యూయెట్ ఆల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్. హీరో మోటోకార్ప్ వారి ఫ్రీడో ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ యొక్క ప్రొడక్షన్ వెర్షన్ పేరు 4 సంవత్సరాల క్రితమే ప్రదర్శించబడింది. ఫ్రీడో అనేది హీరో యొక్క రాబోయే పెట్రోల్ పవర్డ్ స్కూటర్ లేదా మోటారుసైకిల్ పేరు కావచ్చు. ఇప్పుడు స్కూటరా లేదా మోటార్ సైకిలా అనే విషయాన్ని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేము.

హీరో మోటోకార్ప్ నుండి రాబోతున్న ఫ్రీడో ఎలక్ట్రిక్ స్కూటరా...కాదా?

హీరో మోటోకార్ప్ ప్రస్తుతం దేశంలో ఆరు స్కూటర్లను విక్రయిస్తోంది. అవి ప్లెజర్, డ్యూయెట్, ప్లెజర్ +, మాస్ట్రో ఎడ్జ్, డెస్టిని 125 మరియు మాస్ట్రో ఎడ్జ్ 125. మరియు ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్ సైకిల్.

హీరో మోటోకార్ప్ నుండి రాబోతున్న ఫ్రీడో ఎలక్ట్రిక్ స్కూటరా...కాదా?

హీరో మోటోకార్ప్ కి ప్రపంచంలోనే అతిపెద్ద మోటారుసైకిల్ తయారీదారు అనే బిరుదు ప్రయాణికుల భారీ-వాల్యూమ్ అమ్మకాల ద్వారా ఈ పేరు పొందింది. ఈ సంస్థ యొక్క ప్రయాణికుల పోర్ట్‌ఫోలియో చాలా ఎక్కువ అయినప్పుడు మరొక కొత్త మోడల్ ను ప్రవేశపెడుతుంది. ఈ విధంగా ప్రవేశపెట్టడం వల్ల అమ్మకాలలో ప్రయోజనం ఉంటుంది. ఎల్లప్పుడూ ఈ సంస్థ మోటార్ సైకిళ్ళ తయారీపై ద్రుష్టి పెడుతుంది.

హీరో మోటోకార్ప్ నుండి రాబోతున్న ఫ్రీడో ఎలక్ట్రిక్ స్కూటరా...కాదా?

హీరో మోటోకార్ప్ యొక్క ఫ్రీడో వాహనం గురించి ఖచ్చితమైన నిర్ధారణకు చాలా తొందరగా చేరుకుంటుందని గుర్తుంచుకోవాలి. రాబోయే హీరో ఫ్రీడో చాలావరకు ఎలక్ట్రిక్ స్కూటర్ అవుతుంది. రాబోయే నెలల్లో దీని గురించి అసలు విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాము.

Read More:విమానాలు పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఎందుకు వెళ్లకూడదు....తెలుసా!

హీరో మోటోకార్ప్ నుండి రాబోతున్న ఫ్రీడో ఎలక్ట్రిక్ స్కూటరా...కాదా?

దేశంలో అతిపెద్ద ద్వైపార్షిక ఆటోమోటివ్ ఎగ్జిబిషన్ ఈవెంట్ అయిన ఆటో ఎక్స్‌పో 2020 దాటవేస్తున్నట్లు హీరో మోటోకార్ప్ ఇప్పటికే ప్రకటించింది. ఇది మాత్రమే కాకుండా చాలామంది వాహన తయారీదారులు చాలా కారణాలవల్ల ఈ 2020 ఆటో ఎక్స్‌పో నుండి వైదొలుగుతున్నట్లు నిర్ణయించుకున్నాయి. కానీ హీరో మోటోకార్ప్ భారతదేశం యొక్క నంబర్ 1 ద్విచక్ర వాహన సంస్థ కాబట్టి అదే చేయాలని అనుకోలేదు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఈ విధంగా చేయవలసి వచ్చింది. లేకుంటే ఆటో ఎక్స్‌పో లో హీరో ఫ్రీడో వేదిక వద్ద ప్రధానంగా ఉండేది

Source: Rushlane

Most Read Articles

English summary
Hero Freedo name registered – Is it new electric scooter-REad in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X