ఆగస్ట్ నెలలో ఆగని హీరో మోటోకార్ప్ జోరు

భారత అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ గడచిన ఆగస్టు నెలలో 5,84,456 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసినట్లు ప్రకటించింది. గత 2019 ఇదే నెలలో పోలిస్తే కంపెనీ 7.55 శాతం వృద్ధిని సాధించింది. ఆ సమయంలో కంపెనీ 5,43,406 యూనిట్లను విక్రయించింది.

ఆగస్ట్ నెలలో ఆగని హీరో మోటోకార్ప్ జోరు

భారత మార్కెట్లో కోవిడ్ మహమ్మారికి ముందు అమ్మకాల వాల్యూమ్‌లను అధిగమించగలిగామని కంపెనీ ప్రకటించింది. హీరో మోటోకార్ప్ నెలవారీ అమ్మకాల విషయానికొస్తే, కంపెనీ 13 శాతం వృద్ధిని నమోదు చేసింది. జూలై 2020లో కంపెనీ 5,14,509 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

ఆగస్ట్ నెలలో ఆగని హీరో మోటోకార్ప్ జోరు

ఆగస్ట్ నెల మొత్తం అమ్మకాలలో, 5,44,658 యూనిట్లు మోటార్‌సైకిళ్ళు, మిగిలిన 39,798 యూనిట్లు స్కూటర్లుగా ఉన్నాయి. అలాగే, మొత్తం వాల్యూమ్‌లో ఎగుమతి అమ్మకాలు 15,782 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. దేశీయ అమ్మకాలు పెరిగినప్పటికీ, ఎగుమతి అమ్మకాలు మాత్రం క్షీణించాయి. హీరో మోటోకార్ప్ ఆగస్టులో 19,403 యూనిట్లను ఎగుమతి చేసింది.

MOST READ:ముంబై నుండి చెన్నైకి 1,350 కి.మీ నడిచిన వృద్ధుడు, ఇతని కథ వింటే మీకు కన్నీళ్లు వస్తాయి

ఆగస్ట్ నెలలో ఆగని హీరో మోటోకార్ప్ జోరు

హీరో మోటోకార్ప్ పేర్కొన్న సమాచారం ప్రకారం, వారి ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ గ్రామీణ మరియు సెమీ అర్బన్ కేంద్రాల నుండి వస్తోంది. రాబోయే నెలల్లో, ముఖ్యంగా పండుగ సీజన్ రావడంతో ఈ డిమాండ్ మరింత పెరుగుతుందని హీరో మోటోకార్ప్ ఆశిస్తోంది. కస్టమర్ విశ్వాసాన్ని పెంచడం, ఆకర్షనీయమైన ఆఫర్లను అదించడం ద్వారా ఇధి సాధ్యమవుతుందని కంపెనీ భావిస్తోంది.

ఆగస్ట్ నెలలో ఆగని హీరో మోటోకార్ప్ జోరు

హీరో మోటోకార్ప్ ఇప్పుడు తమ ఉత్పత్తి ప్లాంట్లలో దాదాపు 100 శాతం సామర్థ్యంతో నిర్వహిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. హీరో మోటోకార్ప్ ఇటీవలే భారత మార్కెట్లో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ ప్రారంభ ధర రూ.99,950, ఎక్స్‌షోరూమ్, ఢిల్లీగా ఉంది.

MOST READ:ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుదక్కించుకున్న 7 ఏళ్ల బుడతడు.. ఇంతకీ ఏంటో అతని ప్రత్యేకత తెలుసా ?

ఆగస్ట్ నెలలో ఆగని హీరో మోటోకార్ప్ జోరు

హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి: డ్రమ్ మరియు డిస్క్ బ్రేక్. రెండు వేరియంట్లలోనూ ఒకేరకమైన 163సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 15 బిహెచ్‌పి శక్తిని మరియు 14 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఆగస్ట్ నెలలో ఆగని హీరో మోటోకార్ప్ జోరు

హీరో మోటోకార్ప్ ఆగస్ట్ సేల్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హీరో మోటోకార్ప్ ఆగస్టు 2020 నెలలో తన ప్రీ-కోవిడ్ అమ్మకాల వాల్యూమ్ స్థాయిలను అధిగమించగలిగింది. రాబోయే నెలల్లో కూడా ఇదే సానుకూల ధోరణిని ముందుకు తీసుకెళ్లడం పట్ల కంపెనీ ఇప్పుడు మరింత ఆశాజనకంగా ఉంది.

MOST READ:హవ్వ.. 23 కోట్ల రూపాయలకు అమ్ముడైన 54 ఏళ్ల పాత ఫెరారీ కారు

Most Read Articles

English summary
Hero MotoCorp has announced that the company has registered sales of 584,456 units in the month of August 2020. This is a 7.55% growth as compared to its sales during the same month in 2019 when it sold 543,406 units. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X