యూత్ కోసం లేటెస్ట్ స్కూటర్ లాంచ్ చేసిన హీరో
హీరో మోటోకార్ప్ యూత్ కోసం సరికొత్త హీరో మాయెస్ట్రో ఎడ్జ్ 125 బీఎస్6 స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. కాలేజీ స్టూడెంట్స్ మరియు యూత్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన మాయెస్ట్రో ఎడ్జ్ స్కూటర్‌ను ఎట్టకేలకు బీఎస్6 ప్రమాణాలతో రీలాంచ్ చేసింది. 2020 హీరో మాయెస్ట్రో ఎడ్జ్ 125 బీఎస్6 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 67,960 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

హీరో మాయెస్ట్రో ఎడ్జ్ 125 బీఎస్6 మోడల్‌లో కాస్మోటక్స్ లేదా డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు జరగలేదు. చూడటానికి అచ్చం బీఎస్4 తరహాలోనే ఉంటుంది. అయితే యంగ్ కస్టమర్లను ఆకర్షించే షార్ప్ మరియు స్పోర్టివ్ ఎలిమెంట్స్ యధావిధిగా వచ్చాయి.

మాయెస్ట్రో ఎడ్జ్ 125 బీఎస్6 స్కూటర్‌లో బయటివైపు వచ్చిన ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, సెమీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్-స్టాండ్ ఇండికేటర్ మరియు సర్వీస్ ఇండికేటర్ వంటి ఫీచర్లు వచ్చాయి. ఇందులో హీరో వారి ఐ3ఎస్ (స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ) మరియు రైడర్లు తమ స్మార్ట్ ఫోన్ ఛార్జ్ చేసుకునేందుకు అండర్ సీట్ UCB పోర్ట్ వంటివి ఉన్నాయి.

సాంకేతికంగా ఇందులో బీఎస్6 ప్రమాణాలను పాటించే 124.6సీసీ కెపాసిటీ గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 9బిహెచ్‌పి పవర్ మరియు 10.4ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

సరికొత్త హీరో మాయెస్ట్రో ఎడ్జ్ 125 బీఎస్6 స్కూటర్ మూడు విభిన్న వేరియంట్లలో లభిస్తోంది.
అల్లాయ్ వీల్ & డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 67,950
అల్లాయ్ వీల్ & డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 70,150
అల్లాయ్ వీల్ & డిస్క్ బ్రేక్ & విభిన్నమైన కలర్ స్కీమ్ వేరియంట్ ధర రూ. 70,650
అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.

హీరో మాయెస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్ మార్కెట్లో ఉన్న టీవీఎస్ ఎన్‌టార్క్ 125, సుజుకి యాక్సెస్ 125, యమహా రే జడ్ఆర్ 125 మరియు హోండా యాక్టివా 125 మోడళ్లకు సరాసరి పోటీనిస్తుంది.

హీరో మోటోకార్ప్ సంస్థ ఇటీవల ప్యాసన్ ప్రో, గ్లామర్ మరియు డెస్టినీ 125 మోడళ్లను బీఎస్6 వెర్షన్‌లో లాంచ్ చేసింది. పాత బీఎస్4 ఇంజన్ స్థానంలో భారత ప్రభుత్వం తప్పనిసరి చేసిన బీఎస్6 ప్రమాణాలతో లేటెస్ట్ ఇంజన్‌ను అప్‌గ్రేడ్ చేసింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
హీరో మోటోకార్ప్ ప్రతిరోజు ఒక మోడల్‌ను బీఎస్6 ప్రమాణాలతో విపణిలోకి లాంచ్ చేస్తూనే ఉంది. కస్టమర్లకు ధర బారం కాకుండా స్వల్ప పెంపుతో బీఎస్6 వేరియంట్లలో ప్రవేశపెడుతోంది. హీరో మాయెస్ట్రో ఎడ్జ్ 125 బీఎస్6 మోడల్ హీరో లైనప్‌లో మోస్ట్ ట్రెండింగ్ స్కూటర్. సేల్స్ పరంగా మిగతా మోడళ్లతో పోలిస్తే కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ యువ కొనుగోలుదారులకు ఇది బెస్ట్ ఛాయిస్. మరిన్ని ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగు చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








