Just In
- 14 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 15 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 16 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 17 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్‌తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అమ్మకాలలో హోండానే అధిగమించిన హీరో మోటోకార్ప్
భారతదేశంలో మోటార్ సైకిల్స్ అమ్మకాలు గత సంవత్సరం కంటే ఈ ఆర్ధిక సంవత్సరంలో చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. వివిధ కంపెనీల మోటార్ సైకిల్స్ యొక్క అమ్మకాలను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
హీరో మోటోకార్ప్ 2020 సంవత్సరంలో 62,31,458 యూనిట్లను విక్రయించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు దాదాపు 18.1% పడిపోయాయి. హోండా మోటార్‌సైకిల్ అమ్మకాలు 47,06,589 యూనిట్లుగా ఉండగా, అంతకుముందు ఏడాది కంటే ఇది 14.7% తగ్గింది.
హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్ కంపెనీతో సహా దాదాపు అన్ని ఆటో కంపెనీల అమ్మకాలు పడిపోయాయి. గత ఆర్థిక సంవత్సరంలో బైక్ విభాగం 18% క్షీణించింది. దేశీయ మార్కెట్లో స్కూటర్ల కంటే బైక్‌లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.
MOST READ:ఈ మాడిఫైడ్ సుజుకి జిమ్నీ ఎస్యువి హార్స్ పవర్ ఎంతో తెలుసా..?
గత ఏడాది దేశీయ మార్కెట్లో 64% బైక్‌లు అమ్ముడయ్యాయి. ఈ అమ్మకంలో హీరో స్ప్లెండర్ మోటార్ బైక్స్ మొదటి స్థానంలో నిలిచింది. స్ప్లెండర్ బైక్ హీరో మోటోకార్ప్ సంస్థ అమ్మకాలకు బాగా ఉపయోగపడుతోంది. హీరో స్ప్లెండర్ ఆర్ధిక సంవత్సరం 2020 లో 26,32,800 యూనిట్లను విక్రయించింది.
హీరో స్ప్లెండర్ తరువాత భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన స్కూటర్ హోండా ఆక్టివా. గత ఏడాది హోండా యాక్టివా 25,91,059 యూనిట్లను విక్రయించింది. ఈ స్కూటర్ మొత్తం స్కూటర్ అమ్మకాలలో 14% వాటాను కలిగి ఉంది.
MOST READ:కలకత్తా ప్రజల కోసం వీధుల్లోకి వచ్చిన మమతా బెనర్జీ
హీరో మోటోకార్ప్ యొక్క హెచ్ఎఫ్ డీలక్స్ కూడా పెద్ద సంఖ్యలో అమ్ముడవుతోంది. గత ఏడాది హెచ్ఎఫ్ డీలక్స్ 20 లక్షల యూనిట్లను విక్రయించింది. హోండాకు చెందిన సిబి షైన్ బైక్ 9.5 లక్షల యూనిట్లను విక్రయించింది.
టీవీఎస్ జూపిటర్ స్కూటర్ విషయానికొస్తే ఇది ఏకంగా 5,95,545 యూనిట్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఈ స్కూటర్ అమ్మకాలలో 24% పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో స్కూటర్ 7,88,417 యూనిట్లను విక్రయించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
MOST READ: భారతదేశంలో నార్టన్ బైక్‌లను తయారీ చేయనున్న టీవీఎస్
సుజుకి మోటార్ సైకిల్స్ కంపెనీ మాత్రమే ఈ ఏడాది అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. సుజుకి మోటార్‌సైకిల్ ఈ ఏడాది 6,85,223 యూనిట్లను విక్రయించింది. కంపెనీ గత ఏడాది 6,68,787 యూనిట్లను విక్రయించింది. దీని ఫలితంగా ఈ సంవత్సరం 2.5% ఎక్కువ అమ్మకాలు జరిగాయి.
యమహా కంపెనీ అమ్మకాలలో ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ ఏడాది యమహా అమ్మకాలు ఒక్కసారిగా 28% పడిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో బైక్ మార్కెట్ పెద్ద తిరోగమనాన్ని చూస్తుందని అంచనా.
MOST READ:కారు పేపర్లు చూపమంటే రోడ్డు మీద పడి ఏడ్చిన అమ్మాయి : వీడియో