ఇప్పుడే చూడండి... మాడిఫైడ్ చేయబడిన కరిజ్మా బైక్

చాలా మంది వాహన వినియోగదారులు మాడిఫైడ్ చేయబడిన వాహనాలను ఉపయోగించడానికి చాలా ఉత్సాహాన్ని చూపిస్తారు. మాడిఫైడ్ చేయబడిన వాహనాలు చూడటానికి కొత్తగా కనిపిస్తాయి. ఇలాంటి వాహనాలను చాల మంది వినియోగించాలనుకుంటారు. ఇదే విధంగా కాలికట్ లో కరిజ్మా బైక్ ని మాడిఫైడ్ చేయడం జరిగింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం!

ఇప్పుడే చూడండి... మాడిఫైడ్ చేయబడిన కరిజ్మా బైక్

కాలికట్ ఆధారిత కస్టమ్ మోటారుసైకిల్ బిల్డర్ మొహమ్మద్ ఆదిల్ తన మొట్టమొదటి కస్టమ్ మోటారుసైకిల్ ని పూర్తి చేసాడు - మాడిఫైడ్ చేయబడిన హీరో కరిజ్మా ఆర్ కి కటలాన్ అని పేరు మార్చడం జరిగింది. మలయాళంలో "కటలాన్" అనే పదానికి అర్థం ‘అడవిలో పుట్టిన వేటగాడు'.

ఇప్పుడే చూడండి... మాడిఫైడ్ చేయబడిన కరిజ్మా బైక్

కరిజ్మా ఆర్ లో చాలా మార్పులు జరిగాయి. ఇవన్నీ మోటారుసైకిల్‌కి స్ట్రిప్డ్ డౌన్ స్క్రాంబ్లర్ రూపాన్ని ఇస్తాయి. మొహమ్మద్ ఆదిల్ కస్టమ్ నిర్మించిన కరిజ్మా యొక్క కొన్ని పోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. మాడిఫైడ్ చేయబడిన కరిజ్మా చాలా సరళంగా మరియు చాలా ఫంక్షనల్ హెడ్‌లైట్ సమీకరణాన్ని కలిగి ఉంది.

ఇప్పుడే చూడండి... మాడిఫైడ్ చేయబడిన కరిజ్మా బైక్

ఈ మోటార్ సైకిల్ లో లెన్స్ గ్రిల్, ఫోర్క్ స్టేస్‌లో అమర్చిన టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ మరియు ర్యాలీ స్టైల్ ఫ్రంట్ మడ్‌గార్డ్ ఉన్న సాధారణ రౌండ్ హెడ్‌లైట్ వంటివి ఉంటాయి. రైడర్ కి సాద్యమైనంత ఉత్తమ రైడింగ్ అనుభవాన్ని కల్పించడానికి సరైన హ్యాండిల్ బార్ ని కలిగి ఉంటుంది. ఇందులో అల్యూమినియం స్విచ్-గేర్ ప్యానెల్, సింగిల్ పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు స్టార్టర్ మరియు కిల్-స్విచ్ మాడ్యూల్స్ కూడా ఉన్నాయి. ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ పై దిక్సూచి ఉంటుంది.

ఇప్పుడే చూడండి... మాడిఫైడ్ చేయబడిన కరిజ్మా బైక్

మాడిఫైడ్ చేయబడిన హీరో కరిజ్మా ఆర్ లోని ఎయిర్ ఇంటెక్ సిస్టమ్ ఒక కస్టమ్ బిల్ట్ బాక్స్‌లో ఉంది. ఇది సైడ్ ప్యానెల్ వెనుక భాగంలో ఉంచి, ఫ్రంట్ ఫోర్క్‌లు హీరో ఇంపల్స్ యొక్క ఫ్రంట్ ఫోర్క్‌లతో మార్చుకోబడ్డాయి. దీనివల్ల ఎక్కువ దూరం ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. అదనంగా టాప్ మౌంటెడ్ స్టెయిన్లెస్ స్టీల్ వన్-టు-టూ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉంది. ఒక మఫ్లర్ బ్లాక్-అవుట్ చేయబడింది.

ఇప్పుడే చూడండి... మాడిఫైడ్ చేయబడిన కరిజ్మా బైక్

కఠినమైన రోడ్లలో ప్రయాణించడానికి ఈ వెహికల్ యొక్క వెనుక భాగంలో ఒక ఫ్లెక్స్ పైపు ఉంటుంది. స్క్రాంబ్లర్ స్టైల్ హీరో కరిజ్మా ఆర్ ముందు భాగంలో టిమ్సన్ 90/90 -19 టైర్లు మరియు వెనుక వైపు రాల్కో 120/90 -17 టైర్లను కలిగి ఉంది. ఈ టైర్లు ఎటువంటిగి రోడ్లలో ప్రయాణించడానికైనా అనుకూలంగా ఉంటాయి.

ఇప్పుడే చూడండి... మాడిఫైడ్ చేయబడిన కరిజ్మా బైక్

మాడిఫైడ్ చేయబడిన ఈ మోటార్ సైకిల్ కి మంచి పెయింట్ చేయబడింది. ట్యాంక్ మీద బ్రిటిష్ గ్రీన్, సేడ్ పానెల్ మరియు ఫ్రంట్ మడ్గార్డ్ పై శాటిన్ కలర్, హ్యాండిల్ బార్ మరియు వీల్ రిమ్స్ నలుపు రంగులో ఉన్నాయి. కానీ ఈ మోటార్ సైకిల్ యొక్క ఇంజిన్లో ఎటువంటి మార్పులు చేయబడలేదు. హీరో కరిజ్మా ఆర్ యొక్క 223 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 19.2 బిహెచ్‌పి శక్తి వద్ద, 19.35 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఈ బైక్ యొక్క పనితీరు మరియు శక్తీ వంటి వాటిని గమనించినట్లయితే మాడిఫైడ్ చేయబడిన ఈ బైక్ కరిజ్మా ఆర్ కంటే మెరుగైనదిగా ఉంటుంది.

ఇప్పుడే చూడండి... మాడిఫైడ్ చేయబడిన కరిజ్మా బైక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:

మొహమ్మద్ ఆదిల్ కరిజ్మా ఆర్ ని అద్భుతంగా మాడిఫైడ్ చేశారు. దీనిని తయారుచేయడానికి దాదాపు 2 సంవత్సరాల కాలం పట్టింది. ఈ బైక్ చాలా వరకు మాడిఫైడ్ చేయడం జరిగింది, కానీ ఇంజిన్లో మాత్రం ఎటువంటి మార్పు జరగలేదు. ఇది చూడటాన్ని ఆకర్షణీయంగా ఉండటంతోపాటు ఎటువంటి రోడ్లలో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.

Image Courtesy: dsmoke78/Instagram

Most Read Articles

English summary
Hero Karizma modified into a scrambler – Meet the Katalan. Read in Telugu.
Story first published: Monday, January 27, 2020, 12:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X