ఇక కరిజ్మా బైకుపై ఆశలు వదులుకోవలసిందే.. ఎందుకో మీరే చూడండి!

భారతదేశంలో ద్విచక్ర వాహనతయారీలో మొదటి స్థానంలో ఉన్న సంస్థ హీరో మోటోకార్ప్. ఇప్పుడు ఈ హీరో కంపెనీ కరిజ్మా మోటార్ సైకిల్ ఉత్పత్తిని నిలిపివేయనుంది. కుర్రకారుని ఉర్రూతలూగించిన కరిజ్మా మోటార్ సైకిల్ ఎందుకు నిలిపివేసిందనే దాని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

ఇక కరిజ్మా బైకుపై ఆశలు వదులుకోవలసిందే.. ఎందుకో మీరే చూడండి!

హీరో సంస్థ నుండి విడుదలైనప్పటి నుంచి కరిజ్మా అతి తక్కువకాలంలో బాగా ప్రాచుర్యం చెందింది. అతి తక్కువ కాలంలో అంత గొప్ప ఆదరణను కలిగిన కరిజ్మా ఉత్పత్తులు ఇప్పుడు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

ఇక కరిజ్మా బైకుపై ఆశలు వదులుకోవలసిందే.. ఎందుకో మీరే చూడండి!

ఇటీవల కాలంలో అన్ని కంపెనీలు తమ వాహనాలను బిఎస్-6 ఉద్గారా ప్రమాణాలకు అనుగుణంగా అప్డేట్ చేస్తూ ఉన్నాయి. కానీ కరిజ్మా మాత్రం బిఎస్-6 నిబంధనలను అందుకోవడం లేదు. మార్కెట్లో కరిజ్మా నిలిపివేయడానికి ఇది ప్రధాన కారణం.

ఇక కరిజ్మా బైకుపై ఆశలు వదులుకోవలసిందే.. ఎందుకో మీరే చూడండి!

హీరో మోటోకార్ప్ చివరకు కరిజ్మాను తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో నుండి నిలిపివేసింది. కరిజ్మా అధికారిక హీరో మోటోకార్ప్ వెబ్‌సైట్‌లోని ఉత్పత్తి జాబితా నుండి కంపెనీ మోటార్‌సైకిల్‌ను తొలగించినప్పుడు ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఏది ఏమైనా భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో ఔత్సాహికుల మనస్సులో కరిజ్మా బైక్ ఒక చెరగని ముద్రగా నిలిచి ఉంటుంది.

ఇక కరిజ్మా బైకుపై ఆశలు వదులుకోవలసిందే.. ఎందుకో మీరే చూడండి!

హీరో హొండా ఉత్పత్తులలో కరిజ్మా ప్రధానమైన ఉత్పత్తి. ఇది 2003 లో స్పోర్ట్ మోటార్ గా ప్రారంభించబడి తరువాత 2007 లో కరిజ్మా ఆర్ రూపంలో కాస్మెటిక్ అప్‌గ్రేడ్లను పొందింది. మళ్ళీ 2009 లో హీరో కరిజ్మాను జెడ్ఎమ్ఆర్ మోనికర్‌లో గణనీయమైన సౌందర్య నవీకరణలతో ప్రవేశపెట్టారు.

ఇక కరిజ్మా బైకుపై ఆశలు వదులుకోవలసిందే.. ఎందుకో మీరే చూడండి!

హీరో మోటార్ సైకిల్స్ మరియు మరియు హొండా కంపెనీ కలిసి ఉత్పతులను కొనసాగించేవి. కానీ 2010 లో ఈ రెండు కూడా విడిపోయాయి. ఈ కారణంగా కరిజ్మా హీరో మోటోకార్ప్ అనే కొత్త పేరుతో వచ్చింది. తరువాత కాలంలో ఈ రెండు సంస్థలు విడిపోయిన తరువాత హీరో మోటోకాట్ప్ ఒకటే చాలా ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కానీ కరిజ్మా మాత్రం కొత్త నవీనీకరణలను పొందలేదు.

ఇక కరిజ్మా బైకుపై ఆశలు వదులుకోవలసిందే.. ఎందుకో మీరే చూడండి!

సాధారణంగా కరిజ్మా మోటార్ సైకిల్ కి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. కానీ దానిని బిఎస్-6 నిబంధనలకు అనుగుణంగా తయారు చేయడానికి వీలు లేనందున దీని ఉత్పత్తి నిలివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఇక కరిజ్మా బైకుపై ఆశలు వదులుకోవలసిందే.. ఎందుకో మీరే చూడండి!

హీరో కరిజ్మాలో 223 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 19.2 బిహెచ్‌పి మరియు 19.35 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడి ఉంటుంది. కానీ ఇప్పుడు కరిజ్మా ఆధునిక మోటారుసైకిల్ ప్రమాణాలలో పనితీరు గణాంకాలు అంతగా ఆకట్టుకోకపోవచ్చు.

ఇక కరిజ్మా బైకుపై ఆశలు వదులుకోవలసిందే.. ఎందుకో మీరే చూడండి!

కరిజ్మా దాని చివరి అవతారంలో హీరో కరిజ్మా జెడ్‌ఎంఆర్ విడుదలైంది. దీని ధర దాదాపు రూ. 1.10 లక్షల (ఎక్స్‌షోరూమ్) వరకు ఉంది. కరిజ్మా బైక్ పునర్నిర్మించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ రాబోయే రోజుల్లో కరిజ్మా యొక్క నిజమైన వారసుడికోసం చాల మంది వినియోగదారులు ఎదురుచూస్తున్నారు.

ఇక కరిజ్మా బైకుపై ఆశలు వదులుకోవలసిందే.. ఎందుకో మీరే చూడండి!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కరిజ్మా మోటార్సీకి హీరో యొక్క నెం.1 బ్రాండ్. కానీ ఆధునిక కాలంలో బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగునంగా నవీనీకరించేలేకపోవడం వల్ల, ఈ ఉత్పత్తులను కంపెనీ పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడమే కాకూండా కంపెనీ యొక్క వెబ్ సైట్ లో కూడా తొలగించింది. ఇప్పుడు కరిజ్మా స్థానంలో వచ్చే కరిజ్మా యొక్క నిజమైన వారసుడి కోసం కొంతకాలం ఎదురు చూడక తప్పదు.

Most Read Articles

English summary
Hero Karizma BS6 ruled out – Motorcycle name removed from website. Read in telugu.
Story first published: Friday, February 14, 2020, 11:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X