Just In
- 24 min ago
కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి
- 1 hr ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
- 2 hrs ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- 3 hrs ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
Don't Miss
- Sports
ఆసీస్ పర్యటనలో నా విజయ రహస్యం ఇదే: మహ్మద్ సిరాజ్
- News
సుప్రీం తీర్పుతో డైలమాలో సర్కారు, ఉద్యోగులు- ఎస్ఈసీకి సహకారం ? కీలక చర్చలు
- Lifestyle
తమకు కాబోయే వారిలో ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఏమి కోరుకుంటారో తెలుసా...
- Movies
30 ఏళ్ళ తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్ అన్నయ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త కనెక్టెడ్ టెక్నాలజీ ప్రవేశపెట్టిన హీరో మోటోకార్ప్ : ధర, వివరాలు & ఉపయోగాలు
దేశీయ మార్కెట్లో హీరో మోటోకార్ప్ తన మూడు ఉత్పత్తులలో 'హీరో కనెక్ట్' అనే కొత్త స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త కనెక్టివిటీ ఫీచర్ ఇప్పుడు హీరో ఎక్స్‌ప్లస్ 200, డెస్టిని 125 మరియు ప్లెజర్ ప్లస్ వంటి వాటిలో లభిస్తుంది.

కనెక్టివిటీ ఫీచర్ ఇప్పుడు పరిచయ ధర రూ. 4,999 కు ఇవ్వబడింది. అయితే తరువాతి దశలో ధర రూ. 6,499 కు పెరిగే అవకాశం ఉంది. కనెక్ట్ చేయబడిన టెక్ ప్రత్యేక యాప్ ద్వారా రైడర్ యొక్క స్మార్ట్‌ఫోన్‌కు జత చేయడం ద్వారా పనిచేస్తుంది, ఇది అదనపు ఫీచర్లలను అందిస్తుంది.

ఈ స్మార్ట్ ఫీచర్లలలో కొత్త కనెక్ట్ టెక్నాలజీతో హీరో మోటోకార్ప్ శ్రేణికి చెందిన మూడు మోడళ్లకు వెహికల్ మరియు రైడర్ సేఫ్టీ మరియు రైడింగ్ రిపోర్ట్ ఆధారంగా ఫీచర్లు లభిస్తాయి.
రైడర్ సేఫ్టీ ఫీచర్ లో టాపిల్ అలర్ట్ కూడా ఉంది, ఇది వాహనం బోల్తా పడితే మీ రిజిస్టర్డ్ నంబర్ మరియు అత్యవసర పరిచయాలకు టెక్స్ట్ ద్వారా నోటిఫికేషన్లను పంపుతుంది. లైవ్ ట్రాకింగ్, టో-అవే వార్ణింగ్, లాస్ట్ పార్క్ లొకేషన్ మరియు జియోఫెన్సింగ్ వంటివి వాహన సేఫ్టీ ఫీచర్స్ లో ఉన్నాయి.
MOST READ:కొత్త యాప్ లాంచ్ చేసిన టివిఎస్ ; దీని ఉపయోగం ఏంటో మీకు తెలుసా ?

రైడింగ్ రిపోర్ట్ రైడర్ యొక్క ట్రిప్ అనాలసిస్, డ్రైవింగ్ స్కోరు మరియు స్పీడ్ అలర్ట్ ఇస్తుంది. గత ఆరు నెలల్లో ప్రయాణించిన దూరం, తీసుకున్న సమయం మరియు ఎంచుకున్న మార్గం వంటి రైడర్ రివ్యూ వివరాలను తెలియజేయడానికి సహాయపడుతుంది.

హీరో కనెక్ట్ ఫీచర్ ప్రస్తుతం దాని మూడు మోడళ్లకు మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో కంపెనీ తన మొత్తం ఉత్పత్తి శ్రేణిలో ఈ ఫీచర్ విడుదల చేస్తుందని మేము ఆశిస్తున్నాము. హీరో ఎక్స్‌ప్లస్ 200, డెస్టిని 125 మరియు ప్లెజర్ ప్లస్ ఆయా విభాగాలలో ప్రసిద్ధమైన ఆఫర్లు, ఇవి బ్రాండ్‌కు నెలవారీ మంచి అమ్మకాలను తెస్తాయి.
MOST READ:మీకు తెలుసా.. రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 లోని ఇంట్రస్టింగ్ ఫీచర్స్, ఇవే

ఈ సంవత్సరం ప్రారంభంలో అమ్మకాలకు అంతరాయం కలిగినప్పటికీ కంపెనీ తిరిగి మంచి అమ్మకతో ముందుకు వెళ్తోంది. పండుగ సీజన్, వాహనాలను కొనుగోలు చేయాలన్న డిమాండ్ ఎక్కువ అమ్మకాలకు ప్రధాన కారణమని హీరో మోటోకార్ప్ పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో ముగిసిన 32 రోజుల పండుగ సీజన్లో బ్రాండ్ 14 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసినట్లు హీరో ప్రకటించింది.

డ్రైవ్స్పార్క్ అభిప్రాయం:
భారతీయ మార్కెట్లో హీరో మోటోకార్ప్ తన ఉత్పత్తులపై కనెక్ట్ చేయబడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ప్రారంభించింది. హీరో మోటోకార్ప్ కాకుండా, టివిఎస్ కంపెనీ కూడా తన ఉత్పత్తులను కనెక్ట్ చేసిన టెక్నలజీతో అందిస్తుంది. ఈ కొత్త టెక్నాలజీలు వాహనదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
MOST READ:మనదేశంలో అక్కడ కమర్షియల్ వాహనాలకు రోడ్ టాక్స్ 50% తగ్గింపు, ఎక్కడో తెలుసా