హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

భారతదేశపు నెంబర్ వన్ టూవీలర్ బ్రాండ్ హీరో మోటోకార్ప్ దేశీయ విపణిలో తమ కొత్త "హీరో మాస్ట్రో ఎడ్జ్ 110" బిఎస్6 మోడల్‌ను విడుదల చేసింది. బిఎస్6 మాస్ట్రో ఎడ్జ్ స్కూటర్ రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.60,950, ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంది.

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 స్కూటర్ బిఎస్6కి అప్‌డేటెడ్ చేయబడిన ఇంజన్‌తో పాటుగా సరికొత్త ఫీచర్లతో లభ్యం కానుంది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ‘అల్లాయ్ వీల్ - ఎఫ్‌ఐ' ధర రూ.62,450, ఎక్స్‌షోరూమ్, ఢిల్లీగా ఉంది. ఈ రెండు వేరియంట్లలో కొద్దిపాటి కాస్మెటిక్ తేడాలు ఉన్నాయి.

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 స్కూటర్ ఇదివరకటి బిఎస్4 ఇంజన్‌నే కొత్తగా బిఎస్6 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసి ఉపయోగించారు. ఇందులోని 110.9 సిసి ఇంజన్ ఇప్పుడు ఇంధన-ఇంజెక్ట్ చేయబడింది. మెరుగైన మైలేజ్ మరియు పెర్ఫార్మెన్స్ కోసం ఇందులో ఎక్స్‌సెన్స్ టెక్నాలజీని ఉపయోగించారు.

MOST READ:భీష్మ డైరెక్టర్‌కి రేంజ్ రోవర్ గిఫ్ట్ గా ఇచ్చిన హీరో నితిన్, ఎందుకో తెలుసా !

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ ఇంజన్ ఇప్పుడు గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8 బిహెచ్‌పి శక్తిని మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.75 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ బిఎస్6 అప్‌గ్రేడ్‌ను పొందినప్పటికీ, దాని పవర్ మరియు టార్క్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇవి మునపటి మాదిరిగానే ఉంటాయి.

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

హీరో మోటోకార్ప్ పేర్కొన్న సమాచారం ప్రకారం, మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్ 6 స్కూటర్‌లో ఉపయోగించిన స్మార్ట్ సెన్సార్ టెక్నాలజీ కారణంగా మెరుగైన పిక్-అప్, ఆల్-వెదర్ ఈజీ స్టార్ట్, ఎత్తుగా ఉండే రోడ్లపైకి ఎక్కడానికి మెరుగైన గ్రేడిబిలిటీ మరియు సున్నితమైన రైడ్ లభిస్తుంది. ఈ స్కూటర్‌లో ఫ్యూయెల్ కట్‌-ఆఫ్‌తో కూడిన బ్యాంక్ యాంగిల్ సెన్సార్ కూడా ఉంటుంది, ఇది మరింత మెరుగైన రక్షణను ఇస్తుంది.

MOST READ:హీరో లెక్ట్రో ఇ-సైకిల్ లాంచ్ : ధర & ఇతరవివరాలు

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 స్కూటర్‌లో హాలోజన్ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడి టెయిల్ లాంప్, డ్యూయెల్-టోన్ రియర్ వ్యూ మిర్రర్స్, కాంబినేషన్ లాక్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్-ఫిల్లర్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు సర్వీస్ రిమైండర్‌ మరియు సైడ్ స్టాండ్ ఇండికేటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ స్కూటర్‌లో అండర్ సీట్ స్టోరేజ్‌లో ఉంచిన యుఎస్‌బి ఛార్జింగ్ స్లాట్‌తో పాటుగా బూట్-లైట్, స్టబ్బీగా కనిపించే ఎగ్జాస్ట్, రియర్ గ్రాబ్ రైల్స్ మరియు డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ:మీకు తెలుసా.. ఇది భారతదేశపు వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 స్కూటర్ కొలతలను గమనిస్తే, ఇది 1843 మిమీ పొడవు, 715 మిమీ వెడల్పు, 1188 మిమీ ఎత్తు మరియు 1261 మిమీ వీల్ బేస్‌ను కలిగి ఉంటుంది. దీని రైడర్ సీటు ఎత్తు 775 మి.మీ మరియు ఈ స్కూటర్ భూమిపై నుండి 155 మి.మీలతో మంచి గ్రైండ్ క్లియరెన్స్‌ను ఆఫర్ చేస్తుంది. దీని మొత్తం 112 కిలోల బరువును మరియు ఇంధన ట్యాంక్ సామర్థ్యం 5 లీటర్లుగా ఉంటుంది.

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇక స్కూటర్‌ సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపు సింగిల్ సైడ్ షాక్ అబ్జార్బర్ ఉంటాయి. ఇందులో ఇరువైపులా డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంటుంది, ఇది బ్రాండ్ యొక్క ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను సపోర్ట్ చేస్తుంది.

MOST READ:కొత్త కారు కొన్న సన్నీలియోన్ : ఈ కార్ రేటెంతో ఎంతో తెలుసా ?

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ స్కూటర్ ముందు భాగంలో 90/90 సెక్షన్ ట్యూబ్‌లెస్ టైర్‌తో కూడిన 12 ఇంచ్ అల్లాయ్ వీల్ ఉంటుంది మరియు వెనుక వైపు 90 ఇంచ్ ట్యూబ్‌లెస్ టైర్‌తో కూడిన 10 ఇంచ్ అల్లాయ్ వీల్ ఉంటుంది. హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 కిక్ లేదా సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్‌తో లభిస్తుంది.

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 ఎక్స్‌టీరియర్ డిజైన్ ఇదివరకటిలానే ఉంటుంది. అయితే, ఈ స్కూటర్ ఇప్పుడు ఆరు కొత్త రంగులలో అప్‌గ్రేడెడ్ గ్రాఫిక్స్‌తో లభిస్తుంది. ఇందులో పెరల్ ఫేడ్‌లెస్ వైట్, మిడ్‌నైట్ బ్లూ, కాండీ బ్లేజింగ్ రెడ్, టెక్నో బ్లూ, పాంథర్ బ్లాక్ మరియు సీల్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లభిస్తున్నాయి.

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్6 స్కూటర్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 బిఎస్ 6 స్కూటర్ ఆధునిక డిజైన్, ఆకర్షణీయమైన గ్రాఫిక్స్‌తో పాటుగా అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. ఇది దేశంలోని యువ కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 స్కూటర్ ఈ విభాగంలో హోండా యాక్టివా 6జి మరియు టివిఎస్ జూపిటర్ బిఎస్6 వంటి మోడళ్లకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Hero MotoCrop has launched the new Maestro Edge 110 BS6 scooter in the Indian market. The updated scooter is sold in two variants with prices starting at Rs 60,950, ex-showroom (Delhi). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X